హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

TSPSC Alert: తెలంగాణ నిరుద్యోగులకు అలర్ట్.. టీఎస్పీఎస్సీ కీలక హెచ్చరిక

TSPSC Alert: తెలంగాణ నిరుద్యోగులకు అలర్ట్.. టీఎస్పీఎస్సీ కీలక హెచ్చరిక

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణలో భారీగా ఉద్యోగ నోటిఫికేషన్లు (Telangana Job Notifications) విడుదలవుతున్న నేపథ్యంలో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్  (TSPSC) నిరుద్యోగులకు తాజాగా కీలక ప్రకటన విడుదల చేసింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

తెలంగాణలో భారీగా ఉద్యోగ నోటిఫికేషన్లు (Telangana Job Notifications) విడుదలవుతున్న నేపథ్యంలో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్  (TSPSC) నిరుద్యోగులకు తాజాగా కీలక ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వ ఉద్యోగాలను ఇస్తామంటూ ఎవరైనా దళారులు సంప్రదిస్తే అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వారిని నమ్మి మోసపోవద్దని సూచించింది. కొంతమంది మెరిట్ లిస్ట్ ల పేరిట డబ్బులు వసూలు చేసినట్లు కమిషన్ దృష్టికి వచ్చినట్లు వెల్లడించింది. అసలు మెరిట్ లిస్ట్ విధానమే టీఎస్పీఎస్సీ వద్ద లేదని స్పష్టం చేసింది. కమిషన్ ఎట్టి పరిస్థితుల్లోనూ నియామక పత్రాలను అభ్యర్థులకు వ్యక్తిగతంగా పంపదని తెలిపింది. అత్యంత పారదర్శకంగా నియామక ప్రక్రియ సాగుతోందని వెల్లడించింది. దళారుల మాటలను నమ్మి మోసపోవద్దని అభ్యర్థులకు సూచించింది. ఎవరైనా సంప్రదించి డబ్బులు ఇస్తే ఉద్యోగాలు ఇస్తామని చెబితే వెంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించింది. అప్డేట్స్ కోసం అధికారిక వెబ్ సైట్ (https://www.tspsc.gov.in/) ను మాత్రమే సంప్రదించాలని స్పష్టం చేసింది.

అయితే.. ఓఎంఆర్ షీట్లలో బబ్లింగ్ లో తప్పులు చేస్తే వారి ఆన్సర్ షీట్లను పరిగణించవద్దని ఇప్పటికే కోర్టులు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. కానీ.. అనేక మంది అభ్యర్థులు ఇప్పటికీ వివిధ నియామక పరీక్షల్లో జంబ్లింగ్ లో తప్పులు చేసి కమిషన్ ను ఆశ్రయిస్తున్నారు. తమ ఓఎంఆర్ షీట్లను పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం జరగనున్న మహిళా శిశు సంక్షేమ శాఖలో 181 సూపర్ వైజర్ పోస్టుల నియామక పరీక్షకు సంబంధించి టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డి ఎగ్జామ్ సెంటర్ల సూపరింటెండెంట్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అభ్యర్థులు జంబ్లింగ్ లో తప్పులు చేయకుండా చూడాలని కోరారు. తప్పుడు జంబ్లింగ్ లేని కేంద్రాలను గుర్తించి అవార్డులు ఇస్తామని ప్రకటించారు.

Railway Recruitment 2022: నిరుద్యోగులకు అలర్ట్.. దక్షిణ మధ్య రైల్వేలో 4 వేల జాబ్స్ .. టెన్త్ పాసైన వారికి ఛాన్స్

తెలంగాణలో టీఎస్పీఎస్సీ(TSPSC) ద్వారా డిసెంబర్ కంటే ముందు విడుదలైన నోటిఫికేషన్లకు పరీక్షల తేదీలను ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే 833 అసిస్టెంట్ ఇంజినీర్ (Assistant Engineer) ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఏఈ పరీక్షకు సంబంధించి ఇటీవల పరీక్ష తేదీని టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఫిబ్రవరి 12, 2023న ఈ పరీక్షను నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ కొన్ని రోజుల కిందట వెబ్ నోట్ విడుదల చేసింది. అసిస్టెంట్‌ ఇంజినీర్‌, మున్సిపల్‌ అసిస్టెంట్ ఇంజినీర్‌ పోస్టులు, టెక్నికల్‌ ఆఫీసర్‌, జూనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ వంటి పోస్టులు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

అయితే తాజాగా ఈ పరీక్ష తేదీల్లో మార్పు చేస్తూ టీఎస్పీఎస్సీ వెబ్ నోట్ విడుదల చేసింది. వెబ్ నోట్ ప్రకారం.. ఫిబ్రవరి 12వ తేదీన GATE పరీక్ష ఉండటంతో.. దీనిని మరో తేదీకి పోస్ట్ పోన్ చేశారు. మార్చి 05, 2023న ఈ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పరీక్షను నిర్వహిస్తామని టీఎస్పీఎస్సీ పేర్కొంది. ఈ పరీక్ష యొక్క అడ్మిట్ కార్డులను పరీక్ష జరిగే సమయాని కంటే వారం రోజుల ముందు వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచనున్నారు.

First published:

Tags: JOBS, Telangana government jobs, TSPSC

ఉత్తమ కథలు