news18-telugu
Updated: April 14, 2020, 12:16 PM IST
(ప్రతీకాత్మక చిత్రం)
కరోనా వైరస్ సంక్షోభం కారణంగా వ్యవస్థలన్నీ ఆగిపోయాయి. నియామక ప్రక్రియలకూ బ్రేక్ పడుతోంది. ఇప్పటికే విడుదలైన నోటిఫికేషన్లను వాయిదా పడుతున్నాయి. దరఖాస్తు చివరి తేదీలను పొడిగించక తప్పట్లేదు. ఇటీవల విడుదలైన ఉద్యోగ ప్రకటనల్లో ఏఏ నోటిఫికేషన్ల గడువును పొడిగించారో తెలుసుకోండి. మీ అర్హతలకు తగ్గ ఉద్యోగాలు ఉంటే దరఖాస్తు చేయండి.
1. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-TSPSC హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డ్-HMWSSB ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 93 మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. దరఖాస్తు గడువును ఏప్రిల్ 30 వరకు పొడిగించింది టీఎస్పీఎస్సీ. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు
ఇక్కడ క్లిక్ చేయండి.2. బీటెక్ పాసైనవారికి 259 ఉద్యోగాలను ఆఫర్ చేసింది ఎన్ఎల్సీ ఇండియా లిమిటెడ్-NLCIL. వాస్తవానికి దరఖాస్తు గడువు ఏప్రిల్ 17న ముగియాల్సి ఉంది. కరోనా వైరస్ సంక్షోభం కారణంగా మే 17 వరకు దరఖాస్తు గడువును పెంచారు. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకునేందుకు
ఇక్కడ క్లిక్ చేయండి.
3. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI మొత్తం 39 కన్సల్టెంట్స్, స్పెషలిస్ట్స్, అనలిస్ట్ పోస్టుల్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌ను వాయిదా వేసింది ఆర్బీఐ. మరిన్ని వివరాల కోసం
ఇక్కడ క్లిక్ చేయండి.
4. తెలంగాణ హైకోర్టులో సివిల్ జడ్జి ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. దరఖాస్తు గడువును 2020 మే 15 వరకు పొడిగించడంతో అభ్యర్థులకు దరఖాస్తు చేయడానికి ఇంకా నెల రోజుల సమయం ఉంది. అర్హతలు, ఇతర వివరాల కోసం
ఇక్కడ క్లిక్ చేయండి.
5. విశాఖపట్నంలోని హిందుస్తాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్-HSL ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ సంక్షోభం కారణంగా దరఖాస్తును 2020 ఏప్రిల్ 30 వరకు పొడిగించింది హెచ్ఎస్ఎల్. ఈ నోటిఫికేషన్ వివరాల కోసం
ఇక్కడ క్లిక్ చేయండి.
6. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్-ISRO ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. దరఖాస్తు గడువు ఏప్రిల్ 3 వరకేనని నోటిఫికేషన్లో ప్రకటించింది ఇస్రో. కరోనా వైరస్ కారణంగా సంక్షోభం నెలకొనడంతో దరఖాస్తు గడువును 2020 మే 1 వరకు పొడిగించింది. పూర్తి వివరాల కోసం
ఇక్కడ క్లిక్ చేయండి.7. హెవీ ఇంజనీరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్-HECL 169 పోస్టులకు దరఖాస్తు గడువు పొడిగించింది. 2020 ఏప్రిల్ 25 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేయొచ్చు. మరిన్ని వివరాల కోసం
ఇక్కడ క్లిక్ చేయండి.
8. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్-DRDO పలు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు గడువు పొడిగించింది. మొత్తం 116 అప్రెంటీస్ పోస్టుల్ని ప్రకటించింది డీఆర్డీఓ. ఆసక్తిగల అభ్యర్థులు 2020 ఏప్రిల్ 17 లోగా దరఖాస్తు చేయొచ్చు. మరిన్ని వివరాల కోసం
ఇక్కడ క్లిక్ చేయండి.
Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇవి కూడా చదవండి:
RRB NTPC: ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్స్ ఇప్పట్లో లేనట్టే... ఎందుకంటే
SBI Fellowship: డిగ్రీ పాసైనవారికి ఎస్బీఐ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్
Jobs: డిగ్రీ, బీటెక్, పీజీ పాసైనవారికి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీలో జాబ్స్
Published by:
Santhosh Kumar S
First published:
April 14, 2020, 12:16 PM IST