Home /News /jobs /

TSPSC GROUP 1 ALERT FOR GROUP 1 CANDIDATES SPECIAL BOOKS DESIGNING BY AMBEDKAR OPEN UNIVERSITY EVK

TSPSC Group-1: గ్రూప్‌-1 అభ్య‌ర్థుల‌కు అల‌ర్ట్‌.. ప్రిప‌రేష‌న్ కోసం ప్ర‌త్యేక పుస్త‌కాలు.. ఎవ‌రు రూపొందిస్తున్నారంటే?

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

TSPSC Group-1 | తెలంగాణ ఆవిర్భావం త‌రువాత వ‌చ్చిన మొద‌టి గ్రూప్‌-1 నోటిఫికేష‌న్‌కు అభ్య‌ర్థుల నుంచి విశేష స్పంద‌న వ‌స్తుంది. గ్రూప్‌-1 దరఖాస్తులకు తుది గడువు మరో 11 రోజులు మాత్రమే ఉన్నది. అయితే.. గ్రూప్‌-1కు సిద్ధ్ధమవుతున్న అభ్యర్థులకు బీఆర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ (బీఆర్‌ఏవోయూ) కొత్త స్టడీ మెటీరియల్‌ను రూపొందిస్తోంది.

ఇంకా చదవండి ...
    తెలంగాణ ఆవిర్భావం త‌రువాత వ‌చ్చిన మొద‌టి గ్రూప్‌-1 నోటిఫికేష‌న్‌కు అభ్య‌ర్థుల నుంచి విశేష స్పంద‌న వ‌స్తుంది. గ్రూప్‌-1 దరఖాస్తులకు తుది గడువు మరో 11 రోజులు మాత్రమే ఉన్నది. ఈ పరీక్షకు ఇప్పటి వరకూ 1,66,679 మంది దరఖాస్తు చేశారు. అయితే.. గ్రూప్‌-1కు సిద్ధ్ధమవుతున్న అభ్యర్థులకు బీఆర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ (బీఆర్‌ఏవోయూ) కొత్త స్టడీ మెటీరియల్‌ను రూపొందిస్తోంది. బీఏ, ఎంఏ పుస్తకాలను కూర్పుచేసి జాగ్రఫీ, పొలిటికల్‌సైన్స్‌, భారత రాజ్యాంగం, ఇతర పాఠ్యాంశాలతో మొత్తంగా 8 సెట్ల మెటీరియల్‌ను తయారు చేస్తోంది. ఇటీవల గ్రూప్‌-1 నోటిఫికేషన్‌లో వెల్లడించిన సిలబస్‌ ప్రకారమే అధికారులు ఈ స్టడీ మెటీరియల్‌ను సిద్ధం చేస్తున్నారు. వారం, పది రోజుల్లో ఈ మెటీరియల్‌ అందుబాటులోకి రానున్నది.

    TSSPDCL Recruitment 2022: జూనియర్ లైన్ మెన్ ఉద్యోగాలకు ద‌ర‌ఖాస్తు చేస్తున్నారా.. జిల్లాల వారీగా ఖాళీల వివ‌రాలు

    బీఆర్‌ఏవోయూ రూపొందించిన బీఏ, ఎంఏ పుస్తకాలకు అధిక డిమాండ్‌ ఉంటుంది. పోటీ పరీక్షలకు ఎంతో ఉపయుక్తంగా ఉండే ఈ పుస్తకాలను మార్కెట్లో విక్రయించరు. అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు మాత్రమే అందజేస్తారు. వీటి సిలబస్‌ సివిల్స్‌కు తగినట్టు ఉంటుంది. సివిల్స్‌కు పోటీపడే విద్యార్థుల్లో కొందరు ఈ పుస్తకాల కోసమే బీఆర్‌ఏవోయూ బీఏ కోర్సులో చేరుతుంటారు.

    సివిల్స్‌కు పోటీపడే విద్యార్థుల్లో కొందరు ఈ పుస్తకాల కోసమే బీఆర్‌ఏవోయూ బీఏ కోర్సులో చేరుతుంటారు. బీఆర్‌ఏవోయూ రూపొందించిన బీఏ, ఎంఏ పుస్తకాలకు అధిక డిమాండ్‌ ఉంటుంది. ఇవి ముఖ్యంగా అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు మాత్రమే అందజేస్తారు. వీటి సిలబస్‌ సివిల్స్‌కు తగినట్టు ఉంటుంది. పోటీ పరీక్షలకు ఎంతో ఉపయుక్తంగా ఉండే ఈ పుస్తకాలను మార్కెట్లో విక్రయించరు.

    చాలా మంది అభ్య‌ర్థులు గ్రూప్‌-1 ద‌ర‌ఖాస్తు గ‌డువు పెంచాల‌ని కోరుతున్నారు. ఈ నేప‌థ్యంలో టీఎస్ పీఎస్సీ (TSPSC) కీలక నిర్ణయం తీసుకుంది. అప్లికేష‌న్‌ల గ‌డువు పెంపు లేద‌ని స్ప‌ష్టం చేసింది. శనివారం టీఎస్ పీఎస్సీ పాలకమం డలి సమావేశం సెక్రెటరీ అనితా రామచం ద్రన్ ఆధ్వ ర్యం లో జరిగిం ది. ఈ స‌మంవేశంలో ఈ నిర్ణ‌యం తీసుకొంది.

    Jobs in AP: విశాఖ‌ప‌ట్నంలో కాంట్రాక్టు ఉద్యోగాలు.. వేతనం రూ.28,000.. అర్హతల వివరాలు

    విద్యుత్ శాఖలో ఉద్యోగాలు..

    తెలంగాణలో విద్యుత్ శాఖ  దక్షిణతెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (TSSPDCL) నుంచి 1000 జూనియర్ లైన్ మెన్ ఉద్యోగాల భర్తీకి అధికారులు జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు (Jobs) దరఖాస్తు పక్రియ ఈ నెల 19 నుంచి ప్రారంభం కానుందని అధికారులు వెల్లడించారు. అప్లై చేసుకోవడానికి జూన్ 8ని ఆఖరి తేదీగా నిర్ణయించారు.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Govt Jobs 2022, Job notification, JOBS, Ts jobs, TSPSC

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు