Home /News /jobs /

TSPSC GROUP 1 ALERT FOR GROUP 1 CANDIDATES CHANGE IN PRELIMS SELECTION PROCESS KNOW DETAILS EVK

TSPSC Group-1: గ్రూప్‌-1 అభ్య‌ర్థుల‌కు అల‌ర్ట్‌.. ప్రిలిమ్స్ ఎంపిక విధానంలో మార్పులు.. పూర్తి వివరాలు

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

TSPSC Group-1 | తెలంగాణలో 503 గ్రూప్ 1 ఖాళీల భర్తీకి పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ఇటీవల నోటిఫికేషన్ (Telangana Jobs Notification) విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పోస్టుల‌కు సంబంధించి ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం అయ్యింది. తాజాగా ప‌రీక్ష నిర్వ‌హ‌ణ‌, ఎంపిక విధానంపై టీఎస్‌పీఎస్సీ కీల‌క నిర్ణ‌యం తీసుకోనుంది.

ఇంకా చదవండి ...
    తెలంగాణలో 503 గ్రూప్ 1 (TSPSC Group 1) ఖాళీల భర్తీకి పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ఇటీవల నోటిఫికేషన్ (Telangana Jobs Notification) విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పోస్టులకు సంబంధించి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయ్యింది. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇంత పెద్ద సంఖ్యలో ఖాళీలలతో గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదలైన చరిత్ర లేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి విడుదలైన తొలి నోటిఫికేషన్ కావడంతో లక్షలాది మంది నిరుద్యోగులు గ్రూప్ 1 ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్నారు.   ఈ నేపథ్యంలోనే గ్రూప్ 1 పరీక్షల నిర్వహణకు టీఎస్​పీఎస్సీ కసరత్తు చేస్తోంది. అప్లికేషన్లు భారీగా వస్తుండడంతో అందుకు తగ్గట్టు సెంటర్లు, ఇతర ఏర్పాట్లపై ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో ప్రిలిమ్స్​ఎగ్జామ్​ను జులై 31న నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు తెలిసింది. ప్రిలిమ్స్ ను జులై లేదా ఆగస్టులో నిర్వహిస్తామని టీఎస్ పీఎస్సీ గతంలో ప్రకటించింది.

    TS Police Recruitment: ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్య‌ర్థుల‌కు అల‌ర్ట్‌.. వారిని ప‌ట్టిస్తే రూ.లక్ష బహుమతి

    అయితే ముఖ్యంగా మరో పెద్ద రిక్రూట్మెంట్  పోలీస్ పోస్టులకు సంబంధించిన ఎగ్జామ్స్ ను ఆగస్టులోనే నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. ఆ పరీక్షలకు ఇబ్బంది లేకుండా జులై 31న నిర్వహించాలని నిర్ణయించినట్టు అధికార వర్గాల నుంచి వస్తున్న సమాచారం. అంతే కాకుండా ఆ రోజు నేషనల్ లెవెల్ పోటీ పరీక్షలు, ఇతర ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ ఏమైనా ఉంటే మరో తేదీ పరిశీలించాలని అధికారులు భావిస్తున్నారు.

    రోస్ట‌ర్ మెరిట్ ద్వారా ఎంపిక‌..
    - ఈసారి ప్రిలిమ్స్​ మార్కుల ఆధారంగానే మెయిన్స్​కు అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
    - ఒక్కో పోస్టుకు 50 మందిని చొప్పున మెయిన్స్ కు ఎంపిక చేయనున్నట్టు టీఎస్​పీఎస్సీ ప్రకటించింది.
    - గతంలో జనరల్ మెరిట్ ఆధారంగా ఎంపిక ఉండేది. కానీ ప్రస్తుతం రోస్టర్ ఆధారంగా ఎంపిక చేయనున్నారు.
    - మొత్తం 503 పోస్టులకు గాను ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున 25,150 మందిని ఎంపిక చేయాలి.

    Govt Jobs 2022: ఈ వారం ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సిన గ‌వ‌ర్న‌మెంట్‌ జాబ్స్‌.. అర్హ‌త‌లు, ద‌ర‌ఖాస్తు విధానం

    - ప్రిలిమ్స్​లో టాప్​లో నిలిచిన 25,150 మందిని కాకుండా... రోస్టర్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
    - మొదట మొత్తం ఎన్ని ఓపెన్ పోస్టులు ఉంటే, ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున టాప్ లో నిలిచిన అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
    - ఆ తర్వాత రిజర్వ్ డ్ పోస్టులకు ఆ కేటగిరీలోని ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున టాప్ లో ఉన్న ఆ కేటగిరీ అభ్యర్థులనే ఎంపిక చేస్తారు.

    IIT Hyderabad Recruitment: ఐఐటీ హైద‌రాబాద్‌లో రీసెర్చ్ ఫెలో జాబ్స్‌.. వేత‌నం నెల‌కు రూ.42,000.. అర్హ‌త‌లు, అప్లికేష‌న్ వివ‌రాలు

    గ్రూప్-1 పోస్టులకు ఇప్పటి వరకు 1.33 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెలాఖరు వరకు గడువు ఉండడంతో మరో లక్షన్నర నుంచి రెండు లక్షల మంది అప్లై చేసుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రిలిమ్స్​ఎగ్జామ్​ను 33 జిల్లా కేంద్రాల్లో నిర్వహించనున్నారు. అందుకు అనుగుణంగానే  అభ్యర్థులు దరఖాస్తు సమయంలో సెంటర్ల కోసం ప్రాధాన్య క్రమంలో 12 జిల్లాలను ఎంపిక చేసుకోవాలని సూచించింది.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Group 1, Jobs in telangana, Ts jobs, TSPSC

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు