తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ ప్రాథమిక కీని విడుదల చేశారు. దీని కోసం అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించించవచ్చు. ఇక్కడ క్లిక్ చేసి అభ్యర్థులు కీ పేపర్ ను చూసుకోవచ్చు. పోలీసుశాఖలో 15,644, రవాణాశాఖలో 63, ఆబ్కారీశాఖలో 614 కానిస్టేబుల్ ఉద్యోగాలకు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) నోటిఫికేషన్(Notification) విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నియామకాలకు సంబంధించిన ప్రిలిమినరీ ఎగ్జామ్ ను ఈ నెల 28వ తేదీన నిర్వహించారు.
ఉదయం 10 గంటలకు ప్రారంభం అయిన ఈ పరీక్ష మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగింది. కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 6,61,196 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 6,03,955 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు.
అయితే తాజాగా ఈ పరీక్షకు సంబంధించి ప్రాథమిక కీని పోలీస్ నియామక మండలి విడుదల చేసింది. కీ కొరకు డైరెక్ట్ గా ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. వీటిలో ఏమైనా అబ్జెక్షన్స్ పెట్టుకోవాలనుకునే అభ్యర్థులు రేపు అంటే ఆగస్టు 31 ఉదయం 8 గంటల నుంచి సెప్టెంబర్ 2 సాయంత్రం 5 గంటలకు వరకు అబ్జెక్షన్స్ ఇచ్చుకోవచ్చని నియామక మండలి వెబ్ సైట్లో పేర్కొన్నారు.
ఇక కీలో మొత్తం 5 ప్రశ్నలలో తప్పులు దొర్లినట్లు పేర్కొన్నారు. పేపర్ సెట్ బీ లో 51వ ప్రశ్న, 57వ ప్రశ్న, 120వ ప్రశ్న, 136వ ప్రశ్న, 186వ ప్రశ్నలకు మార్కులు యాడ్ కానున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, JOBS, Ts constable