TSPSC Jobs: హైదరాబాద్ వాటర్ బోర్డులో ఉద్యోగాలు... దరఖాస్తు గడువు పొడిగింపు

HMWSSB Recruitment 2020 | హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డులో ఉద్యోగాలకు దరఖాస్తు చేయనివారికి గుడ్ న్యూస్. దరఖాస్తు గడువు ఏప్రిల్ 30 వరకు పొడిగించింది టీఎస్‌పీఎస్‌సీ.

news18-telugu
Updated: March 30, 2020, 10:51 AM IST
TSPSC Jobs: హైదరాబాద్ వాటర్ బోర్డులో ఉద్యోగాలు... దరఖాస్తు గడువు పొడిగింపు
TSPSC Jobs: హైదరాబాద్ వాటర్ బోర్డులో ఉద్యోగాలు... దరఖాస్తు గడువు పొడిగింపు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-TSPSC హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డ్-HMWSSB ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 93 మేనేజర్ పోస్టుల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్ ఇది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా లాక్‌డౌన్ కొనసాగుతుండటంతో దరఖాస్తు ప్రక్రియను పొడిగించింది టీఎస్‌పీఎస్‌సీ. వాస్తవానికి ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 2020 మార్చి 30న ముగుస్తుందని నోటిఫికేషన్‌లో వెల్లడించింది టీఎస్‌పీఎస్‌సీ. 2020 ఏప్రిల్ 30 వరకు దరఖాస్తు గడువు పొడిగిస్తున్నట్టు టీఎస్‌పీఎస్‌సీ ప్రకటించింది. కాబట్టి ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి మరో నెల రోజులు గడువు ఉంది. సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లాంటి బ్రాంచ్‌లో మేనేజర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది టీఎస్‌పీఎస్‌సీ.పూర్తి వివరాలను టీఎస్‌పీఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్ https://www.tspsc.gov.in/ ఓపెన్ చేసి చూడొచ్చు.

HMWSSB Recruitment 2020, TSPSC Recruitment 2020, HMWSSB manager jobs, Hyderabad Water Board manager jobs, Hyderabad jobs, Telangana Jobs, టీఎస్‌పీఎస్‌సీ రిక్రూట్‌మెంట్ 2020, హైదరాబాద్ వాటర్ బోర్డ్ మేనేజర్ ఉద్యోగాలు, తెలంగాణ ఉద్యోగాలు, హైదరాబాద్ ఉద్యోగాలు
Source: TSPSC


HMWSSB Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2020 మార్చి 16
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 ఏప్రిల్ 30
విద్యార్హత- సంబంధిత బ్రాంచ్‌లో ఇంజనీరింగ్ డిగ్రీ.
వయస్సు- 2020 జూలై 1 నాటికి 18 నుంచి 34 ఏళ్లు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 ఏళ్లు, ఎక్స్‌సర్వీస్‌మెన్, ఎన్‌సీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 5 ఏళ్లు, వికలాంగులకు 10 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.దరఖాస్తు ఫీజు- రూ.200
పరీక్షా కేంద్రాలు- హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్.

HMWSSB Recruitment 2020: ఖాళీల వివరాలివే...


మొత్తం ఖాళీలు- 93
మేనేజర్ (సివిల్ ఇంజనీరింగ్)- 79
మేనేజర్ (మెకానికల్ ఇంజనీరింగ్)- 06
మేనేజర్ (ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్)- 04
మేనేజర్ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్)- 03
మేనేజర్ (కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంజనీరింగ్)- 01

నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Telangana Jobs: ఉద్యోగాల భర్తీకి హెల్త్ డిపార్ట్‌మెంట్ నోటిఫికేషన్

Internship: డిగ్రీ విద్యార్థులకు రాజ్యసభలో ఇంటర్న్‌షిప్... పూర్తి వివరాలివే

SBI Fellowship: డిగ్రీ పాసైనవారికి గుడ్ న్యూస్... ఎస్‌బీఐ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్
First published: March 30, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading