Home /News /jobs /

TSPSC GROUP 1 ALERT FOR GROUP 1 CANDIDATES CURRICULUM CHANGES KNOW DETAILS EVK

TSPSC Group-1: గ్రూప్‌-1 అభ్య‌ర్థుల‌కు అల‌ర్ట్‌.. పాఠ్యాంశాల్లో మార్పులు.. వివ‌రాలు

(ఫ్రతీకాత్మక చిత్రం)

(ఫ్రతీకాత్మక చిత్రం)

TSPSC Group-1 | తెలంగాణ‌లో తొలిసారి వెలువ‌డ్డ గ్రూప్‌-1 నోటిఫికేష‌న్‌కు ద‌ర‌ఖాస్తులు జోరుగా అందుతున్నాయి. ఈ నేప‌థ్యంలో గ్రూప్‌-1 పాఠ్యాంశాల్లో తెలుగు అకాడమీ అధికారులు స్పల్ప మార్పులు చేశారు.

    తెలంగాణ‌ (Telangana) లో తొలిసారి వెలువ‌డ్డ గ్రూప్‌-1 నోటిఫికేష‌న్‌కు ద‌ర‌ఖాస్తులు జోరుగా అందుతున్నాయి. ఈ నేప‌థ్యంలో గ్రూప్‌-1  (Group-1) పాఠ్యాంశాల్లో తెలుగు అకాడమీ అధికారులు స్పల్ప మార్పులు చేశారు.అవేంటంటే తెలంగాణ జాగ్రఫీ, ఎకానమీ పుస్తకాల్లో వర్తమాన అంశాలకు చోటు కల్పించారు. ఇప్పటికే తెలంగాణ జాగ్రఫీ పుస్తకం అందుబాటులోకి రాగా, ఎకానమీ పుస్తకం పదిరోజుల్లో ముద్రణ పూర్తికానున్నది.

    ముఖ్య‌మైన మార్పులు
    - కొత్త జిల్లాల ఏర్పాటుతో భౌగోళిక స్వరూపం మారిపోయింది.
    - మారుతున్న కాల‌నికి అనుగుణంగా పెద్ద జిల్లా, చిన్న జిల్లా, అక్షరాస్యత రేటు, లింగ నిష్పత్తి వంటి అంశాల్లో మార్పుల‌ను జాగ్రఫీ పుస్తకాల్లో చేర్చారు.

    Jobs in Telangana: రంగారెడ్డి డీఎంహెచ్ఓలో కాంట్రాక్టు ఉద్యోగాలు.. ద‌ర‌ఖాస్తుకు నాలుగు రోజులే చాన్స్‌!

    - ఎకానమీ సబ్జెక్టులో బడ్జెట్‌పై చాలా ప్రశ్నలను ఇస్తున్నారు.
    - తెలంగాణ‌లో తాజాగా ప్రవేశపెట్టిన కేంద్ర, రాష్ట్ర బడ్జెట్‌ వివరాలను ఎకానమీ పుస్తకాల్లో చేర్చారు.
    - తాజా జీఎస్డీపీ, తలసరి ఆదాయం గణాంకాలు, సెక్టోరల్‌ ట్రెండ్స్‌, సర్వీస్‌ సెక్టార్‌ ట్రెండ్స్‌, ఖాయిలా పడ్డ పరిశ్రమలకు ప్రోత్సాహకాలు, పారిశ్రామిక పాలసీ వివరాలను చేర్చారు. తాజా ఆర్థిక సర్వే, కాగ్‌ నివేదికల్లోని ముఖ్యాంశాలను పాఠ్యాంశాల్లో చేర్చారు.

