తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) తాజాగా కీలక ప్రకటన చేసింది. కానిస్టేబుల్ ఉద్యోగ నియామకాలకు (TS Constable Jobs) సంబంధించిన ప్రిలిమినరీ పరీక్షలో 22 ప్రశ్నలకు మార్కులు కలపాలంటూ కొందరు అభ్యర్థులు చేస్తున్న ఆందోళనపై స్పందించింది. అభ్యర్థులు చేస్తున్న ఈ వాదనలో వాస్తవం లేదని బోర్డు స్పష్టం చేసింది. కొందరు ఇతర దురుద్దేశాలతో ఇలాంటి డిమాండ్, ప్రచారం చేస్తున్నాని బోర్డు తెలిపింది. మరికొందరు అభ్యర్థులు ఎలాంటి ప్రామాణికత లేని పుస్తకాలను, స్టడీ మెటీరియల్ ఆధారంగా ఇలాంటి డిమాండ్లను వ్యక్తం చేస్తున్నారని బోర్డు తెలిపింది. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించని అభ్యర్థుల్లో తమ ఫలితాలను మరో సారి తనిఖీ చేయాలని కోరుతున్నట్లు బోర్డు తెలిపింది. ఓఎమ్ఆర్ షీట్లను OMR / ICR స్కాన్ తో వాల్యుయేషన్ చేసినట్లు చెప్పారు. ఇంకా.. అనుమానాస్పదంగా అనిపించిన బబుల్‌లను ఎక్స్పర్ట్స్ పరిశీలించారన్నారు.
అభ్యర్ధుల నుంచి వచ్చిన అభ్యర్ధనల ఆధారంగా 400పైగా ఓఎమ్ఆర్ షీట్లను మళ్లీ పరిశీలించగా.. ఒక్క తప్పు కూడా కనిపించలేదని బోర్డు స్పష్టం చేసింది. దీంతో బోర్డు ప్రకటించిన ఫలితాల్లో ఎలాంటి మిస్టేక్స్ లేవన్న విషయాన్ని అభ్యర్థులు గమనించాలని TSLPRB తెలిపింది. ఇదాలా ఉంటే పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన పార్ట్-2 దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 28వ తేదీన ప్రారంభమైందని బోర్డు తెలిపింది.
Jobs In NFDB: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. తెలంగాణలో మరో జాబ్ నోటిఫికేషన్ విడుదల..
ఇప్పటికే దాదాపు 40 వేల మంది దరఖాస్తు చేసుకున్నట్లు బోర్డు తెలిపింది. ఇందులో 31 వేల మంది పురుషులు, 9 వేల మంది స్త్రీలు ఉన్నారని వెల్లడించింది. ప్రిలిమ్స్ లో అర్హత సాధించిన అభ్యర్థులు పార్ట్-2 దరఖాస్తులను నవంబర్ 10వ తేదీ రాత్రి పది గంటలలోగా సమర్పించాలని బోర్డు సూచించింది. అభ్యర్థులు ఆఖరి నిమిషం వరకు వేచి చూడకుండా సాధ్యమైనంత ముందుగానే తమ దరఖాస్తులను సమర్పించాలని బోర్డు సూచించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: JOBS, Telangana government jobs, Telangana police jobs