TSPSC GROUP 1 GOOD NEWS FOR GROUP CANDIDATES KEY GO 55 RELEASE ON POST FILLING EVK
TSPSC Group 1: గ్రూప్స్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ఖాళీల భర్తీపై కీలక జీవో.. పోస్టుల వివరాలు
(ఫ్రతీకాత్మక చిత్రం)
TSPSC Group 1 | తెలంగాణలో గ్రూప్ 1కు సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక జీవో 55ను విడుదల చేసింది. ఈ జీవో ఆధారంగా గ్రూప్-1 పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి..
తెలంగాణలో గ్రూప్ 1కు సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ (TSPSC Group 1) విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక జీవో 55ను విడుదల చేసింది. దీనిద్వారా గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4, ఇతర క్యాటగిరీల పోస్టుల భర్తీ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించినట్టయింది. ఉద్యోగాల భర్తీ విధానంలో పలు మార్పులు చేయటమే కాకుండా, పోస్టుల విభజన, పరీక్ష విధానాన్ని ఖరారు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ జీవో 55ను జారీచేశారు. గతంలో జారీచేసిన జీవో 11ను సవరించి, కొత్త జీవోను విడుదల చేశారు. గ్రూప్ -1లో 19 రకాల పోస్టులు, గ్రూప్-2లో 16 రకాల పోస్టులు ఉన్నాయి.
ఈ జీవో ప్రకారం గ్రూప్ -1 మెయిన్స్‌ను 900 మార్కులు, గ్రూప్-2ను 600 మార్కులకే నిర్వహించనున్నట్టు ప్రకటించింది. ఇంటర్వ్యూల రద్దుతో గ్రూప్ -1లో 100 మార్కులు, గ్రూప్ -2లో 75 మార్కులను తొలగించింది. అంతే కాకుండా.. గ్రూప్ -3లో 8 రకాల పోస్టులు, గ్రూప్ -4లో జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్ పోస్టులు ఉన్నాయి. రాబోయే రోజుల్లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌ను జీవో 55కు అనుగుణంగా చేపట్టాలని టీఎస్ఎఎస్సీకి రాష్ట్ర ప్రభుత్వం సూచించింది.
- డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ (సోషల్ వెల్ఫేర్ సర్వీస్)
- డిస్ట్రిక్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ ఆఫీసర్ ఇన్క్లూడింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ (డిస్ట్రిక్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ డెవలప్మెంట్ ఆఫీసర్)
- డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ (ట్రైబల్ వెల్ఫేర్ సర్వీస్)
- జిల్లా ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ (ఎంప్లాయ్మెంట్ సర్వీస్)
- అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఇన్క్లూడింగ్ లే సెక్రటరీ అండ్ ట్రెజరీ గ్రేడ్-2 (మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్)
- అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్/అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్/ట్రైనింగ్ కాలేజీ లేదా స్కూల్లోని అసిస్టెంట్
లెక్చరర్ (ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ సర్వీస్)
- అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ (స్టేట్ ఆడిట్ సర్వీస్) మండల పరిషత్తు డెవలప్మెంట్ ఆఫీసర్ (పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సర్వీస్)
గ్రూప్ 1కు సంబంధించి ఇంటర్వ్యూలకు 100 మార్కులు ఉండేవి. రాత పరీక్షకు 900 మార్కులు ఉండేవి. దీంతో మొత్తం 1000 మార్కులకు గాను అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికను నిర్వహించే వారు. గ్రూప్-2 విషయానికి వస్తే.. రాత పరీక్షకు 600 మార్కులు.. ఇంటర్వ్యూలకు 75 మార్కులు ఉండేవి. దీంతో మొత్తం 675 మార్కులకు గాను అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉండేది. దీంతో గ్రూప్-1ను 900 మార్కులకు, గ్రూప్-2ను 600 మార్కులకు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇంటర్వ్యూలను రద్దు చేయడం వల్ల మూడు నెలలు ఆదా అవుతుందని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.