హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

TSPSC Exam Date Announced: ఆ పరీక్ష తేదీని ప్రకటించిన టీఎస్పీఎస్సీ.. గ్రూప్ 4, గ్రూప్ 2 పరీక్షల తేదీల్లో మార్పు..?

TSPSC Exam Date Announced: ఆ పరీక్ష తేదీని ప్రకటించిన టీఎస్పీఎస్సీ.. గ్రూప్ 4, గ్రూప్ 2 పరీక్షల తేదీల్లో మార్పు..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షను రద్దు చేసింది టీఎస్పీఎస్సీ. సిట్ అధికారులు దర్యాప్తులో కీలక వివరాలను రాబట్టారు. ఇప్పటికే ఏఈ పరీక్ష లీకైందని ప్రకటించిన అధికారులు దానిని రద్దు చేస్తూ.. టీఎస్పీఎస్సీ ప్రకటించింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షను రద్దు చేసింది టీఎస్పీఎస్సీ. సిట్ అధికారులు దర్యాప్తులో కీలక వివరాలను రాబట్టారు. ఇప్పటికే ఏఈ పరీక్ష లీకైందని ప్రకటించిన అధికారులు దానిని రద్దు చేస్తూ.. టీఎస్పీఎస్సీ ప్రకటించింది. అయితే తాజాగా మార్చి 05న నిర్వహించిన ఏఈ పరీక్షతో పాటు.. దీని ముందు నిర్వహించిన దాదాపు 6 పరీక్షలను కూడా రద్దు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఏఈఈ, డీఏఓ పరీక్షలను రద్దు చేసింది టీఎస్పీఎస్సీ. అక్టోబర్ 16, 2022న నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేసిన టీఎస్పీఎస్సీ జూన్ 11వ తేదీన గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఇక జూన్ 05 నుంచి జూన్ 13 వరకు నిర్వహించనున్న గ్రూప్ 1 మెయిన్స్ షెడ్యూల్ అంతా వాయిదా పడనుంది. ఈ మెయిన్స్ పరీక్షలు అక్టోబర్ లో నిర్వహించే అవకాశాలు కనపడుతున్నాయి.

గ్రూప్ 1 ప్రలిమ్స్ పరీక్ష తేదీని ప్రకటించిన టీఎస్పీఎస్సీ.. మెయిన్స్ పరీక్షను కూడా అత్యంత త్వరలో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. జూలై లేదా ఆగస్టు చివరి వారంలో ఈ మెయిన్స్ పరీక్షలు నిర్వహించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.  అయితే జూలై 01 వ తేదీన గ్రూప్ 4 పరీక్షను నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించగా.. తాజా పరిణామాల నేపథ్యంలో.. తేదీలు మారే అవకాశం ఎక్కువగా ఉంది. ముందుగా గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో ఈ గ్రూప్ 1 నియామకాలను ఎట్టి పరిస్థితుల్లో సాధ్యమైనంత త్వరగా ముగించాలనే ప్రయత్నంలో టీఎస్పీఎస్సీ ఉన్నట్లు సమాచారం.

Central Government Employees: కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డీఏ పెంపుపై తాజా అప్ డేట్..

ఇక గ్రూప్ 1 మెయిన్స్ ను ఆగస్టులో నిర్వహించే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే గ్రూప్ 2 ఆగస్టు 29, 30 తేదీల్లో నిర్వహిస్తామని ప్రకటించగా.. ఈ తేదీల్లో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష తేదీల కారణంగా మార్పులు చోటు చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక గ్రూప్ 3 పరీక్ష తేదీ కూడా టీఎస్పీఎస్సీ  ప్రకటించాల్సి ఉంది. వీటితో పాటు.. ఏఈఈ, డీఏఓ పరీక్ష తేదీలను కూడా టీఎస్పీఎస్సీ ప్రకటించాల్సి ఉంది. వీటిపై కూడా త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

First published:

Tags: Career and Courses, JOBS, TSPSC

ఉత్తమ కథలు