Home /News /jobs /

TSPSC GROUP 1 GOOD NEWS FOR GROUP 1 CANDIDATES INCREASE THE NUMBER OF POSTS IN GRADE 2 CATEGORY EVK

TSPSC Group-1: గ్రూప్‌-1 అభ్య‌ర్థుల‌కు గుడ్ న్యూస్‌.. ఆ విభాగంలో పోస్టుల సంఖ్య పెంపు

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

TSPSC Group 1 | తెలంగాణలో త్వరలో 503 గ్రూప్ 1 పోస్టులను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ (CM KCR) ఇటీవల అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఖాళీల (Telangana Government Jobs) భర్తీకి అనుమతులు ఇస్తూ ఆర్థిక శాఖ జీఓ సైతం విడుదల చేసింది. అయితే.. తాజాగా ప్ర‌భుత్వం గ్రేడ్‌-2లో పోస్టుల సంఖ్య పెంచుతూ నిర్ణ‌యం తీసుకొంది.

ఇంకా చదవండి ...
    తెలంగాణలో త్వరలో 503 గ్రూప్ 1 పోస్టులను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ (CM KCR) ఇటీవల అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఖాళీల (Telangana Government Jobs) భర్తీకి అనుమతులు ఇస్తూ ఆర్థిక శాఖ జీఓ సైతం విడుదల చేసింది. అయితే.. నోటిఫికేషన్ విడుదలకు టీఎస్పీఎస్సీ కసరత్తు సైతం పూర్తికావొచ్చింది. ఈ నేపథ్యంలో ఏ క్షణమైనా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్  (TSPSC) నుంచి ఈ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కానుంది.   డిప్యూటేషన్‌, ఫారిన్‌ సర్వీసెస్‌పై మరో శాఖ నుంచి అధికారులను ఆయా పోస్టుల్లోకి తీసుకొనేవారు. తాజాగా గ్రూప్‌-1లో చేర్చినా, భర్తీ చేసేందుకు నిబంధనలు అడ్డుగా నిలిచాయి. ఈ నేపథ్యంలోనే ఆరు పోస్టులను ఉపసంహరించినట్టు అధికారులు తెలిపారు. తాజా మార్పుతో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌లో మున్సిపల్‌కమిషనర్‌ గ్రేడ్‌-2 పోస్టులు 41కి చేరాయి.

    పోలీసు శాఖలోని డీఎస్పీ కమ్యూనికేషన్‌ పోస్టుల విద్యార్హతలపైనా ఆ శాఖ అధికారులు స్పష్టతనిచ్చారు. ఇక గ్రూప్‌ -1కి ఉన్న అడ్డంకులు తొలగిపోవడంతో నోటిఫికేషన్‌ జారీకి మార్గం సుగమం అయ్యింది.

    పరీక్ష కేంద్రాల్లో మార్పులు..

    ఇటీవలే టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్‌) దరఖాస్తు సమయంలో పరీక్షా కేంద్రాల కేటాయింపులో ఇబ్బందులు తలెత్తాయి. ఈ సారి అలాంటి అవ‌కాశం లేకుండా ఏర్పాటు చేస్తున్నారు. ఈసారి గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌కు సెంటర్ల కేటాయింపులో ప్రతి అభ్యర్థికి 8 నుంచి 10 ఆప్షన్లు ఇవ్వనున్నారు.

    Job Mela in AP: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జాబ్‌మేళా.. ద‌ర‌ఖాస్తు వివ‌రాలు.. వాక్ ఇన్ తేదీలు

    ఒక అభ్యర్థి 8 -10 వరకు జిల్లాలను ఎంపికచేసుకోవాలి. ప్రియారిటీ ప్ర‌కారం.. మొద‌టి ఆప్ష‌న్‌లో సీట్ లేకుంటే రెండో జిల్లాకు.. అక్క‌డ సీట్ లేకుంటే మూడో జిల్లాను కేటాయిస్తారు. దరఖాస్తు సమయంలో ప్రతి అభ్యర్థి 8-10 జిల్లాలను తప్పనిసరిగా ఆప్షన్స్‌గా ఎంచుకోవాలి. ఒకటి రెండు ఎంచుకుంటే ఇబ్బందులు తప్పవు.

    Career and Courses: ఐఐఎంలో ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజ‌న్స్‌పై కొత్త కోర్సు.. అప్లికేష‌న్ వివ‌రాలు


    మూడు నెలలు  ఆదా..

    గ్రూప్ 1కు సంబంధించి ఇంటర్వ్యూలకు 100 మార్కులు ఉండేవి. రాత పరీక్షకు 900 మార్కులు ఉండేవి. దీంతో మొత్తం 1000 మార్కులకు గాను అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికను నిర్వహించే వారు. గ్రూప్‌-2 విషయానికి వస్తే.. రాత పరీక్షకు 600 మార్కులు.. ఇంటర్వ్యూలకు 75 మార్కులు ఉండేవి. దీంతో మొత్తం 675 మార్కులకు గాను అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉండేది.  దీంతో గ్రూప్‌-1ను 900 మార్కులకు, గ్రూప్‌-2ను 600 మార్కులకు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇంటర్వ్యూలను రద్దు చేయడం వల్ల మూడు నెలలు  ఆదా అవుతుందని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Group 1, Job notification, JOBS, TSPSC

    తదుపరి వార్తలు