Police Jobs : పోలీస్ ఈవెంట్స్ రిజల్ట్స్ రిలీజ్.. త్వరలోనే మెయిన్స్ ఎగ్జామ్..

తెలంగాణ పోలీస్ ఈవెంట్స్ రిజల్ట్స్‌ని విడుదల చేసింది టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ. ఈవెంట్స్‌లో మొత్తం 1,17,660మంది అర్హత సాధించినట్లుగా అధికారులు తెలిపారు.

news18-telugu
Updated: April 9, 2019, 12:18 PM IST
Police Jobs : పోలీస్ ఈవెంట్స్ రిజల్ట్స్ రిలీజ్.. త్వరలోనే మెయిన్స్ ఎగ్జామ్..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: April 9, 2019, 12:18 PM IST
పోలీస్ నియామకాలకు సంబంధించి ఇటీవలే నిర్వహించిన ఫిజికల్ ఈవెంట్స్ రిజల్ట్స్ రిలీజ్ అయ్యాయి. 18,428 పోస్టుల కోసం నిర్వహించిన ఈ ఈవెంట్స్‌లో మొత్తం 1,17,660మంది అర్హత సాధించారు. వీరికి త్వరలోనే మెయిన్ ఎగ్జామ్‌ని కండక్ట్ చేయనున్నారు. పోలీసు, స్పెషల్ ఫోర్స్, ఫైర్, డ్రైవర్, మెకానిక్ ఇలా వివిధ విభాగాల్లోని ఉద్యోగాల కోసం ఫిబ్రవరి 11 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 11 కేంద్రాల్లో ఈవెంట్స్ జరిగాయి.
మొత్తం ఈవెంట్స్‌లో 89,634మంది పురుషులు, 28,026మంది మహిళా అభ్యర్థులు అర్హత సాధించారు. ఇక మొత్తం అభ్యర్థుల్లో 81,611 మంది బీసీలు కాగా, 41,151 మంది ఎస్టీలు, 38,485మంది ఎస్సీలు, 10,006మంది ఓసీలు అర్హత సాధించారు. ఇక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం గతంలోకంటే ఈ సారి ఎక్కువమంది ఈవెంట్స్ క్వాలీఫై అయ్యారని.. గతంలో 50.80శాతం అర్హత సాధించగా 62.15 శాతం అర్హత సాధించారు. ఇక కానిస్టేబు‌ల్‌కి క్వాలిఫై అయినవారు 50.90శాతంగా ఉందన్నారు. ఈ వివరాలన్నీ టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ అఫీషియల్ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.

ఇవి కూడా చదవండి..

Career : 8వ తరగతి చదివితే చాలు.. కోర్సులో జాయిన్ చేసుకుని జాబ్ ఇస్తారు..

First published: April 9, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...