TS PECET: రేపు టీఎస్‌ పీఈసెట్ నోటిఫికేషన్ విడుదల... మే 13న ఎగ్జామ్

TSPECET 2020 | బ్యాచిలర్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (B.PEd), డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (D.PEd) కోర్సులు చేయాలనుకునేవారికి శుభవార్త. ఫిబ్రవరి 21న టీఎస్‌పీఈసెట్ 2020 నోటిఫికేషన్ విడుదల కానుంది.

news18-telugu
Updated: February 20, 2020, 12:26 PM IST
TS PECET: రేపు టీఎస్‌ పీఈసెట్ నోటిఫికేషన్ విడుదల... మే 13న ఎగ్జామ్
TS PECET: రేపు టీఎస్‌ పీఈసెట్ నోటిఫికేషన్ విడుదల... మే 13న ఎగ్జామ్ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
తెలంగాణ స్టేట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్-TSPECET 2020 నోటిఫికేషన్ 2020 ఫిబ్రవరి 21న విడుదల కానుంది. బ్యాచిలర్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (B.PEd), డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (D.PEd) ఫస్ట్ ఇయర్‌లో చేరాలనుకునే విద్యార్థులు ఈ పరీక్ష రాయాల్సి ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో నల్గొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ TSPECET 2020 నిర్వహిస్తోంది. అభ్యర్థులు ఫిబ్రవరి 21 నుంచి ఏప్రిల్ 13 వరకు దరఖాస్తు చేయొచ్చు. రూ.500 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 22 వరకు, రూ.2000 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 29 వరకు, రూ.5000 ఆలస్య రుసుముతో మే 6 వరకు దరఖాస్తు చేయొచ్చు. ఏప్రిల్ 13 లోగా దరఖాస్తు చేసినవారికి ఏప్రిల్ 20 నుంచి హాల్ టికెట్స్ అందుబాటులో ఉంటాయి. మే 8 వరకు హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

తెలంగాణలో మే నుంచి అన్ని ప్రవేశ పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. మే 2న ఈసెట్, మే 5, 6, 7 తేదీల్లో ఎంసెట్, మే 9, 11 తేదీల్లో అగ్రికల్చర్ సెట్, మే 13న పీఈ సెట్, మే 20, 21 తేదీల్లో ఐసెట్, మే 23న ఎడ్‌సెట్ నిర్వహిస్తారు. ఎడ్‌సెట్ అభ్యర్థులు ఎక్కువగా ఉంటే మే 24న కూడా పరీక్ష జరగనుంది. మే 25 నుంచి లాసెట్, మే 27 నుంచి 30 వరకు పీజీఈసెట్ పరీక్షలు జరుగుతాయి. మే నెలలో అన్ని ఆదివారాల్లో కేంద్ర ప్రభుత్వం నిర్వహించే పరీక్షలు ఉన్నాయి. ఆ పరీక్షలకు ఇబ్బంది లేకుండా ఎంసెట్, ఈసెట్, ఐసెట్ లాంటి పరీక్షల తేదీలను నిర్ణయించింది రాష్ట్ర ఉన్నత విద్యామండలి.

ఇవి కూడా చదవండి:

UPSC Jobs 2020: యూపీఎస్‌సీ నుంచి 886 పోస్టుల భర్తీ... అప్లై చేయండిలా



Telangana Jobs: తెలంగాణలో 1466 ఉద్యోగాలు... ఇంటర్, డిగ్రీ అర్హత

Andhra Pradesh Jobs: ఇంటర్, డిగ్రీ పాసైనవారికి ఆంధ్రప్రదేశ్‌లో 1502 ఉద్యోగాలు
First published: February 20, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు