Home /News /jobs /

TSPSC GROUP 1 GOOD NEWS TO ASPIRANTS FREE COACHING IN T SAT NETWORK NS

TSPSC Group-1 Free Coaching: తెలంగాణ గ్రూప్-1 అభ్యర్థులకు అలర్ట్.. ఈ రోజు నుంచి టీవీలో ఫ్రీగా పాఠాలు.. ఇంగ్లిష్ మీడియంలోనూ..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణలో గ్రూప్ 1 అభ్యర్థులకు టీసాట్ నెట్వర్క్ శుభవార్త చెప్పింది. ఉచితంగా క్లాసులు ప్రసారం చేయనున్నట్లు ప్రకటించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

    తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే గ్రూప్ -1 పోటీ (TSPSC Group 1) పరీక్షలకు టీ-సాట్ నెట్వర్క్ శుభవార్త చెప్పింది. ఆంగ్ల మాధ్యమానికి సంబంధించిన పాఠ్యాంశాలనూ సిద్ధం చేసింది. జూలై ఒకటవ తేదీ నుంచి అక్టోబర్ ఐదవ తేదీ వరకు గంట పాటు ప్రత్యేక ప్రసారాలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు టీ-సాట్ (T-SAT) సీఈవో రాంపురం శైలేష్ రెడ్డి తాజాగా ప్రకటన విడుదల చేశారు. ఆంగ్ల మాధ్యమ ప్రసారాలకు సంబంధించిన వివరాలు వెళ్లడించారు. తెలంగాణ ప్రభుత్వం తొలిసారిగా భర్తీ చేస్తున్న గ్రూప్-1 ఉద్యోగాలకు (Group1 Jobs) ఇంగ్లీష్ మీడియం అభ్యర్థుల కోసం ఇంగ్లీష్ భాషలో సుమారు 60 గంటల పాఠ్యాంశ భాగాలను ప్రసారం చేస్తున్నట్లు ప్రకటించారు. జూలై రెండవ తేదీ నుంచి ప్రతి రోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి 10 గంటల వరకు టీ-సాట్ విద్య ఛానల్ లో అరగంట నిడివిగల రెండు పాఠ్యాంశాలు ప్రసారమవుతాయన్నారు. ఇవే పాఠ్యాంశాలు రాత్రి తొమ్మిది గంటల నుండి 10 గంటల వరకు నిపుణ ఛానల్ లో పునప్రసారమవుతాయన్నారు. గ్రూప్-1 ఉద్యోగార్థుల కోసం ఇప్పటికే తెలుగు మాధ్యమంలో టి-సాట్ ప్రత్యేక ప్రణాళిక సిద్దం చేసి గత నెల రోజులుగా అరగంట నిడివి గల సుమారు 200 పాఠ్యాంశాలను ప్రసారం చేసిందన్నారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ విద్యార్థుల కోసం చేస్తున్న ప్రసారాలను అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

    'ప్రశ్నలు-సమాధానాలు' ప్రత్యేక కార్యక్రమం:
    గ్రూప్-1 పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల కోసం తెరపై కన్పించే విధంగా ప్రశ్నలు-సమాధానాలతో ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించి ప్రసారం చేస్తున్నామని టీ-సాట్ సీఈవో ఆర్.శైలేష్ రెడ్డి తెలిపారు. సబ్జెక్టుకు సంబంధించిన ప్రశ్నలను.. వాటికి సంబంధించిన సమాధానాలను ఆసక్తికరంగా వివరిస్తూ రూపొందించిన కార్యక్రమం ప్రతిరోజూ సాయంత్రం గంట పాటు ఉంటుందన్నారు.
    TSPSC Group-4 Notification: తెలంగాణ నిరుద్యోగులకు బీ రెడీ.. 9,618 పోస్టులతో గ్రూప్-4 నోటిఫికేషన్.. పూర్తి వివరాలివే



    సాయంత్రం ఐదు నుంచి ఆరు గంటల వరకు ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్నామన్నారు. బుల్లి తెరపై ‘ప్రశ్నలు-సమాధానం’ కార్యక్రమానికి ప్రేక్షకులలో మంచి ఆదరణ లభిస్తున్నందున ఈ పద్ధతిని ఎంచుకున్నట్లు సీఈవో వివరించారు. ప్రస్తుతం గ్రూప్-1 ఉద్యోగులకు సంబంధించిన కంటెంట్ పై కార్యక్రమాన్ని రూపొందించగా, భవిష్యత్ లో ఇతర పోటీ పరీక్షలకూ ఇలాంటి తరహాలో ప్రసారాలు అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: JOBS, Telangana government jobs, TSPSC

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు