TSLPRB RECRUITMENT 2022 TELANGANA STATE LEVEL POLICE RECRUITMENT BOARD INVITES APPLICATIONS FOR 17291 CONSTABLE SI JOBS APPLICATION PROCESS ENDS TODAY SS
TSLPRB Recruitment 2022 | తెలంగాణలో పోలీసు ఉద్యోగాలు (Telangana Police Jobs) కోరుకునేవారికి ఇదే లాస్ట్ ఛాన్స్. 17,291 కానిస్టేబుల్, ఎస్సై పోస్టులకు అప్లై చేయడానికి ఇంకొన్ని గంటలే అవకాశం ఉంది. దరఖాస్తు ప్రక్రియ ఈరోజే ముగుస్తుంది. అప్లై చేయాలనుకునేవారికి ఇంకొన్ని గంటల సమయం మాత్రమే ఉంది.
తెలంగాణలోని నిరుద్యోగులకు అలర్ట్. తెలంగాణ ప్రభుత్వం 80,039 పోస్టుల్ని భర్తీ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో 17,291 పోస్టుల భర్తీకి తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) ఆరు నోటిఫికేషన్లు జారీ చేసింది. ఈ నోటిఫికేషన్లకు అప్లై చేయడానికి 2022 మే 20 చివరి తేదీ. రాత్రి 10 గంటల్లోగా అభ్యర్థులు అప్లై చేయాలి. ఈ ఆరు నోటిఫికేషన్ల ద్వారా 17,291 ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల్ని (SI Constable Jobs) భర్తీ చేస్తోంది. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. ఫిజికల్ ఫిట్నెస్ స్టాండర్డ్స్ కూడా వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి అభ్యర్థులు అప్లై చేసేముందు నోటిఫికేషన్స్ పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి. మరి ఏ నోటిఫికేషన్ ద్వారా ఎన్ని ఖాళీలు భర్తీ చేస్తున్నారో తెలుసుకోండి.
మొత్తం ఖాళీలు- 15,644
స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ (SCT) పోలీస్ కానిస్టేబుల్ (Civil)- 4965
స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ (SCT) పోలీస్ కానిస్టేబుల్ (AR)- 4423
స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ (SCT) పోలీస్ కానిస్టేబుల్ (SAR CPL) (Men) - 100
స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ (SCT) పోలీస్ కానిస్టేబుల్ (TSSP) (Men) - 5010
కానిస్టేబుల్ ఇన్ తెలంగాణ స్పెషల్ పోలీస్ ఫోర్స్ డిపార్ట్మెంట్- 390
ఫైర్మెన్ ఇన్ తెలంగాణ స్పెషల్ పోలీస్ ఫోర్స్ డిపార్ట్మెంట్- 610
వార్డర్స్ (Male) ఇన్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్- 136
వార్డర్స్ (Female) ఇన్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్- 10
స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ ఎస్ఐ సివిల్ పోస్టుల వివరాలివే...
మొత్తం ఖాళీలు- 554
స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ (SCT) సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (Civil)- 414
స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ (SCT) రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (AR)- 66
స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ (SCT) రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (SAR CPL) (Men)- 05
స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ (SCT) రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (TSSP) (Men)- 23
సబ్ ఇన్స్పెక్టర్ (Men) ఇన్ తెలంగాణ స్టేట్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డిపార్ట్మెంట్- 12
స్టేషన్ ఫైర్ ఆఫీసర్ ఇన్ తెలంగాణ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్- 26
డిప్యూటీ జైలర్ ఇన్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్- 8
మొత్తం ఖాళీలు- 33
స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ (SCT) సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (Information Technology & Communications Organization)- 22
స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ (SCT) సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (Police Transport Organization)- 03
స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ (SCT) అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్- 8
స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ ఎస్ఐ ఐటీ, సీఓ, మెకానిక్, డ్రైవర్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఈ ఆరు నోటిఫికేషన్ల ద్వారా మొత్తం 17,291 పోస్టులు భర్తీ కానున్నాయి. అభ్యర్థులకు అప్లై చేయడానికి రాత్రి 10 గంటల వరకే అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులు గడువులోగా అప్లై చేయాలి. పూర్తి వివరాలను తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ అధికారిక వెబ్సైట్ https://www.tslprb.in/ లో తెలుసుకోవచ్చు. ప్రిలిమినరీ రాతపరీక్ష, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్, ఫైనల్ రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.