తెలంగాణలో పోలీస్ ఉద్యోగాలకు (Telangana Police Jobs) సంబంధించిన ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధిచిన ఈవెంట్స్ పై తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) తాజాగా కీలక ప్రకటన విడుదల చేసింది. నిన్నటితో ఫిజికల్ ఈవెంట్స్ ముగిసినట్లు ప్రకటించింది. డిసెంబర్ 8 నుంచి నిన్నటి వరకు రాష్ట్రంలో 12 సెంటర్లలో ఈవెంట్స్ నిర్వహించినట్లు తెలిపింది. 2 లక్షల 7 వేల 106 మంది అభ్యర్ధులు ఈవెంట్స్ కి హాజరు కాగా.. 111209 అర్హత సాధించినట్లు తెలిపింది. మొత్తం 53.7 శాతం అభ్యర్థులు క్వాలిఫై అయినట్లు వెల్లడించింది. 2018-19 నోటిఫికేషన్ లో 48.5 శాతం అభ్యర్థులు ఫిజికల్ ఈవెంట్స్ లో క్వాలిఫై కాగా.. ఈసారి 53.7 శాతం క్వాలిఫై అయ్యారని తెలిపింది.
ఈవెంట్స్ మొత్తం ప్రక్రియను సీసీ కెమెరాల్లో రికార్డ్ చేసినట్లు తెలిపింది. లాంగ్ జంప్ లో నిబంధనల కారణంగా అనేక మంది అనర్హత సాధించినట్లు వస్తున్న వార్తలపై సైతం బోర్డు స్పందించింది. లాంగ్ జంప్, షాట్ ఫుట్ ఈవెంట్స్ కు ఒక్కొక్కరికి మూడుసార్లు ఛాన్స్ ఇచ్చినట్లు తెలిపింది. లాంగ్ జంప్ లో 83శాతం పురుషులు, 80 శాతం మహిళా అభ్యర్ధులు క్వాలిఫై అయ్యారని బోర్డు ప్రకటనలో పేర్కొంది. షాట్ పుట్ లో 91 పురుషులు, 96 శాతం మహిళా అభ్యర్ధులు క్వాలిపై అయ్యారని వివరించింది.
ఇదిలా ఉంటే.. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పోలీస్ అభ్యర్థులు వరుస ఆందోళనలకు పిలుపునిచ్చారు. ప్రిలిమ్స్ రాత పరీక్షలో తప్పుగా వచ్చిన 7 ప్రశ్నలకు మార్కులు కలపాలని కొందరు.. ఈవెంట్స్ లో లోపాల కారణంగా అనర్హత సాధించామని మరికొందరు ఆందోళన చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ‘ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల సమస్యల పరిష్కార పోరాట సమితి’ పేరిట ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు డిసెంబర్ 6న సమితి ఆధ్వర్యంలో దున్నపోతులకు వినతిపత్రాలు అందించే కార్యక్రమాన్ని చేపట్టారు. రేపు కలెక్టరేట్ల ఎదురుగా ఆందోళన చేపట్టనున్నారు. 9న ఛలో హైదరాబాద్ నిర్వహించి ప్రగతి భవన్ ను ముట్టడిస్తామని ప్రకటించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: JOBS, Telangana police jobs, Tslprb