Home /News /jobs /

TSPSC GROUP 1 APPLICATIONS ALERT FOR CANDIDATES ONE DAY CHANCE FOR GROUP 1 APPLICATION REMEMBER THESE THINGS EVK

TSPSC Group-1 Applications: అభ్య‌ర్థుల‌కు అల‌ర్ట్‌.. గ్రూప్‌-1 ద‌ర‌ఖాస్తుకు ఒక్క రోజే చాన్స్‌.. ఈ విష‌యాలు గుర్తుంచుకోండి

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

TSPSC Group-1 Application | స్టేట్‌ సివిల్‌ పోస్టులుగా భావించే గ్రూప్‌-1 (Group-1) ఉద్యోగాలకు సంబంధించిన దర‌ఖా‌స్తు ప్రక్రియ రేపటితో ముగియ‌నుంది. ఇప్పటి వరకు 3,58,237 గ్రూప్-1 దరఖాస్తులు వచ్చాయి. కొత్తగా 1,88,137 మంది అభ్యర్థులు ఓటీఆర్ ను అప్డేట్ చేసుకొన్నారు

ఇంకా చదవండి ...
    స్టేట్‌ సివిల్‌ పోస్టులుగా భావించే గ్రూప్‌-1 (Group-1) ఉద్యోగాలకు సంబంధించిన దర‌ఖా‌స్తు ప్రక్రియ రేపటితో ముగియ‌నుంది. 18 శాఖల్లో 503 గ్రూప్‌-1 పోస్టుల కోసం ఈ నెల 31 వరకు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల కోసం ప్రభుత్వం దరఖాస్తు గడువును జూన్ 4, 2022 వరకు పొడగించింది.   దాదాపు 18 శాఖ‌ల్లో 503 గ్రూప్‌-1 పోస్టుల కోసం టీఎస్పీఎస్సీ అప్లికేషన్లు స్వీకరిస్తోంది. దరఖాస్తు ప్రక్రియ పొడగించే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో అభ్యర్థులు చివరి నిమిషయం వరకు ఆగ‌కుండా తొంద‌ర‌గా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డం ఉత్త‌మం. చివరి రోజు ఎక్కువ మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోడం వల్ల సర్వర్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకోవడం ఉత్తమం.    ద‌ర‌ఖాస్తు కోసం ప‌బ్లిక్ స‌ర్వీస్ కమిషన్ (Public Serviece Commission) వెబ్‌సైట్ www.tspsc.gov.in ను సంద‌ర్శించాల్సి ఉంటుంది.

    Career and Courses: గ్రామీణ విద్యార్థులకు బెస్ట్ చాన్స్‌.. ఉద్యోగ నైపుణ్యాలు పెంచుకునేందుకు ఉచిత కోర్సులు

    ఇప్పటి వరకు 3,58,237 గ్రూప్-1 దరఖాస్తులు వచ్చాయి.  కొత్తగా 1,88,137 మంది అభ్యర్థులు ఓటీఆర్ ను అప్డేట్ చేసుకొన్నారు.  దీంతో  ఓటీఆర్ చేసుకొన్న వారి సంఖ్య 3,79,851కి చేరింది.  చివరి రోజు మరిన్ని దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.

    ముఖ్య‌మైన స‌మాచారం..
    - గ్రూప్-I పరీక్షలకు హాజరు కావాలనుకునే అభ్యర్థులు ముందుగా TSPSC యొక్క వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (OTR) ఫారమ్‌ను పూరించాలి.
    - ఇప్పటికే OTR ఫారమ్‌ను పూరించిన వారు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2018 ప్రకారం దానిని సవరించాలి.
    - అభ్య‌ర్థుల సౌక‌ర్యార్థం.. త‌క్కువ స‌మ‌యం ఉండ‌డంతో బోనోఫైడ్ అప్‌లోడ్ చేయ‌కుండానే ద‌ర‌ఖాస్తు చేసుకొనే అవ‌కాశాన్ని టీఎస్‌పీఎస్‌సీ ఇచ్చింది.
    - ప‌రీక్ష కేంద్రాలు కూడా ఎక్కువ ఆప్ష‌న్‌ల‌లో ఎంచుకోవాలి.

    Job News: ఆ రంగాల్లోనే ఎక్కువ ఉద్యోగాలు.. క‌రోనా త‌రువాత మారిన ప‌రిస్థితి

    ద‌ర‌ఖాస్తు ఎలా చేసుకోవాలి..

    టీఎస్‌పీఎస్‌సీ వెబ్‌సైట్‌లో వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేయడానికి అభ్యర్థులు ముందుగా https://www.tspsc.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

    - హోమ్ పేజీలో కుడివైపు One Time Registration పైన క్లిక్ చేయాలి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. Aadhaar Details సెక్షన్‌లో మొదట ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి, ఆధార్ కార్డులో ఉన్నట్టుగా పేరు ఎంటర్ చేయాలి.

    - Personal Details సెక్షన్‌లో ఎస్ఎస్‌సీ లేదా తత్సమాన సర్టిఫికెట్‌లో ఉన్నట్టుగా పేరు, జెండర్, పుట్టిన తేదీ, తండ్రి పేరు, ఐడెంటిఫికేషన్ మార్క్స్ లాంటి వివరాలన్ని ఎంటర్ చేయాలి.

    - Address Details సెక్షన్‌లో పోస్టల్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, ఇమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. Educational Qualifications సెక్షన్‌లో విద్యార్హతల వివరాలు ఎంటర్ చేయాలి.

    - మొదటి తరగతి నుంచి పదో తరగతి వరకు, ఇంటర్, డిప్లొమా, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎంఫిల్, పీహెచ్‌డీ లాంటి అర్హతలకు సంబంధించిన వివరాలు ఎంటర్ చేసి సర్టిఫికెట్స్ అప్‌లోడ్ చేయాలి.

    TS Govt Jobs Preparation: పోలీస్‌, గ్రూప్‌-1 ప‌రీక్ష‌ల‌కు ప్రిపేర్ అవుతున్నారా.. ఈ టాపిక్స్ ఇంపార్టెంట్‌!

    - Additional Qualifications సెక్షన్‌లో అదనపు అర్హతల వివరాలు ఎంటర్ చేయాలి. ఫోటో సంతకం అప్‌లోడ్ చేయాలి.

    TS Inter Exams 2022: నేటి నుంచి ఇంట‌ర్ ప‌రీక్ష‌లు ప్రారంభం.. విద్యార్థులు గుర్తుంచుకోవాల్సిన విష‌యాలు..

    - Notification Alerts ఆన్‌లో పెడితే ఉద్యోగాల నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారం లభిస్తుంది. ఆ తర్వాత Preview క్లిక్ చేసి వివరాలన్నీ సరిచూసుకోవాలి.

    - ఆ తర్వాత అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేస్తే TSPSC ID జనరేట్ అవుతుంది. టీఎస్‌పీఎస్‌సీ ఏ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసినా TSPSC ID ఎంటర్ చేసి అప్లై చేయొచ్చు.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Group 1, Job notification, JOBS, Ts jobs, TSPSC

    తదుపరి వార్తలు