హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

TSLPRB Update: ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్.. పార్ట్ 2 అప్లికేషన్స్, ఈవెంట్స్ పై తాజా ప్రకటన..

TSLPRB Update: ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్.. పార్ట్ 2 అప్లికేషన్స్, ఈవెంట్స్ పై తాజా ప్రకటన..

TSLPRB Update: ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్.. పార్ట్ 2 అప్లికేషన్స్, ఈవెంట్స్ పై తాజా ప్రకటన..

TSLPRB Update: ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్.. పార్ట్ 2 అప్లికేషన్స్, ఈవెంట్స్ పై తాజా ప్రకటన..

తెలంగాణలో ఎస్‌ఐ, కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల నుంచి పార్ట్ 2 అప్లికేషన్లను తెలంగాణ పోలీస్ నియామక మండలి (టీఎస్ఎల్పీఆర్బీ) స్వీకరించిన విషయం తెలిసిందే.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

తెలంగాణలో ఎస్‌ఐ, కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల నుంచి పార్ట్ 2 అప్లికేషన్లను తెలంగాణ పోలీస్ నియామక మండలి (టీఎస్ఎల్పీఆర్బీ) స్వీకరించిన విషయం తెలిసిందే. ఫిజికల్ మెజర్ మెంట్ టెస్ట్ (PMT)/ ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET) పరీక్షకు సంబంధించిన 'పార్ట్-2' ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ అనేది అక్టోబరు 27న ఉదయం 8 గంటల నుంచే ప్రారంభం అయి.. నవంబరు 10న రాత్రి 10 గంటలకు ముగిసింది. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన పోలీస్ అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://www.tslprb.in/ ద్వారా అభ్యర్థులు తమ వ్యక్తిగత లాగిన్ ఐడీ, పాస్ వర్డ్ వివరాలను నమోదు చేసి.. పార్ట్ 2 అప్లికేషన్ చేసుకున్నారు. దీనిలో అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేసుకున్నారు.

అయితే వీటిపై పోలీస్ నియామక మండలి బోర్డు ఓ ప్రకటన విడుదల చేసింది. పార్ట్ 2 అప్లికేషన్లు మొత్తం 2,37, 862 వచ్చాయిని.. దీనిలో పురుషులు 1,91,363,  మహిళలు 46,499 మంది దరఖాస్తు  చేసుకున్నట్లు తెలిపారు. అయితే..  తాము పార్ట్ 2 అప్లికేషన్లో తప్పుడు చేశామని.. తమకు ఎడిట్ అవకాశం కల్పించాలని కొంత మంది అభ్యర్థులు మెయిల్స్ చేయడం, బోర్డును ఆశ్రయించడం జరుగుతుంది. ఇలాంటి వారికి పార్ట్ 2 ఎడిట్ కు అవకాశం కల్పిస్తామని.. ప్రకటనలో పేర్కొంది. పీఎంటీ, పీఈటీ కంటే ముందే అభ్యర్థులకు ఎడిట్ కు అవకాశం కల్పిస్తామని తెలిపారు.

AP Jobs 2022: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఆ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..

ఇక పార్ట్ 2 కి దరఖాస్తు చేసుకున్న వారిలో ఎస్సై సివిల్ పోస్టులకు 1.01 లక్షలు, కానిస్టేబుల్ పోస్టులకు 1.76 లక్షలు, ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులకు 1.06లక్షలు, ట్రాన్స్ పోర్ట్ కానిస్టేబుల్ పోస్టులకు 17,176 మంది దరఖాస్తులు సమర్పించారు. ఇలా మొత్తం నాన్ టెక్నికల్ పోస్టులు కాకుండా.. 4లక్షల దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు. అంటే 96 శాతం మంది దరఖాస్తులు చేసుకున్నారు.

టెక్నికల్ పోస్టులతో కలుపుకుంటే మొత్తం 4,63,970 దరఖాస్తులు వచ్చినట్లు ప్రకటనలో వెల్లడించారు. 91 శాతం మంది పార్ట్ 2 అప్లికేషన్స్ చేసుకున్నట్లు తెలిపారు.

ఈవెంట్స్ సంబంధించి వివరాలను కూడా వెల్లడించారు. మొత్తం రాష్ట్రంలో 12 గ్రౌండ్స్ ను పీఎంటీ, పీఈటీ ల కొరకు ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. మరో రెండు కొత్త గ్రౌండ్స్ ను కూడా కేటాయించే పనిలో ఉన్నట్లు పేర్కొన్నారు. 25 రోజుల్లో ఈ ప్రక్రియను అంతా పూర్తి చేయనున్నట్లు తెలిపారు. అత్యంత తొందర్లోనే ఈవెంట్స్ కు సంబంధించిన అడ్మిట్ కార్డులను వెబ్ సైట్లో అందుబాటులో ఉంచుతామని ప్రకటనలో తెలిపారు.

UIDAI Recruitment 2022: నిరుద్యోగులకు శుభవార్త.. యూఐడీఏఐలోజాబ్స్ .. ఖాళీలు, విద్యార్హతల వివరాలివే

ఇదిలా ఉండగా.. ఎస్సై, కానిస్టేబుల్ పరీక్ష ఫలితాల్లో.. మొత్తం ఎస్సై పరీక్షకు 2,25,668 మంది హాజరైతే.. దానిలో 1,05,603 మంది అర్హత సాధించారు. కానిస్టేబుల్ సివిల్ పరీక్షకు మొత్తం 5,88,891 మంది హాజరైతే.. దీనిలో మొత్తం 1,84,861 మంది ఉత్తీర్ణులయ్యారు. ట్రాన్స్ పోర్ట్ కానిస్టేబుల్ పరీక్షకు 41,835 మంది హాజరైతే.. 18,758 మంది ఉత్తీర్ణులయ్యారు. ఎక్సైజ్ కానిస్టేబుల్ పరీక్షకు 2,50,890 మంది హాజరైతే.. 1,09,518 మంది అర్హత సాధించారు.

First published:

Tags: JOBS, Police, Tslprb

ఉత్తమ కథలు