హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

TSPSC Group 1: గ్రూప్‌-1 అభ్య‌ర్థుల‌కు అల‌ర్ట్‌.. రేప‌టి నుంచి అప్లికేష‌న్‌లు ప్రారంభం.. పోస్టుల వారీగా విద్యార్హ‌త‌లు

TSPSC Group 1: గ్రూప్‌-1 అభ్య‌ర్థుల‌కు అల‌ర్ట్‌.. రేప‌టి నుంచి అప్లికేష‌న్‌లు ప్రారంభం.. పోస్టుల వారీగా విద్యార్హ‌త‌లు

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

TSPSC Group 1 | తెలంగాణ ఏర్పడిన అనంతరం తొలి గ్రూప్ 1 నోటిఫికేషన్‌కి సంబంధించి మే 2, 2022 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. దాదాపు 18 శాఖ‌ల్లో 503 గ్రూప్‌-1 పోస్టుల కోసం ఈ మే 31, 2022 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

తెలంగాణ ఏర్పడిన అనంతరం తొలి గ్రూప్ 1 నోటిఫికేషన్‌కి సంబంధించి మే 2, 2022 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. దాదాపు 18 శాఖ‌ల్లో 503 గ్రూప్‌-1 పోస్టుల కోసం ఈ మే 31, 2022 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. టీఎస్‌పీఎస్సీ ఓటీఆర్‌ ఆధారంగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొనే అవకాశం ఉండగా.. ఇప్పటికే అధికారులు ఓటీఆర్‌లో మార్పులు చేసుకొనే వెసులుబాటు కల్పించారు. శనివారం వరకు 1.40 లక్షల అభ్యర్థులు మాత్రమే ఓటీఆర్‌లో మార్పులు చేసుకున్నారు.

TSPSC Group-1: గ్రూప్‌-1 అభ్య‌ర్థుల‌కు అల‌ర్ట్‌.. పోస్టుల కేటాయింపుపై సందేహాలా.. ఈ విష‌యాలు తెలుసుకోండి

విద్యార్హ‌త‌లు..

- డిస్ట్రిక్ట్‌ సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ పోస్టుకు ఏదేని డిగ్రీ పూర్తిచేసిన వారు అర్హులు.

- రీజినల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఆఫీసర్‌ (ఆర్టీవో) ఉద్యోగాలకు బీటెక్‌ మెకానికల్‌, ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.

- అసిస్టెంట్‌ ట్రెజరీ అధికారి ఉద్యోగానికి డిగ్రీలో కామర్స్‌, ఎకనామిక్స్‌ లేదా గణితం సబ్జెక్టుల్లో కనీసంగా సెకండ్‌ క్లాస్‌లో పాసై ఉండాలి.

- అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌ పోస్టుకు ఆర్ట్స్‌, సైన్స్‌, కామర్స్‌ డిగ్రీ వారు అర్హులే.

- మిగతా అన్ని పోస్టులకు ఏదేనీ డిగ్రీ పూర్తిచేసిన వారు అర్హులు.

విభాగాల వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి..

జిల్లా బీసీ అభివృద్ధి అధికారి పోస్టులు- 5

అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ పోస్టులు- 40

అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ పోస్టులు-38

TSPSC Group-1: గ‌్రూప్‌-1 అభ్య‌ర్థుల‌కు అల‌ర్ట్‌.. వారంతా ఎన్ఓసీ స‌బ్‌మిట్ చేయాల్సిందే.. టీఎస్‌పీఎస్‌సీ

అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీస్‌- 20 (పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్)

డీఎస్పీ- 91

జైళ్లశాఖలో డీఎస్పీ పోస్టులు- 2

మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి- 121

జిల్లా పంచాయతీ అధికారి పోస్టులు- 5

సీటీఓ- 48

డిప్యూటీ కలెక్టర్లు- 42

అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్- 26

ప్రాంతీయ రవాణా అధికారి- 4

అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌- 8

జిల్లా ఉపాధి అధికారి- 2

జిల్లా మైనారిటీల సంక్షేమ అధికారి పోస్టులు- 6

గ్రేడ్‌-2 మున్సిపల్‌ కమిషనర్‌ పోస్టులు- 35

ఎన్ఓసీ తప్పనిసరి..

గ్రూప్‌-1కు ద‌ర‌ఖాస్తు చేయాల‌నుకొనే ప్ర‌భుత్వ ఉద్యోగులు వారి శాఖాధికారి నుంచి నిర‌భ్యంత‌ర ప‌త్రం (ఎన్ఓసీ) స‌మ‌ర్పించాల‌ని టీఎస్‌పీఎస్సీ స్ప‌ష్టం చేసింది. అంతే కాకుండా ప‌రీక్ష‌కు సంబంధించి మ‌రిన్ని సూచ‌న‌లు చేసింది.

TS Police Job Preparation: పోలీస్ ఉద్యోగాల‌కు ప్రిపేర్ అవుతున్నారా.. ఈ టైం టేబుల్ ట్రై చేయండి

- ప‌రీక్ష‌లో ఓఎమ్మార్‌పై హాల్‌టికెట్‌ను త‌ప్పుగా న‌మోదు చేయ‌కూడ‌దు. ఓఎమ్మార్‌సీట్‌పై, వైట్‌న‌ర్‌, బ్లేడ్ వంటి వాటిని ఉప‌యోగించొద్దు.

- వ‌యోప‌రిమితికి సంబంధించి గ్రూప్‌-1కు పోటీ ప‌డేవారికి 2022 జూలై 1ని క‌టాఫ్‌గా నిర్దేశించారు.

First published:

Tags: Job notification, JOBS, Telangana government jobs, Ts jobs, TSPSC

ఉత్తమ కథలు