Home /News /jobs /

TSLPRB SI PRELIMINARY EXAM KEY RELEASED HERE IS THE DIRECT LINK TO DOWNLOAD KEY NS

TSLPRB SI Key: తెలంగాణ ఎస్ఐ అభ్యర్థులకు అలర్ట్.. రాత పరీక్ష కీ విడుదల.. కీ పీడీఎఫ్ ఇదే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణ ఎస్ఐ ప్రిలిమినరీ ఎగ్జామ్ కు సంబంధించిన కీని అధికారులు తాజాగా విడుదల చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    తెలంగాణలో ఎస్ఐ ఉద్యోగాలకు (TS SI Jobs) సంబంధించిన ప్రిలిమినరీ ఎగ్జామ్ ను ఈ నెల 7వ తేదీన నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన ప్రిలిమినరీ ఎగ్జామ్ కీని (TS SI Exam Key) అధికారులు తాజాగా విడుదల చేశారు. అభ్యర్థులు పైన అటాచ్ చేసిన పీడీఎఫ్ లను డౌన్ లోడ్ చేసుకుని తమ ఆన్సర్లతో చెక్ చేసుకోవచ్చు. ఈ పరీక్షను మొత్తం 200 మార్కులను నిర్వహించగా.. 60 మార్కులు సాధించిన వారు తర్వాత పరీక్షకు అర్హత సాధిస్తారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన వారికి ఈవెంట్స్ నిర్వహిస్తారు. ఈవెంట్స్ లోనూ అర్హత పొందిన వారికి తుది పరీక్ష ఉంటుంది. ఈ రాత పరీక్షలో సత్తా చాటిన వారికి ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగ ఎంపికలో రిజర్వేషన్ ను పాటిస్తారు. ఇదిలా ఉంటే.. తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) నిర్వహించిన ఎస్ఐ రాత పరీక్ష ఆగస్టు 7న ఆదివారం పోలీసుల బందోబస్తు మధ్య కట్టుదిట్టమైన భద్రత నడుమ ప్రశాంతంగా ముగిసింది.

    ఉదయం 10 గంటలకు ప్రారంభమైన పరీక్ష(Exam) మధ్యాహ్నం ఒంటి గంటకు ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 538 సెంటర్లలో ఈ పరీక్షను నిర్వహించారు. కోవిడ్ నియమాలు పాటిస్తూ అభ్యర్థులు పరీక్షకు(Exam) హాజరయ్యారు. నిమిషం నిబంధన అమలులో ఉండటం కారణంగా కొంతమంది పరీక్ష రాయకుండా వెనుదిరిగారు.




    మొత్తం రాష్ట్రంలో 554 ఎస్‌ఐ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా ఏకంగా 2,47,217 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిటో 2,25,759 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. మొత్తం 91.32 శాతం ఉత్తీర్ణత నమోదైంది. నల్గోండ జిల్లాలో రీజినల్ సెంటర్ నుంచి 96 శాతం మంది పరీక్షకు హాజరుకాగా.. అతి తక్కువగా మేడ్చల్ -5 రీజినల్ సెంటర్ నుంచి 75 శాతం మంది పరీక్షకు హాజరయ్యారు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: JOBS, Police jobs, Telangana government jobs, Telangana police jobs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు