Home /News /jobs /

TSLPRB TELANGANA SUB INSPECTOR CONSTABLE JOBS HERE SELECTION PROCESS NS

TS Police Jobs: ఎస్ఐ, కానిస్టేబుల్ జాబ్స్ కు అప్లై చేస్తున్నారా? అయితే, సెలక్షన్ ప్రాసెస్ ఇదే.. తెలుసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) తాజాగా ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. అయితే, ఈ ఉద్యోగాలకు సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...
    లక్షలాది మంది నిరుద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్న పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ ను (Police Jobs Notification) అధికారులు విడుదల చేశారు. కానిస్టేబుల్ పోస్టులు 16,027, ఎస్ఐ పోస్టులు 587ను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లలో తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) పేర్కొంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ మే 2న ప్రారంభం కానున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. దరఖాస్తుకు మే 22ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అయితే పోలీసు ఉద్యోగాలకు మొత్తం మూడు దశల్లో ఎంపిక ప్రక్రియ (TS Police Jobs Selection Process) ఉంటుంది. మొదట ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది. ఈ ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఫిజికల్‌ ఎఫిషియన్సీ, దేహ దారుఢ్య పరీక్షలను నిర్వహిస్తారు. ఇందులోనూ అర్హత సాధించిన అభ్యర్థులకు ఫైనల్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఫైనల్ ఎగ్జామ్ లో సత్తా చాటిన అభ్యర్థులకు ఉద్యోగం లభిస్తుంది.

    ప్రిలిమినరీ ఎగ్జామ్:
    మొత్తం 200 మార్కులకు రాత పరీక్ష ఉంటుంది. ఇందులో అర్థమెటిక్, రీజనింగ్‌/మెంటల్‌ ఎబిలిటీకి సంబంధించి 100 మార్కులు ఉంటాయి. జనరల్‌ స్టడీస్‌కు (GS) కు సంబంధించి మరో 100 మార్కులు ఉంటాయి. ఇందులో కనీసం 30శాతం మార్కులు సాధించిన వారు క్వాలిఫై అవుతారు. వారు తర్వాత నిర్వహించే ఫిజికల్‌ ఎఫిషియన్సీ, దేహ దారుడ్య పరీక్షలకు ఎలిజిబిలిటీని పొందుతారు. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులు ఫైనల్ ఎగ్జామ్ రాసేందుకు అనుమతి పొందుతారు.
    Physical Measurements: ఎస్సై. కానిస్టేబుల్ ద‌రాఖాస్తు చేస్తున్నారా. పోస్టుల వారీగా ఫిజిక‌ల్ మెజ‌ర‌మెంట్స్ వివరాలు

    ఫైనల్ ఎగ్జామ్:
    సివిల్‌ కానిస్టేబుల్, ఫైర్‌మన్, వార్డర్‌ (పురుష, మహిళ) అభ్యర్థులు 200 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఏఆర్‌ కానిస్టేబుల్, టీఎస్‌ఎస్‌పీ కానిస్టేబుల్, ఎస్పీఎఫ్‌ విభాగాల అభ్యర్థులు 100 మార్కులకు పరీక్ష ఉంటుంది.
    TS Police Jobs: పోలీస్ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారా.. ఈసారి నోటిఫికేష‌న్‌లో ఈ మార్పులు గ‌మ‌నించండి

    ఎస్ఐ జాబ్స్ కు..
    సివిల్‌ ఎస్సై, ఫైర్‌ ఆఫీసర్, డిప్యూటీ జైలర్‌ అభ్యర్థులకు 4 పేపర్లలో 600 మార్కులకు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఏఆర్‌ ఎస్సై, టీఎస్‌ఎస్‌పీ ఎస్సై, ఎస్పీఎఫ్‌ ఎస్ఐ అభ్యర్థులు 400 మార్కులకు నాలుగు ఎగ్జామ్స్ రాయల్సి ఉంటుంది.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: JOBS, Police jobs, Telangana government jobs, Telangana police jobs

    తదుపరి వార్తలు