హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Telangana Jobs: ఖాళీల భర్తీకి తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ నోటిఫికేషన్

Telangana Jobs: ఖాళీల భర్తీకి తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ నోటిఫికేషన్

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Telangana Jobs | తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త. పలు ఖాళీల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. పూర్తి వివరాలు తెలుసుకోండి.

తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్- TSLPRB ఉద్యోగా భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 151 ఖాళీలు ఉన్నాయి. తెలంగాణ స్టేట్ ప్రాసిక్యూషన్ డిపార్ట్‌మెంట్‌లో ఈ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 2021 ఆగస్ట్ 11న ప్రారంభం కానుంది. అప్లై చేయడానికి 2021 ఆగస్ట్ 29 చివరి తేదీ. ఈ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్- TSLPRB అధికారిక వెబ్‌సైట్ https://www.tslprb.in/ లో విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఈ వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ చూడొచ్చు. దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. ఇతర పద్ధతుల ద్వారా దరఖాస్తులు పంపిస్తే స్వీకరించరు. అభ్యర్థులు ఒక దరఖాస్తు మాత్రమే చేయాలి. ఒకటి కన్నా ఎక్కువ దరఖాస్తులు సబ్మిట్ చేస్తే దరఖాస్తులన్నీ రిజెక్ట్ అవుతాయి.

Railway Jobs: రైల్వే జాబ్ అలర్ట్... మరో నోటిఫికేషన్ వచ్చేసింది... రూ.92,300 వరకు వేతనం

Railway Jobs: రైల్వేలో 1664 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల... ఖాళీల వివరాలు ఇవే

TSLPRB Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


భర్తీ చేసే పోస్టులు- అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్

మొత్తం ఖాళీలు- 151

దరఖాస్తు ప్రారంభం- 2021 ఆగస్ట్ 11 ఉదయం 8 గంటలు

దరఖాస్తుకు చివరి తేదీ- 2021 ఆగస్ట్ 29 రాత్రి 12 గంటలు

వేతనం- రూ.54,220 బేసిక్ వేతనంతో మొత్తం రూ.1,33,630 వేతనం లభిస్తుంది.

విద్యార్హతలు- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ లా పాస్ కావాలి. ఎల్ఎల్‌బీ, బీఎల్ పాస్ అయినవారు దరఖాస్తు చేయొచ్చు. ఇంటర్మీడియట్ తర్వాత ఐదేళ్ల లా కోర్సు పాస్ అయినవారు కూడా అప్లై చేయొచ్చు.

వయస్సు- 2021 జూలై 1 నాటికి 34 ఏళ్లు

అనుభవం- క్రిమినల్ కోర్టుల్లో అడ్వకేట్‌గా కనీసం మూడేళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి.

ఫీజు- రూ.1,500. ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులు రూ.750 చెల్లించాలి.

IT Jobs 2021: ఐటీ కంపెనీల్లో ఫ్రెషర్స్‌కి 1,20,000 ఉద్యోగాలు

TCS National Qualifier Test: ఈ ఎగ్జామ్ రాయండి... కార్పొరేట్ కంపెనీలో జాబ్‌కి ట్రై చేయండి

TSLPRB Recruitment 2021: అప్లై చేయండి ఇలా


అభ్యర్థులు ముందుగా https://www.tslprb.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ లింక్ పైన క్లిక్ చేయాలి.

అభ్యర్థి పేరు, పుట్టిన తేదీ, విద్యార్హతలు, ఇతర వివరాలు ఎంటర్ చేయాలి.

ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయాలి.

ఎస్ఎస్‌సీ సర్టిఫికెట్, విద్యార్హతల సర్టిఫికెట్ అప్‌లోడ్ చేయాలి.

వీటితో పాటు అడ్వకేట్‌గా తెలంగాణ బార్ కౌన్సిల్ లేదా ఇతర రాష్ట్రాల బార్ కౌన్సిల్‌ జారీ చేసిన సర్టిఫికెట్ అఫ్‌లోడ్ చేయాలి.

మూడేళ్లుగా క్రిమినల్ కోర్టుల్లో ప్రాక్టీస్ చేస్తున్నట్టుగా సర్టిఫికెట్ అప్‌లోడ్ చేయాలి.

ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు చదివిన స్టడీ, బోనఫైడ్ సర్టిఫికెట్లు, క్యాస్ట్ సర్టిఫికెట్, ఇతర సర్టిఫికెట్స్ అప్‌లోడ్ చేయాలి.

ఆ తర్వాత ఫీజు చెల్లించి దరఖాస్తు ఫామ్ సబ్మిట్ చేయాలి.

అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.

First published:

Tags: Andhra Pradesh Government Jobs, CAREER, Exams, Government jobs, Govt Jobs 2021, Job notification, JOBS, NOTIFICATION, Telangana, Telangana government jobs, Telangana jobs, Telangana News, Telangana updates, Telugu news, Telugu updates, Telugu varthalu, Tspsc jobs, Upcoming jobs

ఉత్తమ కథలు