Home /News /jobs /

TSPSC GROUP 1 ALERT FOR GROUP CANDIDATES TSPSC MAKING CHANGES IN PAPER CORRECTION EVK

TSPSC Group 1: గ్రూప్స్ అభ్య‌ర్థుల‌కు అల‌ర్ట్‌.. పేప‌ర్ క‌రెక్ష‌న్‌లో మార్పులు తీసుకొస్తున్న టీఎస్‌పీఎస్‌సీ

(ఫ్రతీకాత్మక చిత్రం)

(ఫ్రతీకాత్మక చిత్రం)

TSPSC Group 1 | ఈ నేపథ్యంలో ఈ ఖాళీల భర్తీకి అనుమతులు ఇస్తూ ఆర్థిక శాఖ జీఓ సైతం విడుదల చేసింది. అయితే.. నోటిఫికేషన్ విడుదలకు టీఎస్పీఎస్సీ కసరత్తు సైతం పూర్తికావొచ్చింది. ఈ నేప‌థ్యంలో పేప‌ర్ క‌రెక్ష‌న్‌పై టీఎస్‌పీసీ కీల‌క నిర్ణ‌యం తీసుకొంది.

ఇంకా చదవండి ...
    తెలంగాణలో త్వరలో 503 గ్రూప్ 1 పోస్టులను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ (CM KCR) ఇటీవల అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఖాళీల (Telangana Government Jobs) భర్తీకి అనుమతులు ఇస్తూ ఆర్థిక శాఖ జీఓ సైతం విడుదల చేసింది. అయితే.. నోటిఫికేషన్ విడుదలకు టీఎస్పీఎస్సీ కసరత్తు సైతం పూర్తికావొచ్చింది. ఈ నేపథ్యంలో ఏ క్షణమైనా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్  (TSPSC) నుంచి ఈ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కానుంది.  ఈ నేప‌థ్యంలో పేప‌ర్ క‌రెక్ష‌న్‌పై టీఎస్‌పీసీ కీల‌క నిర్ణ‌యం తీసుకొంది.

    గ్రూప్‌-1లో ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ రెండు పరీక్షలను నిర్వహిస్తారు. ప్రిలిమ్స్‌ను ఆబ్జెక్టివ్‌ పద్ధతిలో ఉంటుంది. ఈ పేపర్ కరెక్షన్.. ఫలితాల ప్రకటనలో ఎలాంటి సమస్యలు పెద్దగా ఉండవు.  కానీ.. మెయిన్స్‌ వ్యాసరూప ప్రశ్నలు కావడంతో వాటిని ప్రొఫెసర్ల చేత దిద్దించాలని నిర్ణయించారు.

    Infosys: ఇన్ఫోసిస్ కొత్త రూల్‌.. రిజైన్ చేస్తే.. ఆరు నెల‌ల‌పాటు ఆ కంపెనీల్లో చేరొద్దని రూల్‌!


    పరీక్ష విధానం.. కరెక్షన్ ప్రాసెస్
    గ్రూప్ 1 మెయిన్స్‌లో ఆరు పేప‌ర్లు 900 మార్కులు ఉంటాయి. ప్రొఫెస‌ర్‌ల‌తో కూడిన బృందం ప్యాన‌ల్ అభ్య‌ర్థును ఎంపిక చేస్తారు. ఇద్ద‌రు ప్రొఫెస‌ర్లు పేప‌ర్‌లు ది్దిన త‌రువాత స‌రాస‌రి మార్కుల‌ను అభ్య‌ర్థికి ప్ర‌క‌టిస్తారు.

    పరీక్ష కేంద్రాల్లో మార్పులు..

    ఇటీవలే టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్‌) దరఖాస్తు సమయంలో పరీక్షా కేంద్రాల కేటాయింపులో ఇబ్బందులు తలెత్తాయి. ఈ సారి అలాంటి అవ‌కాశం లేకుండా ఏర్పాటు చేస్తున్నారు. ఈసారి గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌కు సెంటర్ల కేటాయింపులో ప్రతి అభ్యర్థికి 8 నుంచి 10 ఆప్షన్లు ఇవ్వనున్నారు.

    Job Mela in AP: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జాబ్‌మేళా.. ద‌ర‌ఖాస్తు వివ‌రాలు.. వాక్ ఇన్ తేదీలు

    ఒక అభ్యర్థి 8 -10 వరకు జిల్లాలను ఎంపికచేసుకోవాలి. ప్రియారిటీ ప్ర‌కారం.. మొద‌టి ఆప్ష‌న్‌లో సీట్ లేకుంటే రెండో జిల్లాకు.. అక్క‌డ సీట్ లేకుంటే మూడో జిల్లాను కేటాయిస్తారు. దరఖాస్తు సమయంలో ప్రతి అభ్యర్థి 8-10 జిల్లాలను తప్పనిసరిగా ఆప్షన్స్‌గా ఎంచుకోవాలి. ఒకటి రెండు ఎంచుకుంటే ఇబ్బందులు తప్పవు.

    Career and Courses: ఐఐఎంలో ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజ‌న్స్‌పై కొత్త కోర్సు.. అప్లికేష‌న్ వివ‌రాలు


    మూడు నెలలు  ఆదా..

    గ్రూప్ 1కు సంబంధించి ఇంటర్వ్యూలకు 100 మార్కులు ఉండేవి. రాత పరీక్షకు 900 మార్కులు ఉండేవి. దీంతో మొత్తం 1000 మార్కులకు గాను అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికను నిర్వహించే వారు. గ్రూప్‌-2 విషయానికి వస్తే.. రాత పరీక్షకు 600 మార్కులు.. ఇంటర్వ్యూలకు 75 మార్కులు ఉండేవి. దీంతో మొత్తం 675 మార్కులకు గాను అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉండేది.  దీంతో గ్రూప్‌-1ను 900 మార్కులకు, గ్రూప్‌-2ను 600 మార్కులకు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇంటర్వ్యూలను రద్దు చేయడం వల్ల మూడు నెలలు  ఆదా అవుతుందని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Group 1, Telangana government jobs, Ts jobs, TSPSC

    తదుపరి వార్తలు