    పెరుగుతున్న ద‌ర‌ఖాస్తులు..
    గ్రూ ప్‌-1కు దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 64,738కి చేరింది. కొత్తగా 94,765 మంది ఓటీఆర్‌ నమోదు చేసుకున్నారు. కాగా ఇప్పటికి 2,00,656 మంది ఓటీఆర్‌ను ఎడిట్‌ చేసుకున్నారు. ఓటీఆర్‌ నమోదు, ఎడిట్‌ చేసుకున్న వారి సంఖ్య 2,95,421కి చేరింది. కాగా.. టీఎస్‌పీఎస్సీలో గతంలోనే 25,38,590 మంది అభ్యర్థులు ఓటీఆర్‌ చేసుకున్నారు. కొత్తగా వచ్చిన జోనల్‌ వ్యవస్థ ప్రకారం వీళ్లంతా ఓటీఆర్‌ అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంది. ఓటీఆర్‌ చేసుకోకపోతే ఉద్యోగానికి దరఖాస్తు చేయడం కుదరదు. గ్రూప్‌-1కు మే 31వ తేదీ వరకూ దరఖాస్తు చేసుకోవచ్చు.

    TCS Recruitment 2022: టీసీఎస్‌లో జాబ్ ఓపెనింగ్స్‌.. అర్హ‌త‌లు.. అప్లికేష‌న్ ప్రాసెస్ వివ‌రాలు

    ద‌ర‌ఖాస్తు  విధానం..

    టీఎస్‌పీఎస్‌సీ వెబ్‌సైట్‌లో వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేయడానికి అభ్యర్థులు ముందుగా https://www.tspsc.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

    TCS Recruitment 2022: టీసీఎస్‌లో జాబ్ ఓపెనింగ్స్‌.. అర్హ‌త‌లు.. అప్లికేష‌న్ ప్రాసెస్ వివ‌రాలు

    - హోమ్ పేజీలో కుడివైపు One Time Registration పైన క్లిక్ చేయాలి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. Aadhaar Details సెక్షన్‌లో మొదట ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి, ఆధార్ కార్డులో ఉన్నట్టుగా పేరు ఎంటర్ చేయాలి.

    - Personal Details సెక్షన్‌లో ఎస్ఎస్‌సీ లేదా తత్సమాన సర్టిఫికెట్‌లో ఉన్నట్టుగా పేరు, జెండర్, పుట్టిన తేదీ, తండ్రి పేరు, ఐడెంటిఫికేషన్ మార్క్స్ లాంటి వివరాలన్ని ఎంటర్ చేయాలి.

    - Address Details సెక్షన్‌లో పోస్టల్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, ఇమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. Educational Qualifications సెక్షన్‌లో విద్యార్హతల వివరాలు ఎంటర్ చేయాలి.

    Postal Department Jobs: నిరుద్యోగుల‌కు అల‌ర్ట్‌.. తెలంగాణ. ఆంధ్రప్ర‌దేశ్ పోస్ట‌ల్ స‌ర్కిల్‌లో 2,942 ఉద్యోగాలు

    - మొదటి తరగతి నుంచి పదో తరగతి వరకు, ఇంటర్, డిప్లొమా, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎంఫిల్, పీహెచ్‌డీ లాంటి అర్హతలకు సంబంధించిన వివరాలు ఎంటర్ చేసి సర్టిఫికెట్స్ అప్‌లోడ్ చేయాలి.

    - Additional Qualifications సెక్షన్‌లో అదనపు అర్హతల వివరాలు ఎంటర్ చేయాలి. ఫోటో సంతకం అప్‌లోడ్ చేయాలి.

    TS Inter Exams 2022: నేటి నుంచి ఇంట‌ర్ ప‌రీక్ష‌లు ప్రారంభం.. విద్యార్థులు గుర్తుంచుకోవాల్సిన విష‌యాలు..

    - Notification Alerts ఆన్‌లో పెడితే ఉద్యోగాల నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారం లభిస్తుంది. ఆ తర్వాత Preview క్లిక్ చేసి వివరాలన్నీ సరిచూసుకోవాలి.

    - ఆ తర్వాత అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేస్తే TSPSC ID జనరేట్ అవుతుంది. టీఎస్‌పీఎస్‌సీ ఏ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసినా TSPSC ID ఎంటర్ చేసి అప్లై చేయొచ్చు.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Group 1, Jobs in telangana, Ts jobs, TSPSC

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు