Home /News /jobs /

TSPSC GROUP 1 GIVE MORE TIME CALLS TO HELPLINES TO POSTPONE GROUP 1 EXAM EVK

TSPSC Group-1: ఇంకాస్త స‌మ‌యం ఇవ్వండి.. గ్రూప్‌-1 ప‌రీక్ష వాయిదా వేయాలంటూ హెల్ప్‌లైన్‌ల‌కు కాల్స్!

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

TSPSC Group-1 | గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ను ఆలస్యంగా నిర్వహించాలి అంటూ అభ్యర్థులు కోరుతున్నారు. ఇందుకోసం టీఎస్‌పీఎస్సీ హెల్ప్‌లైన్‌కు కాల్స్ చేస్తున్నారు. ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ గ్రూప్‌-1 నోటిఫికేష‌న్‌లో పేర్కొన్న ప్ర‌కారం జూలై-ఆగ‌స్టులో ప్రిలిమ్స్ నిర్వ‌హించే అవ‌కాశం ఉంది.

ఇంకా చదవండి ...
  గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ (Group-1 Prelims) ను ఆలస్యంగా నిర్వహించాలి అంటూ అభ్యర్థులు కోరుతున్నారు. ఇందుకోసం టీఎస్‌పీఎస్సీ హెల్ప్‌లైన్‌కు కాల్స్ చేస్తున్నారు. ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ గ్రూప్‌-1 నోటిఫికేష‌న్‌లో పేర్కొన్న ప్ర‌కారం జూలై-ఆగ‌స్టులో ప్రిలిమ్స్ నిర్వ‌హించే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలో ప్రిప‌రేష‌న్‌కు మ‌రింత స‌మ‌యం కావాల‌ని అభ్య‌ర్థులు కోరుతున్నారు. దీనిపై క‌మిష‌న్ స‌భ్యులు ఇంకా స్ప‌ష్ట‌త‌కు రాలేదు. ఎందుకంటే ప‌రీక్ష కాస్త ఆల‌స్యంగా నిర్వ‌హించాలి అంటే.. ఆగ‌స్టులో పోలీస్ ప‌రీక్ష‌లు ఉన్నాయి. సెప్టెంబ‌ర్ వినాయ‌క‌చ‌వితి, సివిల్స్ మెయిన్ (Civils Mains) ప‌రీక్ష‌లు ఉన్నాయి. అక్టోబ‌ర్‌లో బ‌తుక‌మ్మ‌, ద‌స‌రా పండుగ‌లు ఉన్నాయి. దీంతో ఈ ప‌రీక్ష‌ల‌కు ఇబ్బంది కాకుండా ఉండేలా నిర్ణ‌యం తీసుకోవ‌డంలో క‌మిష‌న్ స‌భ్యులు ఆలోచ‌న‌లో ఉన్నారు. మ‌రి అభ్య‌ర్థుల విన్న‌పం ఎంత‌వ‌ర‌కు ప‌రిగ‌ణ‌లోకి తీసుకొంటారో చూడాలి.

  Career and Course: ఫైనాన్స్ రంగంలో కెరీర్ ఎంచుకొనే వారికి బెస్ట్ చాయిస్స్‌.. ఐఎస్‌బీలో ఆన్‌లైన్ కోర్స్‌

  గ్రూప్‌-1 ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ముగిసింది. ఇప్ప‌టి వ‌ర‌కు 3,79,276 గ్రూప్-1 దరఖాస్తులు వచ్చాయి. కొత్తగా 1,93,723 మంది అభ్యర్థులు ఓటీఆర్ ను అప్డేట్ చేసుకొన్నారు. దీంతో ఓటీఆర్ చేసుకొన్న వారి సంఖ్య 3,89,888కి చేరింది. చివరి రోజు మరిన్ని దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. ద‌ర‌ఖాస్తు చివ‌రి రోజు శ‌నివారం 11,650 ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి.

  గ్రూప్-1లో  13 అంశాలను సిలబస్‌లో పేర్కొన్నారు. ఈ టాపిక్స్‌ అన్నీ కూడా ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యం ఉన్నవే. కాబట్టి ఒక్కో అంశం నుంచి 10 నుంచి 15 వరకు ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది.

  Bank Jobs: ప్ర‌ముఖ బ్యాంక్‌లో 31 మేనేజర్ ఉద్యోగాలు.. అర్హ‌త‌లు, అప్లికేష‌న్ వివ‌రాలు

  స‌బ్జెక్టుల వారీగా మార్కుల వెయిటేజీలు..

  - టీఎస్‌పీఎస్సీ, ఏపీపీఎస్సీ.. గ్రూప్‌1 ప్రిలిమ్స్‌లో కీలక సబ్జెక్ట్‌గా హిస్టరీని పేర్కొనొచ్చు. ఇందులో భారతదేశ చరిత్రతోపాటు టీఎస్‌పీఎస్సీ అభ్యర్థులు తెలంగాణ చరిత్ర, ఏపీపీఎస్సీ అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర అంశాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

  - ఈ విభాగం నుంచి 15 నుంచి 20 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుందని అంచనా. దీంతో.. అభ్యర్థులు హిస్టరీపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక భారతదేశ చరిత్ర అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.

  - పాలిటీ విభాగంలోనూ కోర్, సమకాలీన అంశాల కలయికతో 15 ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది.

  TSSPDCL Recruitment 2022: జూనియర్ లైన్ మెన్ ఉద్యోగాలకు ద‌ర‌ఖాస్తు చేస్తున్నారా.. జిల్లాల వారీగా ఖాళీల వివ‌రాలు

  - ఎకానమీ విభాగం నుంచి 10 నుంచి 12 ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఈ విభాగంలో ముఖ్యంగా భారతదేశం ఆర్థిక వ్యవస్థ–లక్షణాలు, జాతీయాదాయం, పంచవర్ష ప్రణాళికలు, పేదరికం–నిరుద్యోగం, వివిధ అంశాలకు సంబంధించి రాష్ట్రంలో ప్రాంతీయ అసమానతలు, పారిశ్రామికాభివృద్ధి, సేవారంగ వృద్ధి అంశాల గురించి తెలుసుకోవాలి.

  - జాగ్రఫీ విభాగం నుంచి 10 నుంచి 12 ప్రశ్నలు అంచనా వేయొచ్చు. ఇండియన్‌ జాగ్రఫీతోపాటు రాష్ట్ర భౌగోళిక పరిస్థితుల అధ్యయనానికి ప్రాధాన్యం ఇవ్వాలి. రాష్ట్రంలో, దేశంలో భౌగోళిక ప్రాశస్త్యం ఉన్న ప్రాంతాలు, వాటి ప్రత్యేకతలపై అవగాహన ఏర్పరచుకోవాలి.

  కరెంట్‌ అఫైర్స్, జీకే విభాగం నుంచి 12 నుంచి 15 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉందని అంచనా. కోర్, కాంటెంపరీ అంశాల కలయికగానూ ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. దీనికి విస్తృత అధ్యయనం అవసరం. అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో.. పరీక్షకు ముందు çసంవత్సర కాలంలో జరిగే పరిణామాలను నిశితంగా పరిశీలించాలి.
  Published by:Sharath Chandra
  First published:

  Tags: Group 1, Jobs in telangana, Telangana jobs, Ts jobs, TSPSC

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు