హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

TSPSC Group-1: గ్రూప్‌-1 అభ్య‌ర్థుల‌కు అల‌ర్ట్‌.. పోస్టుల కేటాయింపుపై సందేహాలా.. ఈ విష‌యాలు తెలుసుకోండి

TSPSC Group-1: గ్రూప్‌-1 అభ్య‌ర్థుల‌కు అల‌ర్ట్‌.. పోస్టుల కేటాయింపుపై సందేహాలా.. ఈ విష‌యాలు తెలుసుకోండి

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

TSPSC Grpoup 1 | తెలంగాణలో గ్రూప్1 నోటిఫికేషన్ ఇప్ప‌టికే విడుదల అయ్యింది. అయితే.. మొత్తం 503 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు అధికారులు. మే 2వ తేదీ నుంచి ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ నేప‌థ్యంలో అభ్య‌ర్థుల‌కు పోస్టుల కేటాయింపు పై సందేహాలు క‌లుగుతున్నాయి. అస‌లు పోస్టులు ఎలా కేటాయించారో తెలుసుకోండి..

ఇంకా చదవండి ...

తెలంగాణలో గ్రూప్1 నోటిఫికేషన్ ఇప్ప‌టికే విడుదల అయ్యింది. అయితే.. మొత్తం 503 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు అధికారులు. మే 2వ తేదీ నుంచి ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. దరఖాస్తుకు మే 31ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని ప్రకటనలో స్పష్టం చేశారు. అయితే చాలా మంది అభ్య‌ర్థుల‌కు పోస్టుల కేటాయింపు స‌రిగి జ‌ర‌గ‌లేద‌నే అనుమానం క‌లుగుతోంది. అస‌లు పోస్టుల‌ను ఏ ప్రాతిప‌దిక‌న కేటాయిస్తారు. అనే అంశం తెలుసుకోండి..

TSPSC Group-1: గ‌్రూప్‌-1 అభ్య‌ర్థుల‌కు అల‌ర్ట్‌.. వారంతా ఎన్ఓసీ స‌బ్‌మిట్ చేయాల్సిందే.. టీఎస్‌పీఎస్‌సీ

పోస్టులు ఎలా కేటాయిస్తారు..

గ్రూప్ పోస్టుల‌ను రోస్ట‌ర్ విధానం ద్వారా కేటాయిస్తారు. చాలా మంది అభ్య‌ర్థులు మొత్తం 503 పోస్టుల‌కు క‌లిపి రోస్ట‌ర్ విధానం కేటాయిస్తారు అని అభిప్రాయం ప‌డుతున్నార‌ని అధికారులు అంటున్నారు. అది స‌రైంది కాద‌ని 503 పోస్టులను కలిపి చూడకూడదు. శాఖల వారీగా పోస్టు, మల్టీజోన్‌-1, 2కు కేటాయించిన పోస్టులను బట్టి రిజర్వేషన్‌ను విభజిస్తారు. అంతే కాకుండా రోస్టర్‌ ప్రకారం 48 పోస్టులకు ఒకటిమాత్రమే స్పోర్ట్స్‌ కోటాలో భర్తీ చేస్తారు. 98 పోస్టుల వరకు వస్తేనే రెండో పోస్టు కేటాయిస్తారు. ఆ లోపు పోస్టులున్న శాఖల్లో స్పోర్ట్స్‌ కోటా ఉండదు.

ఈ ఏడాది ప్రభుత్వం కొత్త రోస్టర్‌ ప్రారంభించింది.  ప్రతి శాఖలో మొదటి పోస్టును ఓసీ మహిళ, రెండో పోస్టు ఎస్సీ మహిళ, మూడో పోస్టు ఓసీ, నాలుగో పోస్టు బీసీ ఏ-మహిళ, 5వ పోస్టు ఓసీ, 6వ పోస్టు వికలాంగ మహిళ ఇలా రోస్టర్‌ను కేటాయించారు. ఈ సారి తక్కువ పోస్టులున్న శాఖల్లో ఈ రోస్టర్‌ను అనుసరించటం వల్ల మహిళలకు ఎక్కువ పోస్టులు వచ్చాయి.

TS Police Job Preparation: పోలీస్ ఉద్యోగాల‌కు ప్రిపేర్ అవుతున్నారా.. ఈ టైం టేబుల్ ట్రై చేయండి

ఉదాహరణకు ఏదైనా మల్టీజోన్‌-2లో 1 పోస్టు ఉంద‌నుకోండి.. ఆ పోస్టును ఎవరికి కేటాయించాలన్నది ప్రశ్న. రోస్టర్‌ ప్రకారం మొదటి పోస్టు జనరల్‌ మహిళకు వెళ్తుంది.  మల్టీజోన్‌-2లో మొత్తం 100 పోస్టులుంటే 33 శాతం ప్రకారం 33 పోస్టులు మహిళలకు దక్కడమే కాకుండా, ఎవరి రిజర్వేషన్‌ కోటా ప్రకారం వారికి వస్తాయి. ఉన్నది ఒకే పోస్టు కావటంతో రోస్టర్‌ను అనుసరించి జనరల్‌ మహిళకు కేటాయించారు. మరో 30 పోస్టులకు టీఎస్‌పీఎస్సీ మరో నోటిఫికేషన్‌ ఇస్తే, అప్పుడు 2వ రోస్టర్‌ పాయింట్‌ నుంచి మొదలుపెట్టి 30వ రోస్టర్‌ పాయింట్‌ వరకు ఉన్న రిజర్వేషన్‌ ప్రకారం కేటాయిస్తారు. వంద పోస్టులు భర్తీ అయ్యే వరకు ఇలాగే కొనసాగుతుంది. వంద పోస్టులు భర్తీ అయ్యాక తిరిగి రోస్టర్‌-1 ప్రకారం ఆ పోస్టును తిరిగి జనరల్‌ మహిళకు కేటాయిస్తారు. అభ్యర్థులు గందరగోళానికి గురికాకండా.. రోస్టర్ విధానాన్ని తెలుసుకొని స్డడీపై దృష్టి పెట్టాల‌ని నిపుణులు సూచిస్తున్నారు.

First published:

Tags: Group 1, Telangana government jobs, Ts jobs, TSPSC

ఉత్తమ కథలు