Home /News /jobs /

TSPSC GROUP 1 APPLICATIONS ALERT FOR THE UNEMPLOYED GROUP 1 APPLICATION DEADLINE ENDING IN FOUR DAYS KEEP THESE THINGS IN MIND EVK

TSPSC Group-1 Applications: నిరుద్యోగుల‌కు అల‌ర్ట్‌.. నాలుగు రోజుల్లో ముగియ‌నున్న గ్రూప్‌-1 ద‌ర‌ఖాస్తు గ‌డువు.. ఈ విష‌యాలు గుర్తుంచుకోండి

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

TSPSC Group-1 | స్టేట్‌ సివిల్‌ పోస్టులుగా భావించే గ్రూప్‌-1 ఉద్యోగాలకు సంబంధించిన దర‌ఖా‌స్తు ప్రక్రియ మ‌రో నాలుగు రోజుల్లో ముగియ‌నుంది. 18 శాఖల్లో 503 గ్రూప్‌-1 పోస్టుల కోసం ఈ నెల 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దాదాపు 18 శాఖ‌ల్లో 503 గ్రూప్‌-1 పోస్టుల కోసం టీఎస్పీఎస్సీ అప్లికేషన్లు స్వీకరిస్తోంది.

ఇంకా చదవండి ...
    స్టేట్‌ సివిల్‌ పోస్టులుగా భావించే గ్రూప్‌-1 (Group-1) ఉద్యోగాలకు సంబంధించిన దర‌ఖా‌స్తు ప్రక్రియ మ‌రో నాలుగు రోజుల్లో ముగియ‌నుంది. 18 శాఖల్లో 503 గ్రూప్‌-1 పోస్టుల కోసం ఈ నెల 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దాదాపు 18 శాఖ‌ల్లో 503 గ్రూప్‌-1 పోస్టుల కోసం టీఎస్పీఎస్సీ అప్లికేషన్లు స్వీకరిస్తోంది. దరఖాస్తు ప్రక్రియ పొడగించే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో అభ్యర్థులు చివరి నిమిషయం వరకు ఆగ‌కుండా తొంద‌ర‌గా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డం ఉత్త‌మం. గ్రూప్-1 రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌కు ఇప్ప‌టి వరకు 2,21,764 దరఖాస్తులు వచ్చాయి. ఓటీఆర్ ను 3,03,681 మంది ఎడిట్ చేసుకొన్నారు. ద‌ర‌ఖాస్తు కోసం ప‌బ్లిక్ స‌ర్వీస్ కమిషన్ (Public Serviece Commission) వెబ్‌సైట్ www.tspsc.gov.in ను సంద‌ర్శించాల్సి ఉంటుంది.

    Career and Course: విద్యార్థుల‌కు ఎల్ & టీ లెర్నింగ్ మాడ్యూల్స్.. ఏఐసీటీఈ కీలక నిర్ణ‌యం, ఒప్పందం

    ముఖ్య‌మైన స‌మాచారం..
    - గ్రూప్-I పరీక్షలకు హాజరు కావాలనుకునే అభ్యర్థులు ముందుగా TSPSC యొక్క వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (OTR) ఫారమ్‌ను పూరించాలి.
    - ఇప్పటికే OTR ఫారమ్‌ను పూరించిన వారు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2018 ప్రకారం దానిని సవరించాలి.
    - మొత్తం 1,72,322 మంది అభ్యర్థులు తమ OTRని సవరించారు.
    - మే 5, 2022 నాటికి TSPSCకి 79,406 కొత్త OTRలు అందాయి.

    ద‌ర‌ఖాస్తు ఎలా చేసుకోవాలి..

    టీఎస్‌పీఎస్‌సీ వెబ్‌సైట్‌లో వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేయడానికి అభ్యర్థులు ముందుగా https://www.tspsc.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

    Govt Jobs Preparation: తెలుగు అకాడ‌మీ పుస్త‌కాలు దొర‌క‌డం లేదా.. అయితే ప్రిప‌రేష‌న్ ఇలా చేయండి!

    - హోమ్ పేజీలో కుడివైపు One Time Registration పైన క్లిక్ చేయాలి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. Aadhaar Details సెక్షన్‌లో మొదట ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి, ఆధార్ కార్డులో ఉన్నట్టుగా పేరు ఎంటర్ చేయాలి.

    - Personal Details సెక్షన్‌లో ఎస్ఎస్‌సీ లేదా తత్సమాన సర్టిఫికెట్‌లో ఉన్నట్టుగా పేరు, జెండర్, పుట్టిన తేదీ, తండ్రి పేరు, ఐడెంటిఫికేషన్ మార్క్స్ లాంటి వివరాలన్ని ఎంటర్ చేయాలి.

    - Address Details సెక్షన్‌లో పోస్టల్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, ఇమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. Educational Qualifications సెక్షన్‌లో విద్యార్హతల వివరాలు ఎంటర్ చేయాలి.

    - మొదటి తరగతి నుంచి పదో తరగతి వరకు, ఇంటర్, డిప్లొమా, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎంఫిల్, పీహెచ్‌డీ లాంటి అర్హతలకు సంబంధించిన వివరాలు ఎంటర్ చేసి సర్టిఫికెట్స్ అప్‌లోడ్ చేయాలి.

    TS Police Jobs: ముగిసిన పోలీస్ ఉద్యోగాల ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ‌.. ఒక పోస్టుకు ఎంత మంది పోటీ తెలుసా?

    - Additional Qualifications సెక్షన్‌లో అదనపు అర్హతల వివరాలు ఎంటర్ చేయాలి. ఫోటో సంతకం అప్‌లోడ్ చేయాలి.

    - Notification Alerts ఆన్‌లో పెడితే ఉద్యోగాల నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారం లభిస్తుంది. ఆ తర్వాత Preview క్లిక్ చేసి వివరాలన్నీ సరిచూసుకోవాలి.

    - ఆ తర్వాత అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేస్తే TSPSC ID జనరేట్ అవుతుంది. టీఎస్‌పీఎస్‌సీ ఏ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసినా TSPSC ID ఎంటర్ చేసి అప్లై చేయొచ్చు.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Govt Jobs 2022, Job notification, JOBS, Jobs in telangana, Ts jobs, TSPSC

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు