తెలంగాణలో భారీగా ఉద్యోగాలను(Telangana Government Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం.. గ్రూప్-1, గ్రూప్-2 పోస్టుల (Telangana Group1, Group 2 Jobs) భర్తీకి ఇప్పటికే కసరత్తు దాదాపుగా పూర్తి చేశారు.అయితే తాజా సమాచారం ప్రకారం గ్రూప్ –1 నోటిఫికేషన్ విడుదలపై టీఎస్పీఎస్సీ శనివారం కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉన్నదని సమాచారం.
తెలంగాణలో భారీగా ఉద్యోగాలను(Telangana Government Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం.. గ్రూప్-1, గ్రూప్-2 పోస్టుల (Telangana Group1, Group 2 Jobs) భర్తీకి ఇప్పటికే కసరత్తు దాదాపుగా పూర్తి చేశారు.అయితే తాజా సమాచారం ప్రకారం గ్రూప్ –1 నోటిఫికేషన్ విడుదలపై టీఎస్పీఎస్సీ శనివారం కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉన్నది. గ్రూప్–1పై ఇప్పటికే దశల వారీగా సమావేశాలను కమిషన్ నిర్వహించింది. ఈ అంశంపై శనివారం మరోసారి సమావేశమవుతున్నది. ఈ అంశంపై అన్ని శాఖలను సమన్వయం చేసుకొని ఒకటికి రెండు సార్లు క్షేత్రస్థాయిలో ఇప్పటికే చర్చించింది. మూడు వారాల క్రితమే గ్రూప్–1 నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉన్నా, ప్రభుత్వం ఇంటర్వ్యూలను రద్దు చేయటంతో వాయిదా పడింది. దీనితోపాటు కొత్త జోనల్ వ్యవస్థ నేపథ్యంలో ఎలాంటి సమస్యలు రాకుండా కమిషన్ జాగ్రత్తగా అడుగులు వేస్తున్నది.
అంతే కాకుండా గ్రూప్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఇంటర్వ్యూలను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఉద్యోగాల భర్తీలో పారదర్శకమైన విధానాన్ని తీసుకురావాలన్న లక్ష్యంతో కేసీఆర్ సర్కార్ (Telangana Government) ఈ నిర్ణయం తీసుకుంది. అయితే.. ఇంటర్వ్యూల రద్దును కొందరు వ్యతిరేకిస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. ఇదిలా ఉంటే.. గ్రూప్ 1కు సంబంధించి ఇంటర్వ్యూలకు 100 మార్కులు ఉండేవి. రాత పరీక్షకు 900 మార్కులు ఉండేవి. దీంతో మొత్తం 1000 మార్కులకు గాను అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికను నిర్వహించే వారు. గ్రూప్-2 విషయానికి వస్తే.. రాత పరీక్షకు 600 మార్కులు.. ఇంటర్వ్యూలకు 75 మార్కులు ఉండేవి. దీంతో మొత్తం 675 మార్కులకు గాను అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉండేది.
అయితే ఇప్పుడు ఇంటర్వ్యూలను ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో రాత పరీక్షల్లో ఏమైనా మార్పులు చేస్తారా? అన్న సందేహం అభ్యర్థుల్లో వ్యక్తమవుతోంది. ఇంటర్వ్యూలకు ఇప్పటి వరకు కేటాయించిన మార్కులను రాత పరీక్షకు కేటాయించే అవకాశం ఉందా? అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ఇదే జరిగితే పరీక్ష పేపర్ మోడల్ కూడా మారే అవకాశం ఉంది. ఇదే జరిగితే నోటిఫికేషన్లు విడుదల కావడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దీంతో గ్రూప్-1ను 900 మార్కులకు, గ్రూప్-2ను 600 మార్కులకు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇంటర్వ్యూలను రద్దు చేయడంతో నియామక ప్రక్రియ అతి తొందరలో ప్రారంభం అయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబతుున్నాయి.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.