రాష్ట్రవ్యాప్తంగా ఎస్సై ప్రిలిమినరీ రాత పరీక్ష(Preliminary Written Test) ప్రశాంతంగా ముగిసింది. ఎస్సై ప్రాథమిక పరీక్షకు హైదరాబాద్ (Hyderabad) సహా 20 పట్టణాల్లో పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 554 ఎస్సై పోస్టులకు నోటిఫికేషన్(Notification) ఇవ్వగా ఏకంగా 2,47,217 దరఖాస్తులు రాగా.. పరీక్షకు 91.32 శాతం మంది హాజరైనట్లు రిక్రూట్ మెంట్ బోర్డ్ తెలిపింది. మొత్తం 2లక్షల25వేల759 మంది పరీక్ష రాసినట్లు వెల్లడించింది. ప్రిలిమినరీ పరీక్ష కీ ని త్వరలో www.tslprb.in వెబ్ సైట్ లో ఉంచుతామని రిక్రూట్ మెంట్ బోర్డ్ వెల్లడించింది. హైదరాబాద్ సహా పరిసర ప్రాంతాల్లో 503 పరీక్ష కేంద్రాలు, మిగిలిన జిల్లాల్లో 35 పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు పరీక్ష రాశారు. ఈ పరీక్షలో తప్పుడు సమాధానాలకు నెగెటివ్ మార్కులుండటం కీలకంగా మారింది.
ఐదు తప్పుడు సమాధానాలు రాస్తే ఒక మార్కు కోత విధించనున్నారు. ఎస్సై మెయిన్స్ లో మాత్రం నెగెటివ్ మార్కులు ఉండవని పేర్కొన్నారు. ఇక.. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ, మాస్ కాపీయింగ్ లాంటి ఘటనలు చోటు చేసుకోలేదని పోలీసులు తెలిపారు. అభ్యర్థులను బయోమెట్రిక్ ఆధారంగానే అనుమతిచ్చామన్నారు. ఎవరైనా ఎస్సై కొలువుకు సంబంధించి డబ్బులను ఆశచూపితే నమ్మవద్దని.. అలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలిన అభ్యర్థులకు పోలీసులు సూచించారు. ఇలా ఎవరైనా డబ్బులను అడిగితే తమ దృష్టికి తీసుకురావాలన్నారు.
ఇదిలా ఉండగా.. అభ్యర్థులు ప్రస్తుతం కానిస్టేబుల్ పరీక్ష కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నెల 21 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్న విషయం తెలిసిందే. కానిస్టేబుల్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల సంఖ్య ఎస్సై పరీక్షకు హాజరైన వాటి కంటే కూడా ఎక్కువగా ఉంది. మొత్తం 17,281 పోస్టుల్లో 16,694 కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి. ఎక్కువగా ఇవే ఉండటంతో దరఖాస్తులు పోటా పోటీగా వచ్చాయి. మొత్తం దరఖాస్తుల్లో .. ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలకు 3.55 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుల్లో 2.76 లక్షల మంది మహిళలు ఉన్నారు.
ఎస్ఐ ఉద్యోగాలకు 2.47 లక్షలు, కానిస్టేబుల్ ఉద్యోగాలకు 9.5 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో అత్యధికంగా హైదరాబాద్, రంగారెడ్డి నుంచే దరఖాస్తులు వచ్చాయి. అయితే కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించి హాల్ టికెట్స్ విడుదల తేదీని బోర్డు అధికారులు వెల్లడించారు. ఈ నెల 10(ఆగస్టు 10) నుంచి హాల్ టికెట్లు www.tslprb.in వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచుతామని బోర్డు అధికారులు పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, JOBS, Sub inspector, Ts constable, Tslprb