Home /News /jobs /

TSLPRB TELANGANA POLICE JOBS HERE IS THE IMPORTANT UPDATE TO THE CANDIDATES FROM RECRUITMENT BOARD NS

TS Police Jobs: తెలంగాణ పోలీస్ జాబ్స్ కు అప్లై చేస్తున్నారా? అయితే, ఈ కీలక విషయం తప్పక తెలుసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణ పోలీస్ ఉద్యోగాలకు (Telangana Police Jobs) సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బోర్డ్ (TSLPRB) అభ్యర్థులకు కీలక సూచించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    తెలంగాణలో పోలీస్ ఉద్యోగాలకు (Telangana Police Jobs) సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ప్రస్తుతం జోరుగా సాగుతోంది. ఈ నెల 2న ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 20తో ముగియనుంది. ఇప్పటికే దాదాపు 4.5 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) వెల్లడించింది. గతంతో పోలీస్తే ఈ సారి మహిళా అభ్యర్థులు సైతం భారీగా దరఖాస్తులు చేసుకుంటున్నట్లు బోర్డు వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉంటే.. కొందరు అభ్యర్థులకు ఆధార్ కార్డు తదితర ప్రభుత్వ గుర్తింపు కార్డుల్లో ఒక విధంగా.. టెన్త్ మెమోలో మరోలా వివరాలు ఉండడంతో వారు ఏ వివరాలు నమోదు చేయాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి అభ్యర్థులకు బోర్డు క్లారిటీ ఇచ్చింది. అభ్యర్థులు టెన్త్ మెమోల్లోని వివరాలనే ప్రామాణికంగా తీసుకోవాలని సూచించింది. టెన్త్ మెమోల్లో ఉన్నట్లుగా వివరాలను నమోదు చేయాలని స్పష్టం చేసింది తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్.

    ఇదిలా ఉంటే.. మొత్తం మూడు దశల్లో పోలీస్ జాబ్స్ కు సంబంధించిన ఎంపిక ప్రక్రియ సాగనుంది. ఇందులో మొదటగా ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత ఫిజికల్ టెస్ట్ లు ఉంటాయి. అనంతరం తుది రాత పరీక్ష ఉంటుంది. అయితే.. దరఖాస్తుల ప్రక్రియ కూడా ముగియడానికి వస్తుండడంతో ప్రిలిమినరీ ఎగ్జామ్ నిర్వహణపై అధికారులు దృష్టి సారించారు. ఆగస్టు నెలలోనే ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన ప్రిలిమినరీ ఎగ్జామ్ నిర్వహించాలన్నది తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఆలోచనగా తెలుస్తోంది.
    TS Govt Jobs Tips: ఉద్యమంపై పట్టు ఉంటేనే ఉద్యోగం పక్కా.. ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి.. అవేంటంటే?

    అయితే ఆగస్టు 7వ తేదీన ఎస్ఐ జాబ్స్ కు సంబంధించిన ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుందని బోర్డు వర్గాల నుంచి సమాచారం. ఈ ఎగ్జామ్ ముగిసిన వెంటనే రెండు వారాల తేడాతో ఆగస్టు 21న కానిస్టేబుల్ అభ్యర్థులకు ప్రిలిమినరీ ఎగ్జామ్ నిర్వహించేందుకు బోర్డు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు తేదీలు కూడా ఆదివారం రోజే వస్తున్నాయి.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Police jobs, Telangana government jobs, Telangana police jobs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు