హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

TSLPRB Constable Hall Ticket Download: తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్.. హాల్ టికెట్ డౌన్ లోడ్ కు మరో 5 రోజులే ఛాన్స్.. ఇలా డౌన్ లోడ్ చేసుకోండి

TSLPRB Constable Hall Ticket Download: తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్.. హాల్ టికెట్ డౌన్ లోడ్ కు మరో 5 రోజులే ఛాన్స్.. ఇలా డౌన్ లోడ్ చేసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన ప్రిలిమినరీ ఎగ్జామ్ ఈ నెల 28న నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఈ నెల 26 లాస్ట్ డేట్.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  పోలీసుశాఖలో 15,644, రవాణాశాఖలో 63, ఆబ్కారీశాఖలో 614 కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నియామకాలకు సంబంధించిన ప్రిలిమినరీ ఎగ్జామ్ ను ఈ నెల 28వ తేదీన నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన హాల్ టికెట్లను (Telangana Constable Jobs Hall Tickets) అధికారులు ఈ రోజు విడుదల చేశారు. అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాలని తెలంగాణ పోలీసు నియామక మండలి చైర్మన్ వీ.శ్రీనివాసరావు తెలిపారు. అభ్యర్థులు 26వ తేదీ అర్థరాత్రి 12 గంటల వరకు తమ హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు. హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకోవడంలో ఏమైనా ఇబ్బందులు ఏర్పడితే support@tslprb.in కు ఈమెయిల్‌ ద్వారా లేదా 9393711110, 9391005006 నెంబర్లను సంప్రదించాలని సూచించారు.

  ఈ పరీక్షకు మొత్తం 6,61,196 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అభ్యర్థులు భారీగా దరఖాస్తు చేసుకోవడంతో ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఇందు కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1,601 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పరీక్షను ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించనున్నారు.

  TS Police Jobs: ఈ నెల 28న తెలంగాణ కానిస్టేబుల్ రాత పరీక్ష.. అభ్యర్థులు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివే.. ఓ లుక్కేయండి

  హాల్ టికెట్ డౌన్ లోడ్ చేయడం ఇలా..

  Step 1: అభ్యర్థులు మొటగా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ అధికారిక వెబ్ సైట్ https://www.tslprb.in/ ను ఓపెన్ చేయాలి.

  Step 2: అనంతరం హోం పేజీపై Download Hall Tickets లింక్ కనిపిస్తుంది. ఆ లింక్ పై క్లిక్ చేయాలి.

  Indian Army Recruitment For Females: పది అర్హతతో.. ఇండియన్ ఆర్మీలో మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం..

  Step 3: తర్వాత మీ వివరాలను నమోదు చేసి సబ్మిట్ చేయాలి.

  Step 4: హోం స్క్రీన్ పై మీ హాల్ టికెట్ డిస్ప్లే అవుతుంది. ప్రింట్ తీసుకుని భద్రపరుచుకోవాలి.

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: JOBS, Police jobs, Telangana police jobs

  ఉత్తమ కథలు