హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

TSPSC Group 1 Mains Exam Dates: గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష షెడ్యూల్ విడుదల..

TSPSC Group 1 Mains Exam Dates: గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష షెడ్యూల్ విడుదల..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

టీఎస్పీఎస్సీ ద్వారా నిర్వహించే గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షకు సంబంధించి పరీక్షల తేదీలను టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోండి.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

టీఎస్పీఎస్సీ(TSPSC) ద్వారా నిర్వహించే గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షకు సంబంధించి పరీక్షల తేదీలను టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. ఈ పరీక్షలను జూన్ 05 నుంచి జూన్ 12 వరకు ఉండనున్నట్లు పేర్కొన్నారు.

జూన్ 05న - జనరల్ ఇంగ్లీష్ పేపర్

జూన్ 06న - పేపర్ 1 - జనరల్ ఎస్సై

జూన్ 07న - పేపర్ 2- హిస్టరీ, జియోగ్రఫీ, కల్చర్

జూన్ 08న - పేపర్ 3 - ఇండియన్ సొసైటీ, రాజ్యాంగం, గవర్నెన్స్

జూన్ 09న - పేపర్ 4 - ఎకానమి అండ్ డెవలప్ మెంట్

జూన్ 10న - పేపర్ 5 - సైన్స్ అండ్ టెక్నాలజీ, డేటా ఇంటర్ ప్రెటేషన్

జూన్ 12న - పేపర్ 6 - తెలంగాణ మూవ్ మెంట్ అండ్ ఫార్మేషన్

మెయిన్స్ పరీక్ష కోసం తాత్కాలికంగా అర్హత సాధించిన అభ్యర్థులకు జూన్ 05 నుంచి జూన్ 12 వరకు హైదరాబాద్ లో మాత్రమే పరీక్ష కేంద్రాలను కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. మెయిన్ పరీక్షను ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ భాషల్లో నిర్వహిస్తారు. ప్రధాన పరీక్షలో జనరల్ ఇంగ్లీషు మినహా మిగిలిన 6 పేపర్లను మెరిట్ బేసిస్ మీద తీసుకుంటారు. జనరల్ ఇంగ్లీషు కేవలం అర్హత పరీక్షమాత్రమే. అభ్యర్థులు ఎంచుకున్న భాష ఇంగ్లీష్ - తెలుగు లేదా ఉర్దూ - తెలుగులో ఏదో ఒకదానిని ఎంచుకోవాల్సి ఉంటుంది.

పేపర్‌లో కొంత భాగాన్ని ఇంగ్లీషులో , కొంత భాగాన్ని తెలుగు లేదా ఉర్దూలో రాయడానికి అనుమతి లేదని ప్రెస్ నోట్ లో టీఎస్పీఎస్సీ పేర్కొంది. జనరల్ ఇంగ్లీష్ పేపర్ క్వాలిఫైయింగ్ మాత్రమే అని.. దీనిలో ప్రశ్నలు సెకండరీ స్కూల్ లెవల్ లో ఉంటాయని పేర్కొన్నారు. ఈ పేపర్‌లో వచ్చిన మార్కులు ర్యాంకింగ్ కోసం లెక్కించబడవని తెలిపారు. మెయిన్ పరీక్షకు అర్హత సాధించిన అభ్యర్థి తప్పనిసరిగా అన్నింటికీ హాజరు కావాలి. ఏదైనా పేపర్‌కు హాజరు కాకపోతే.. వారి పేపర్లను పరిగణలోకి తీసుకోవడం కుదరదని తెలిపారు. అన్ని పేపర్లకు పరీక్ష సమయం 10.00 A.M. నుండి 1.00 P.M ఉంటుంది. ప్రతీ పేపర్ కు 3 గంటల వ్యవధి ఉంటుంది. ఆరు పేపర్లకు 150 మార్కుల చొప్పున కేటాయించారు. ఇంగ్లీష్ లో క్వాలిఫై అయితే సరిపోతుంది.

First published:

Tags: Group 1, JOBS, TSPSC

ఉత్తమ కథలు