కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రవేశ పరీక్షలు (CPGET) 2022 కోసం ఆన్‌లైన్ దరఖాస్తు(Online Application) ప్రక్రియకు ఈ రోజు (జూలై 4) చివరి తేది. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ cpget.tsche.ac.in లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రోజు వరకు ఎలాంటి అపరాద రుసుము లేకుండా దరఖాస్తులను ఆహ్వానిస్తారు. రూ. 500 మరియు రూ. 2000 ఆలస్య రుసుముతో దరఖాస్తును(Application) సమర్పించడానికి చివరి తేదీ వరుసగా జూలై 11, జూలై 15 గా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. వివిధ PG (MA, MSc, MCom) కోర్సులు, PG డిప్లొమా కోర్సులు మరియు 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్‌లలో (MA, MSc, MBA) ప్రవేశాల కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయం రాష్ట్ర స్థాయి కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రవేశ పరీక్షలు (CPGET) 2022 నిర్వహిస్తుంది. 2022-2023 విద్యా సంవత్సరానికి ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, మహాత్మా గాంధీ, పాలమూరు, శాతవాహన మరియు జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయాలు అందిస్తున్నాయి.
రిజిస్ట్రేషన్ ఫీజు
ఒక్క సబ్జెక్టుకు రిజిస్ట్రేషన్ ఫీజు OC/BC అభ్యర్థులకు రూ. 800 మరియు SC/ST/PH అభ్యర్థులకు రూ.600. ప్రతి అదనపు సబ్జెక్టుకు, అన్ని కేటగిరీలకు రుసుము రూ. 450.
CPGET 2022 కోసం ఇలా దరఖాస్తు చేసుకోండి..
Step 1: cpget.tsche.ac.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి
Step 2: హోమ్‌పేజీలో, Application Fee Paymentపై క్లిక్ చేయండి
Step 3: వివరాలను అందులో పొందుపరిచి ఫీ పే చేయాల్సి ఉంటుంది.
Step 4: ఫీజు చెల్లించిన వెంటనే దరఖాస్తు ఫారమ్ ఓపెన్ అవుతుంది. అందులో తమ వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది.
Step 5: దరాఖాస్తు చేసుకోవడం పూర్తి అయిన తర్వాత దానిని డౌన్‌లోడ్ చేసి, ప్రింట్ తీసుకొని దగ్గర పెట్టుకోండి.
ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, మహాత్మాగాంధీ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, జేఎన్‌టీయూహెచ్ యూనివర్సిటీ, మహిళా యూనివర్సిటీల్లో సంప్రదాయ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష (సీపీగెట్-2022) ను జులై 20 నుంచి నిర్వహించాలని తాత్కాలికంగా నిర్ణయించారు . అన్ని సబ్జెక్టులలో (MPEdతో సహా) ప్రవేశ పరీక్షలు 100 మార్కులకు 100 మల్టిపుల్ చాయిస్ ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు ఉంటాయి. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా నోటిఫికేషన్ చదువుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Entrance exams, JOBS, Ts cpget 2022