తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలను ఆగస్టు నెలలో నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే కట్ ఆఫ్ మార్కుల విషయంలో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కొంత వెసులుబాటును కల్పించింది. దీంతో పరీక్ష ఫలితాలు అనేవి కాస్త ఆలస్యం అయ్యాయి. నేడు (అక్టోబర్ 21)న ఎస్సై, కానిస్టేబుల్ పరీక్ష ఫైనల్ కీని, ఫలితాలను కూడా విడుదల చేశారు. ఎస్సై అభ్యర్థులు 46.80 శాతం, కానిస్టేబుల్ సివిల్ అభ్యర్థులు 31.39 శాతం ఉత్తీర్ణత సాధించారు. ట్రాన్స్ పోర్ట్ కానిస్టేబుళ్లలో 44.84 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇంకా ఎక్సైజ్ కానిస్టేబల్ పరీక్షలో 43.65 శాతం మంది అభ్యర్థులు ఉత్తీర్ణులు అయ్యారు. మొత్తం ఎస్సై పరీక్షకు 2,25,668 మంది హాజరైతే.. దానిలో 1,05,603 మంది అర్హత సాధించారు. కానిస్టేబుల్ సివిల్ పరీక్షకు మొత్తం 5,88,891 మంది హాజరైతే.. దీనిలో మొత్తం 1,84,861 మంది ఉత్తీర్ణులయ్యారు. ట్రాన్స్ పోర్ట్ కానిస్టేబుల్ పరీక్షకు 41,835 మంది హాజరైతే.. 18,758 మంది ఉత్తీర్ణులయ్యారు.
ఎక్సైజ్ కానిస్టేబుల్ పరీక్షకు 2,50,890 మంది హాజరైతే.. 1,09,518 మంది అర్హత సాధించారు. వ్యక్తిగత లాగిన్ లోనే ఎస్సై, కానిస్టేబుల్ పరీక్షకు హాజరై ఉత్తీర్ణత సాధించిన వారి జాబితా.. ఉత్తీర్ణత సాధించని వారి జాబితాను పొందుపరిచారు. వీటితో పాటే.. ఓఎంఆర్ షీట్లను కూడా అప్ లోడ్ చేశారు. ఫైనల్ కీతో సమాధానాలను సరి చూసుకునేందుకు ఓఎంఆర్ పత్రాలను డౌన్ లోడ్ చేసుకొని చూసుకోవచ్చు.
ఎస్సై పరీక్ష అర్హత ఇలా..
ఎస్సై పరీక్షకు మొత్తం 2.25లక్షల మంది హాజరైతే అందులో 46.80 మంది ఉత్తీర్ణత సాధించారు. 200 మార్కులకు ఎస్సై పరీక్షలో 133 మార్కులు అత్యధికంగా వచ్చినట్లు తెలిపారు. బీసీ అభ్యర్థులు 42 శాతం, ఎస్సీ అభ్యర్థులు 54 శాతం, ఎస్టీ అభ్యర్థులు 59 శాతం, ఓపెన్ కేటగిరీలో 33.21 శాతం, మహిళా కేటగిరీలో 37.02 శాతం ఉత్తీర్ణులైనట్లు పేర్కొన్నారు.
కానిస్టేబుల్ పరీక్ష అర్హత ఇలా..
కానిస్టేబుల్ పరీక్షకు మొత్తం 6.03లక్షల మంది హాజరైతే అందులో 31.56 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. 200 మార్కులకు కానిస్టేబుల్ పరీక్షలో 141 మార్కులతో అత్యధికంగా వచ్చాయి. బీసీ అభ్యర్థులు 27 శాతం, ఎస్సీ అభ్యర్థులు 39 శాతం, ఎస్టీ అభ్యర్థులు 37 శాతం, ఓపెన్ కేటగిరీలో 24.43 శాతం, మహిళా కేటగిరీలో 28.35 శాతం ఉత్తీర్ణులైనట్లు పేర్కొన్నారు.
27 అక్టోబర్ 2022 నుంచి 10 నవంబర్ 2022 మధ్య పార్ట్ 2 అప్లికేషన్ చేసుకోవాలని తెలంగాణ పోలీస్ నియామక మండలి అర్హత సాధించిన అభ్యర్థులకు సూచించింది.
ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి..
-ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
-వెబ్ సైట్ టాప్ రైట్ కార్నరల్ లో ఉన్న లాగిన్ ఆప్షన్ ను ఎంచుకోండి
-అక్కడ మీ మొబైల్ నంబర్, పాస్ వర్డ్ ను ఇవ్వండి.
-మీ డ్యాష్ బోర్డులో ఎస్సై , కానిస్టుబుల్ పరీక్ష లో మీరు అర్హత సాధించారా లేదా అనే వివరాలను సరి చూసుకోండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Exam results, JOBS, Tslprb