Home /News /jobs /

TSPSC GROUP 1 LAST DATE EXTENDED HERE FULL DETAILS NS

TSPSC Group 1 Last Date: తెలంగాణ నిరుద్యోగులకు అలర్ట్.. గ్రూప్ 1 దరఖాస్తు గడువు పొడిగింపు.. వివరాలివే

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

తెలంగాణలో గ్రూప్ 1 ఉద్యోగాలకు (Telangana Group 1 Jobs) సంబంధించి ఆఖరి తేదీన తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) పొడిగించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    తెలంగాణలో తొలి గ్రూప్-1 జాబ్ నోటిఫికేషన్ (TSPSC Group 1 Notification) ను ఇటీవల తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) నెల రోజుల క్రితం విడుదల చేసిన విషయం తెలిసిందే. మొత్తం 503 ఖాళీల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ మే 2వ తేదీన ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి తొలుత ఈ నెల 31ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అయితే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 దరఖాస్తుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. దరఖాస్తు గడువును పొడిగించింది. దరఖాస్తు గడువును జూన్ 4వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడించింది. అభ్యర్థులు వినతి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) వెల్లడించింది. గ్రూప్ 1 ఉద్యోగాలకు సంబంధించి ఇప్పటి వరకు 3 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. గడువు పొడిగించడంతో ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

    తెలంగాణలో గ్రూప్ 1 ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులు వారు స్థానికులా? స్థానికేతరులా? అని స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. అందుకోసం బోన‌ఫైడ్స్ సర్టిఫికేట్స్ సమర్పించాల్సి ఉంటుంది. అయితే.. గతంలో పలు స్కూల్స్ లో చదివిన అభ్యర్థులు ఇప్పుడు అవి మూతపడడంతో అవస్థలు పడుతున్నారు. దీంతో ఈ సర్టిఫికేట్స్ లేకపోవడంతో అభ్యర్థులు తిరుగుతున్నారు. చిన్నప్పుడు తాము చదివిన స్కూల్స్, సంబంధిత విద్యాశాఖ అధికారుల కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో బోనఫైడ్స్‌కి సంబంధించి TSPSC ఇటీవల క్లారిటీ ఇచ్చింది.
    TS Govt Jobs Preparation: పోలీస్‌, గ్రూప్‌-1 ప‌రీక్ష‌ల‌కు ప్రిపేర్ అవుతున్నారా.. ఈ టాపిక్స్ ఇంపార్టెంట్‌!

    గ్రూప్-1 దరఖాస్తుకు సంబంధించి బోనఫైడ్ అవసరం లేదని టీఎస్పీఎస్సీ తెలిపింది. విద్యార్హతల సర్టిఫికెట్లు అప్‌లోడ్ చేయడం తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. స్థానికులకు 95 శాతం రిజర్వేషన్లు కల్పించనున్న నేపథ్యంలో 1 నుంచి 7వ తరగతి వరకు ఎక్కడ చదివారన్నది మాత్రమే ముఖ్యమని తెలిపింది తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. కానీ, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సమయంలో దరఖాస్తులో తెలిపిన వివరాలు వేరుగా ఉంటే చట్టపర చర్యలు తప్పవని టీఎస్‌పీఎస్సీ హెచ్చరించింది. బోనఫైడ్ సర్టిఫికెట్‌కు బదులుగా లోకల్ ఏరియా లేదా ఇతర సర్టిఫికెట్లు చూపిస్తే సరిపోతుందని కొందరు భావిస్తున్నారని, అది అపోహేనని టీఎస్పీఎస్సీ స్పష్టం చేసింది.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Job notification, JOBS, Telangana government jobs, TSPSC

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు