తెలంగాణ (Telangana) ఆవిర్భావం తర్వాత తొలిసారిగా నిర్వహించనున్న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు (TSPSC Group 1 Exam) అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రేపు అంటే ఈ నెల 16వ తేదీ ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ పరీక్ష నిర్వహించనున్నారు. ఇందు కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1019 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. మొత్తం 503 గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) నోటిఫికేషన్ విడుదల చేయగా.. 3.8 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. భారీగా అభ్యర్థులు హాజరుకానున్న నేపథ్యంలో అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. పరీక్షా కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ ను అమలు చేయనున్నారు. ఇంకా ఎగ్జామ్ సెంటర్లకు సమీపంలో జిరాక్స్ సెంటర్లు, ఇంటర్ నెట్ కేంద్రాలను మూసివేయనున్నారు. ఈ సారి అభ్యర్థుల నుంచి బయోమెట్రిక్ వివరాలను నమోదు చేయనున్నట్లు ఇప్పటికే పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది. దీంతో రద్దీ ఏర్పడకుండా.. ఉదయం 8.30 నిమిషాల నుంచే అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించనున్నారు.
ఇంకా అభ్యర్థులు షూలు ధరించి రావొద్దని.. చెప్పులను ధరించే ఎగ్జామ్ సెంటర్లకు రావాలని అధికారులు సూచించారు. గోరింటాకు, టాటూలతో రావొవద్దని కమిషన్ స్పష్టం చేసింది. ఇంకా వాచీలు కూడా వద్దని తెలిపింది. అయితే.. అభ్యర్థులకు సమయం తెలియడం కోసం ప్రతీ అరగంటకు ఓ సారి బెల్ మోగించనున్నట్లు బోర్డు తెలిపింది. అభ్యర్థులు ఎవరైనా నిబంధనలు పాటించకుంటే పరీక్షలు రాయకుండా డిబార్ చేస్తామని టీఎస్పీఎస్సీ స్పష్టం చేసింది.
ఓఎంఆర్ షీట్ నింపే ముందు ఒకటి రెండు సార్లు నిబంధనలు చదువుకోవాలని అధికారులు అభ్యర్థులకు సూచిస్తున్నారు. ఎలాంటి మిస్టేక్ చేసినా ఓఎంఆర్ ను వాల్యుయేషన్ చేయబోమని బోర్డు స్పష్టం చేసింది. ఇంకా గ్రూప్-1 పరీక్ష నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ సైతం అభ్యర్థుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. బస్టాండ్ల నుంచి కేంద్రాలకు స్పెషల్ బస్సులను నడపనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Group 1, JOBS, State Government Jobs, Telangana government jobs, TSPSC