హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

TSPSC Group-1: గ‌్రూప్‌-1 అభ్య‌ర్థుల‌కు అల‌ర్ట్‌.. వారంతా ఎన్ఓసీ స‌బ్‌మిట్ చేయాల్సిందే.. టీఎస్‌పీఎస్‌సీ

TSPSC Group-1: గ‌్రూప్‌-1 అభ్య‌ర్థుల‌కు అల‌ర్ట్‌.. వారంతా ఎన్ఓసీ స‌బ్‌మిట్ చేయాల్సిందే.. టీఎస్‌పీఎస్‌సీ

(ఫ్రతీకాత్మక చిత్రం)

(ఫ్రతీకాత్మక చిత్రం)

TSPSC Group-1: తెలంగాణలో నిన్న గ్రూప్1 నోటిఫికేషన్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే.. మొత్తం 503 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు అధికారులు. మే 2వ తేదీ నుంచి ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ నేప‌థ్యంలో ద‌ర‌ఖాస్తుల‌కు సంబంధించి కీల‌క అంశాన్ని టీఎస్‌పీఎస్‌సీ వెల్ల‌డించింది.

ఇంకా చదవండి ...

తెలంగాణలో నిన్న గ్రూప్1 నోటిఫికేషన్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే.. మొత్తం 503 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు అధికారులు. మే 2వ తేదీ నుంచి ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. దరఖాస్తుకు మే 31ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని ప్రకటనలో స్పష్టం చేశారు. అభ్యర్థులు టీఎస్పీఎస్సీ అధికారిక వెబ్ సైట్ (https://www.tspsc.gov.in/website) లో ధరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. గ్రూప్-1లో 19 రకాల పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొంది తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC). గ్రూప్-1లో ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున మెయిన్స్‌కు ఎంపిక చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఇటీవల గ్రూప్ 1 కు సంబంధించి ఇంటర్వ్యూలను రద్దు చేసింది తెలంగాణ సర్కార్.

TS Police Job Preparation: పోలీస్ ఉద్యోగాల‌కు ప్రిపేర్ అవుతున్నారా.. ఈ టైం టేబుల్ ట్రై చేయండి

ఎన్ఓసీ తప్పనిసరి..

గ్రూప్‌-1కు ద‌ర‌ఖాస్తు చేయాల‌నుకొనే ప్ర‌భుత్వ ఉద్యోగులు వారి శాఖాధికారి నుంచి నిర‌భ్యంత‌ర ప‌త్రం (ఎన్ఓసీ) స‌మ‌ర్పించాల‌ని టీఎస్‌పీఎస్సీ స్ప‌ష్టం చేసింది.

అంతే కాకుండా ప‌రీక్ష‌కు సంబంధించి మ‌రిన్ని సూచ‌న‌లు చేసింది.

- ప‌రీక్ష‌లో ఓఎమ్మార్‌పై హాల్‌టికెట్‌ను త‌ప్పుగా న‌మోదు చేయ‌కూడ‌దు. ఓఎమ్మార్‌సీట్‌పై, వైట్‌న‌ర్‌, బ్లేడ్ వంటి వాటిని ఉప‌యోగించొద్దు.

- వ‌యోప‌రిమితికి సంబంధించి గ్రూప్‌-1కు పోటీ ప‌డేవారికి 2022 జూలై 1ని క‌టాఫ్‌గా నిర్దేశించారు.

గ్రూప్-1  ఉద్యోగాలకు సంబంధించి విద్యార్హతల వివరాలు ..

1.డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ, సీటీఓ, డీపీఓ, జిల్లా రిజిస్ట్రార్, సహాయ ఎక్సైజ్ సూపరింటెండెంట్, పురపాలక కమిషనర్లు, బీసీ, ఎస్టీ సంక్షేమ అధికారులు, ఉపాధి అధికారి, ఏఓ, ఎంపీడీఓ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు ఏదైనా విభాగంలో డిగ్రీ విద్యార్హత పొంది ఉండాలి. యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుంచి ఈ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

TS Police Jobs: ఎస్సై అభ్య‌ర్థుల‌కు అల‌ర్ట్‌.. ప్రిలిమ్స్ ప్రిపేరేష‌న్ స్టార్ట్ చేశారా.. ఈ వివ‌రాలు తెలుసుకోండి

- ఇంకా డీఎస్పీ, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ (AES) ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటున్న పురుషులు 167.6 సెంటీమీటర్ల ఎత్తు కలిగి ఉండాలి. ఛాతి కొలత 86.3 సెం.మీ ఉండాలి.

-ఈ ఖాళీలకు అప్లై చేయాలనుకుంటున్న మహిళా అభ్యర్థులు 152.5 సెంటీమీటర్ల ఎత్తు, 45.5 కిలోల బరువు ఉండాలి.

2.సాంఘీక సంక్షేమ ఏడీ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటున్న అభ్యర్థులు డిగ్రీ ఉత్తీర్ణత ధించి ఉండాలి. సోషియాలజీ, సామాజిక సేవలో డిగ్రీ చేసిన వారికి ప్రాధాన్యం ఉంటుంది.

TSPSC Group 1: గ్రూప్స్ అభ్య‌ర్థుల‌కు గుడ్ న్యూస్‌.. ఖాళీల‌ భ‌ర్తీపై కీల‌క జీవో.. పోస్టుల వివ‌రాలు

3.సహాయ ట్రెజరీ అధికారి పోస్టులకు కామర్స్/ఎకనామిక్స్/మాథ్స్ సబ్జెక్టుల్లో డిగ్రీ చేసి ఉండాలి. సెకండ్ క్లాస్ లో పాసై ఉండాలి.

4.ప్రాంతీయ రవాణా అధికారి పోస్టులకు మెకానికల్/ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లేదా తత్సమాన డిగ్రీ పాసై ఉండాలి.

5.అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ పోస్టుకు ఏదైనా డిగ్రీ పాసైన వారు అప్లై చేసుకోవచ్చు. ఇంకా కార్మిక సంక్షేమానికి సంబంధించిన సమాజిక సేవ(సోషల్ వర్క్)లో పీజీ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.

First published:

Tags: Govt Jobs 2022, Group 1, JOBS, Telangana government jobs, TSPSC

ఉత్తమ కథలు