తెలంగాణ ఎంసెట్ (TS EAMCET 2022) తొలి విడుత కౌన్సెలింగ్ ప్రస్తుతం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ముఖ్యమైన సీట్ల కేటాయింపు (TS EAMCET Seats Allotment Order) ప్రక్రియ ముగిసింది. మంగళవారం రాత్రి అధికారులు విద్యార్థులకు వారు ఇచ్చిన ఆప్షన్ల ఆధారంగా సీట్ల కేటాయింపును పూర్తి చేశారు. మొత్తం కన్వీనర్ కోటాలో 71,286 సీట్లు ఉండగా.. 60,208 సీట్లు భర్తీ అయినట్లు అధికారులు వెల్లడించారు. దాదాపు 11,078 సీట్లు మిగిలిపోయినట్లు తెలిపారు. సీట్లు పొందిన అభ్యర్థులు ఈ నెల 13వ తేదీలోపు ఫీజు చెల్లించాలని అధికారులు ప్రకటనలో పేర్కొన్నారు. అనంతరం 17-21 తేదీల మధ్య ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. అయితే కంప్యూటర్ సైన్స్ (Computer Science), ఐటీ (IT) సంబంధిత గ్రూపుల్లో సీట్లు భారీగా భర్తీ అయ్యాయి. ఇందుకు సంబంధించి కన్వీనర్ కోటాలో మొత్తం 41,506 సీట్లు ఉండగా.. 40,878 సీట్లు భర్తీ అయ్యాయి. అంటే 98.49 శాతం సీట్లు భర్తీ అయినట్లు అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించి కేవలం 628 సీట్లు మాత్రమే మిగిలాయి.
కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ (CSE)కి సంబంధించి మొత్తం 18,682 సీట్లు అందుబాటులో ఉండగా.. కేవలం 16 సీట్లు మాత్రమే భర్తీ కాకుండా మిగిలిపోయాయి. అంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ (CSE) గ్రూప్ కు డిమాండ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ కు సంబంధించిన బ్రాంచీల్లో 80.96 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఇంకా సివిల్, మెకానికల్ కు సంబంధించి విద్యార్థులు పెద్దగా ఆసక్తి చూపలేదు. ఆ బ్రాంచీల్లో కేవలం 36.75 శాతం సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఒక యూనివర్సిటీ, 31 ప్రైవేటు కాలేజీల్లో 100 శాతం సీట్లు నిండాయి.
సీట్లు పొందిన అభ్యర్థులు అలాట్మెంట్ ఆర్డర్ ను ఈ కింది స్టెప్స్ తో డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది..
Step 1: అభ్యర్థులు తొలుత ఎంసెట్ అధికారిక వెబ్ సైట్ https://tseamcet.nic.in/default.aspx ఓపెన్ చేయాలి.
Step 2: అనంతరం Candidates Login ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
Step 3: Login ID No, TS EAMCET Hall Ticket No, Password, Date of Birth వివరాలను నమోదు చేసి, Sign-in ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
Step 4: అనంతరం కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో Allotment Order ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
Step 4: దీంతో స్క్రీన్ పై అలాట్మెంట్ ఆర్డర్ కనిపిస్తుంది. ఆ ఫామ్ ను ప్రింట్ తీసుకోవాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Engineering course, JOBS, TS EAMCET 2022