TSLPRB Admit Card: కానిస్టేబుల్ అభ్యర్థులకు డ్రైవింగ్, మెకానిక్ ట్రేడ్ పరీక్షల తేదీలివే...

TSLPRB Admit Card | డ్రైవింగ్, మెకానిక్ ట్రేడ్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఏప్రిల్ 27 ఉదయం 8 గంటల నుంచి నుంచి 30 వరకు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

news18-telugu
Updated: April 25, 2019, 1:01 PM IST
TSLPRB Admit Card: కానిస్టేబుల్ అభ్యర్థులకు డ్రైవింగ్, మెకానిక్ ట్రేడ్ పరీక్షల తేదీలివే...
TSLPRB Admit Card: కానిస్టేబుల్ అభ్యర్థులకు డ్రైవింగ్, మెకానిక్ ట్రేడ్ పరీక్షల తేదీలివే... (image: TSLPRB)
news18-telugu
Updated: April 25, 2019, 1:01 PM IST
తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్-TSLPRB నిర్వహిస్తున్న నియామక పరీక్షల్లో భాగంగా మే 2 నుంచి 10 వరకు డ్రైవింగ్ టెస్ట్, మే 9 నుంచి 10 వరకు మెకానిక్ ట్రేడ్ టెస్ట్ నిర్వహిస్తున్నట్టు TSLPRB ప్రకటించింది. ఫిజికల్ ఎఫీషియెన్స్ టెస్ట్ పాసైన ఎస్‌సీటీ పోలీస్ కానిస్టేబుల్(మెకానిక్స్-పురుషులు) అభ్యర్థులకు ట్రేడ్ టెస్ట్ నిర్వహించనున్నారు. ఫిజికల్ ఎఫీషియెన్స్ టెస్ట్ పాసైన ఎస్‌సీటీ పోలీస్ కానిస్టేబుల్(డ్రైవర్స్-పురుషులు) అభ్యర్థులు డ్రైవింగ్ టెస్ట్‌కు హాజరుకావాల్సి ఉంటుంది. డ్రైవింగ్ టెస్ట్, మెకానిక్ ట్రేడ్ టెస్ట్‌ను ఎస్ఏఆర్ సీబీఎల్ అంబర్‌పేట్‌లో నిర్వహిస్తారు.

డ్రైవింగ్, మెకానిక్ ట్రేడ్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఏప్రిల్ 27 ఉదయం 8 గంటల నుంచి నుంచి 30 వరకు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. TSLPRB అధికారిక వెబ్‌సైట్ www.tslprb.in లో అభ్యర్థులు తమ వివరాలు ఎంటర్ చేసి హాల్ టికెట్లు తీసుకోవచ్చు. ఒకవేళ అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ చేయడంలో ఏవైనా సమస్యలు తలెత్తితే support@tslprb.in ఇమెయిల్ ఐడీకి కంప్లైంట్ చేయొచ్చు. లేదా 9393711110, 93910 05006 నెంబర్లలో సంప్రదించొచ్చు.

Photos: సెల్ఫీ కెమెరా 32 మెగాపిక్సెల్‌... రిలీజైన రెడ్‌మీ వై3




ఇవి కూడా చదవండి:

Jio Apps: మీ స్మార్ట్‌ఫోన్‌లో ఈ జియో యాప్స్ ఉన్నాయా? ఉపయోగాలు తెలుసుకోండి

RRB: రైల్వే జాబ్‌కు అప్లై చేస్తున్నారా? ఆధార్ తప్పనిసరి అంటున్న ఆర్ఆర్‌బీ
Loading...
Tata Sky New Packs: డీటీహెచ్ ప్లాన్స్‌ ధరల్ని తగ్గించిన టాటా స్కై... కొత్త తెలుగు ప్యాక్స్ ఇవే
First published: April 25, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...