Home /News /jobs /

TSPSC GROUP 1 ALERT FOR GROUP 1 CANDIDATES EXCLUSIVELY LIVE LESSONS TIME AND DETAILS EVK

TSPSC Group-1: గ్రూప్-1 అభ్య‌ర్థుల‌కు అల‌ర్ట్‌.. ప్ర‌త్యేకంగా లైవ్‌లో పాఠాలు.. స‌మ‌యం, వివ‌రాలు

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

    తెలంగాణ ప్రభుత్వ ఐటీ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిపుణ, విద్యాచానల్లో గ్రూప్-1 ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన స‌మాచారాన్ని టీశాట్ అందుబాటులోకి తీసుకొచ్చింది. గ్రూప్‌-1 ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన స‌మాచారాన్ని టీ-శాట్ యాప్, నిపుణ, విద్యాచాన‌ళ్ల ద్వారా అందిస్తున్న వాటికి సంబంధించిన రికార్డుల‌ను సోమ‌వారం యూట్యూబ్‌లోఅందుబాటులోకి తీసుకొచ్చాు. . నిపుణ చాన‌ల్‌లో ఉద‌యం 11 నుంచి 12 గంట‌ల వ‌ర‌కు, మ‌రుస‌టి రోజు ఉద‌యం 7 నుంచి 8 గంట‌ల వ‌ర‌కు రికార్డుల‌ను ప్ర‌సారం చేస్తారు.

    IT Jobs: టీసీఎస్‌లో ఎంబీఏ అర్హ‌త‌తో ఉద్యోగాలు.. అప్లికేష‌న్ ప్రాసెస్ వివ‌రాలు

    ఇవి గ్రామీణ యువ‌తకు ఉపయోగ ప‌డుతుంద‌ని టీశాట్ సీఈఓ ఆర్ శైలేశ్‌రెడ్డి తెలిపారు. విద్యాచాన‌ల్‌లో ఉద‌యం 8 నుంచి 10 గంట‌ల వ‌ర‌కు టెట్ పాఠాలు బోధిస్తున్న‌ట్టు తెలిపారు. గ్రూప్-I పరీక్షలకు హాజరు కావాలనుకునే అభ్యర్థులు ముందుగా TSPSC యొక్క వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (OTR) ఫారమ్‌ను పూరించాలి. ఇప్పటికే OTR ఫారమ్‌ను పూరించిన వారు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2018 ప్రకారం దానిని సవరించాలి.

    ద‌ర‌ఖాస్తు ఎలా చేసుకోవాలి..

    టీఎస్‌పీఎస్‌సీ వెబ్‌సైట్‌లో వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేయడానికి అభ్యర్థులు ముందుగా https://www.tspsc.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

    TCS Recruitment 2022: టీసీఎస్‌లో జాబ్ ఓపెనింగ్స్‌.. అర్హ‌త‌లు.. అప్లికేష‌న్ ప్రాసెస్ వివ‌రాలు

    - హోమ్ పేజీలో కుడివైపు One Time Registration పైన క్లిక్ చేయాలి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. Aadhaar Details సెక్షన్‌లో మొదట ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి, ఆధార్ కార్డులో ఉన్నట్టుగా పేరు ఎంటర్ చేయాలి.

    - Personal Details సెక్షన్‌లో ఎస్ఎస్‌సీ లేదా తత్సమాన సర్టిఫికెట్‌లో ఉన్నట్టుగా పేరు, జెండర్, పుట్టిన తేదీ, తండ్రి పేరు, ఐడెంటిఫికేషన్ మార్క్స్ లాంటి వివరాలన్ని ఎంటర్ చేయాలి.

    - Address Details సెక్షన్‌లో పోస్టల్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, ఇమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. Educational Qualifications సెక్షన్‌లో విద్యార్హతల వివరాలు ఎంటర్ చేయాలి.

    Postal Department Jobs: నిరుద్యోగుల‌కు అల‌ర్ట్‌.. తెలంగాణ. ఆంధ్రప్ర‌దేశ్ పోస్ట‌ల్ స‌ర్కిల్‌లో 2,942 ఉద్యోగాలు

    - మొదటి తరగతి నుంచి పదో తరగతి వరకు, ఇంటర్, డిప్లొమా, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎంఫిల్, పీహెచ్‌డీ లాంటి అర్హతలకు సంబంధించిన వివరాలు ఎంటర్ చేసి సర్టిఫికెట్స్ అప్‌లోడ్ చేయాలి.

    - Additional Qualifications సెక్షన్‌లో అదనపు అర్హతల వివరాలు ఎంటర్ చేయాలి. ఫోటో సంతకం అప్‌లోడ్ చేయాలి.

    TS Inter Exams 2022: నేటి నుంచి ఇంట‌ర్ ప‌రీక్ష‌లు ప్రారంభం.. విద్యార్థులు గుర్తుంచుకోవాల్సిన విష‌యాలు..

    - Notification Alerts ఆన్‌లో పెడితే ఉద్యోగాల నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారం లభిస్తుంది. ఆ తర్వాత Preview క్లిక్ చేసి వివరాలన్నీ సరిచూసుకోవాలి.

    - ఆ తర్వాత అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేస్తే TSPSC ID జనరేట్ అవుతుంది. టీఎస్‌పీఎస్‌సీ ఏ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసినా TSPSC ID ఎంటర్ చేసి అప్లై చేయొచ్చు.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Govt Jobs 2022, Group 1, Jobs in telangana, Ts jobs, TSPSC

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు