TSPCDL RECRUITMENT 2022 ALERT FOR THE UNEMPLOYED MORE NOTIFICATION DETAILS FOR 201 POSTS FROM THE DEPARTMENT OF POWER EVK
TSPCDL Recruitment 2022: నిరుద్యోగులకు అలర్ట్.. విద్యుత్ శాఖ నుంచి 201 పోస్టులకు మరో నోటిఫికేషన్ వివరాలు!
విద్యుత్ శాఖలో ఉద్యోగాలు
Jobs in Telangana | తెలంగాణ విద్యుత్ శాఖ నుంచి మరో నోటిఫికేషన్ వచ్చింది. దక్షిణతెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (TSSPDCL) మరో 201 సబ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) ఉద్యోగాల భర్తీకి అధికారులు జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేశారు
తెలంగాణ విద్యుత్ శాఖ నుంచి మరో నోటిఫికేషన్ వచ్చింది. దక్షిణతెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (TSSPDCL) మరో 201 సబ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) ఉద్యోగాల భర్తీకి అధికారులు జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు (Jobs) దరఖాస్తు పక్రియ జూన్ 15, 2022 నుంచి ప్రారంభం కానుందని అధికారులు వెల్లడించారు. అప్లై చేసుకోవడానికి జూలై 5, 2022ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుందని ప్రకటనలో స్పష్టం చేశారు. అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://www.tssouthernpower.com/ ను సందర్శించాల్సి ఉంటుంది.
విద్యార్హతల వివరాలు:
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ (DEE) (లేదా) డిప్లొమాలో డిప్లొమా కలిగి ఉండాలి. ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ (DEEE) లేదా ఎలక్ట్రికల్లో గ్రాడ్యుయేషన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో డిప్లొమాతో పాటు ఇంజినీరింగ్ (లేదా) అదనంగా ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో గ్రాడ్యుయేషన్ ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో డిప్లొమా లేదా ఏదైనా ఇతర తత్సమానం బోర్డ్/యూనివర్శిటీ ఆఫ్ స్టేట్/ఇండియా/చే గుర్తించబడిన అర్హత ఉండాలి.
వయో పరిమితి:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తుదారుల వయస్సు 18-44 ఏళ్లు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్ల పాటు వయో పరిమితిలో సడలింపు ఇచ్చారు.
దరఖాస్తు ఫీజు: ప్రతీ అభ్యర్థులు అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు కింద రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. ఎగ్జామ్ పీజు కింద రూ.120 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఎగ్జామ్ ఫీజు చెల్లింపులో మినహాయింపు ఇచ్చారు.
దరఖాస్తుల వివరాలు:
ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ జూన్ 15, 2022 నుంచి ప్రారంభం అవుతుంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీ నుంచి అధికారిక వెబ్ సైట్ https://tssouthernpower.cgg.gov.in లో అప్లై చేసుకోవాలని ప్రకటనలో స్పష్టం చేశారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు జూలై 23 నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అనంతర జూలై 31 వారికి రాత పరీక్ష నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.