Home /News /jobs /

TSPSC GROUP 1 NOTIFICATION HERE IS DEPARTMENTS WISE EDUCATION QUALIFICATIONS DETAILS NS

TSPSC Group 1: గ్రూప్ 1 జాబ్స్ కు అప్లై చేస్తున్నారా? అయితే, విభాగాల వారీగా విద్యార్హతలివే.. తెలుసుకోండి

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ ను నిన్న విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ 503 ఖాళీలకు సంబంధించిన విద్యార్హతల వివరాలు ఇలా ఉన్నాయి.

    తెలంగాణలో నిన్న గ్రూప్1 నోటిఫికేషన్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే.. మొత్తం 503 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు అధికారులు. మే 2వ తేదీ నుంచి ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.  దరఖాస్తుకు మే 31ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు  ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని ప్రకటనలో స్పష్టం చేశారు. అభ్యర్థులు టీఎస్పీఎస్సీ అధికారిక వెబ్ సైట్ (https://www.tspsc.gov.in/website) లో ధరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.  గ్రూప్-1లో 19 రకాల పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొంది తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC). గ్రూప్-1లో ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున మెయిన్స్‌కు ఎంపిక చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఇటీవల గ్రూప్ 1 కు సంబంధించి ఇంటర్వ్యూలను రద్దు చేసింది తెలంగాణ సర్కార్. దీంతో కేవలం 900 మార్కులకే మెయిన్స్ ఎగ్జామ్ ను నిర్వహించనున్నారు.  ఈ ఉద్యోగాలకు సంబంధించి విద్యార్హతల వివరాలు ఇలా ఉన్నాయి.

    1.డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ, సీటీఓ, డీపీఓ, జిల్లా రిజిస్ట్రార్, సహాయ ఎక్సైజ్ సూపరింటెండెంట్, పురపాలక కమిషనర్లు, బీసీ, ఎస్టీ సంక్షేమ అధికారులు, ఉపాధి అధికారి, ఏఓ, ఎంపీడీఓ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు ఏదైనా విభాగంలో డిగ్రీ విద్యార్హత పొంది ఉండాలి. యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుంచి ఈ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
    - ఇంకా డీఎస్పీ, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ (AES) ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటున్న పురుషులు 167.6 సెంటీమీటర్ల ఎత్తు కలిగి ఉండాలి. ఛాతి కొలత 86.3 సెం.మీ ఉండాలి.
    -ఈ ఖాళీలకు అప్లై చేయాలనుకుంటున్న మహిళా అభ్యర్థులు 152.5 సెంటీమీటర్ల ఎత్తు, 45.5 కిలోల బరువు ఉండాలి.
    2.సాంఘీక సంక్షేమ ఏడీ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటున్న అభ్యర్థులు డిగ్రీ ఉత్తీర్ణత ధించి ఉండాలి. సోషియాలజీ, సామాజిక సేవలో డిగ్రీ చేసిన వారికి ప్రాధాన్యం ఉంటుంది.

    3.సహాయ ట్రెజరీ అధికారి పోస్టులకు కామర్స్/ఎకనామిక్స్/మాథ్స్ సబ్జెక్టుల్లో డిగ్రీ చేసి ఉండాలి. సెకండ్ క్లాస్ లో పాసై ఉండాలి.
    4.ప్రాంతీయ రవాణా అధికారి పోస్టులకు మెకానికల్/ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లేదా తత్సమాన డిగ్రీ పాసై ఉండాలి.
    5.అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ పోస్టుకు ఏదైనా డిగ్రీ పాసైన వారు అప్లై చేసుకోవచ్చు. ఇంకా కార్మిక సంక్షేమానికి సంబంధించిన సమాజిక సేవ(సోషల్ వర్క్)లో పీజీ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Job notification, Telangana government jobs, TSPSC

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు