హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Telangana Police Jobs: తెలంగాణ పోలీస్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. వారికి మళ్లీ ఈవెంట్స్.. బోర్డ్ కీలక ప్రకటన

Telangana Police Jobs: తెలంగాణ పోలీస్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. వారికి మళ్లీ ఈవెంట్స్.. బోర్డ్ కీలక ప్రకటన

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

హై కోర్టు ఆదేశాల మేరకు 1 సెం.మీ లేదా అంతకన్నా తక్కువ కలిగి ఉన్నారన్న కారణంతో డిస్ క్వాలిఫై అయిన వారికి మళ్లీ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ తెలిపింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Warangal

తెలంగాణలో పోలీస్ ఉద్యోగాలకు (Telangana Police Jobs) సంబంధించి ఇటీవల నిర్వహించిన ఈవెంట్స్ లో అనర్హత సాధించిన వారికి గుడ్ న్యూస్. హై కోర్టు ఆదేశాల మేరకు 1 సెం.మీ లేదా అంతకన్నా తక్కువ కలిగి ఉన్నారన్న కారణంతో డిస్ క్వాలిఫై అయిన వారికి మళ్లీ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) తెలిపింది. ఈ కారణంతో అనర్హతకు గురైన వారు ఈ నెల 10వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 12వ తేదీ సాయంత్రం 8 గంటల వరకు అధికారిక వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవాలని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ వెల్లడించింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు హైదరాబాద్ లోని అంబర్ పేట పోలీస్ గ్రౌండ్స్, కొండాపూర్ 8వ బెటాలియన్లో ఈ ఈవెంట్స్ నిర్వహించనున్నట్లు తెలిపింది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్.

ఇదిలా ఉంటే.. తెలంగాణలో ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలో(Preliminary Exam) మల్టిపుల్ ఆన్సర్స్ ప్రశ్నలకు మార్కులు కలపాలని పోలీస్ అభ్యర్థులు కోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. దీంతో ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు మార్కులు కలపాలని కోర్టు ఆర్డర్ ఇచ్చింది. దీని ప్రకారం వాటిని కలుపుతూ.. దీని ద్వారా ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థుల జాబితాను వెబ్ సైట్లో(Website) పొందుపరచనున్నట్లు పోలీస్ నియామక బోర్డు వెబ్ నోట్(Web Note) విడుదల చేసింది. వీటిని వారి వ్యక్తిగత లాగిన్ తో(Login) తెలుసుకోవాలని సూచించింది. జనవరి 30, 2023 వరకు అందుబాటులో ఉంచుతామని నోటీస్ లో పేర్కొంది.

Railway Jobs 2023: నిరుద్యోగులకు అలర్ట్.. టెన్త్ అర్హతతో 7,914 రైల్వే జాబ్స్ .. దరఖాస్తుకు ఎల్లుండి వరకే ఛాన్స్

అర్హత సాధించిన అభ్యర్థులు పార్ట్ 2 అప్లికేషన్ చేసుకోవాలని తెలిపింది.  ఇది వరకు నిర్వహించిన పీఈటీ, పీఎంటీ పరీక్షలో అర్హత సాధించిన వారు మరో సారి పార్ట్ 2 దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది. అంతే కాకుండా.. పీసీ/ఎస్సై లో ఏదో ఒకటి అర్హత సాధించి.. ఇప్పుడు పీసీ/ఎస్సైలో అర్హత సాధించిన వారు పార్ట్ 2 చేసుకోవాలని తెలిపింది. వీరికి మళ్లీ.. ఈవెంట్స్ నిర్వహించమని పేర్కొంది.

First published:

Tags: JOBS, Police jobs, Telangana government jobs

ఉత్తమ కథలు