Home /News /jobs /

TSBIE RELEASED TELANGANA INTERMEDIATE EXAMS 2021 FEE PAYMENT SCHEDULE CHECK HERE FOR IMPORTANT DATES SS

Telangana Inter Exams 2021: తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్... ఎగ్జామ్ ఫీజు షెడ్యూల్ విడుదల... ఈ డేట్స్ గుర్తుంచుకోండి

Telangana Inter Exams 2021: తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్... ఎగ్జామ్ ఫీజు షెడ్యూల్ విడుదల... ఈ డేట్స్ గుర్తుంచుకోండి
(ప్రతీకాత్మక చిత్రం)

Telangana Inter Exams 2021: తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్... ఎగ్జామ్ ఫీజు షెడ్యూల్ విడుదల... ఈ డేట్స్ గుర్తుంచుకోండి (ప్రతీకాత్మక చిత్రం)

Telangana Inter Exams 2021 Fee Schedule | తెలంగాణలోని ఇంటర్మీడియట్ విద్యార్థులకు అలర్ట్. ఇంటర్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదలైంది. ఈ ముఖ్యమైన డేట్స్ గుర్తుంచుకోండి.

    తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించిన డీటెయిల్డ్ షెడ్యూల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఈ పరీక్షలకు సంబంధించిన ఫీజు చెల్లింపుల కోసం షెడ్యూల్ ప్రకటించింది తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్-TSBIE. 2021 మార్చిలో ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్ రాయాలనుకునే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ రెగ్యులర్ విద్యార్థులతో పాటు ఫెయిల్ అయిన జనరల్, వొకేషనల్ విద్యార్థులు, అటెండెన్స్ లేని ప్రైవేట్ విద్యార్థులు గడువు లోగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫీజు చెల్లింపు షెడ్యూల్ ఈ విధంగా ఉంది.

    TS Inter Exams 2021: తెలంగాణలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల... ఏ పరీక్ష ఎప్పుడంటే

    Telangana Post Office Jobs: తెలంగాణలోని పోస్ట్ ఆఫీసుల్లో 1150 ఉద్యోగాలు... టెన్త్ పాసైతే చాలు

    Telangana Inter Exams 2021: ఫీజు చెల్లించడానికి గుర్తుంచుకోవాల్సిన తేదీలు ఇవే


    ఫీజు చెల్లింపు ప్రారంభం- 2021 జనవరి 30
    ఫీజు చెల్లించడానికి చివరి తేదీ- 2021 ఫిబ్రవరి 11
    రూ.100 లేట్ ఫీజుతో ఎగ్జామ్ ఫీజు చెల్లింపు- 2021 ఫిబ్రవరి 12 నుంచి 2021 ఫిబ్రవరి 22
    రూ.500 లేట్ ఫీజుతో ఎగ్జామ్ ఫీజు చెల్లింపు- 2021 ఫిబ్రవరి 23 నుంచి 2021 మార్చి 2
    రూ.1000 లేట్ ఫీజుతో ఎగ్జామ్ ఫీజు చెల్లింపు- 2021 మార్చి 3 నుంచి 2021 మార్చి 9
    రూ.2000 లేట్ ఫీజుతో ఎగ్జామ్ ఫీజు చెల్లింపు- 2021 మార్చి 10 నుంచి 2021 మార్చి 16

    HCL Recruitment drive: నిరుద్యోగులకు శుభవార్త... విజయవాడలో 1000 పోస్టుల భర్తీకి హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్

    Indian Navy Recruitment 2021: ఇంటర్ అర్హతతో ఇండియన్ నేవీలో ఉద్యోగాలు... నేటి నుంచి దరఖాస్తులు

    తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్స్ మే 1 నుంచి మే 19 వరకు, ఇంటర్ సెకండియర్ ఎగ్జామ్స్ మే 2 నుంచి మే 20 వరకు జరుగుతాయి. ఈ ఎగ్జామ్స్ ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఎగ్జామ్స్ ఉంటాయి. ఇంటర్ పరీక్షల కన్నా ముందే ఏప్రిల్ 7 నుంచి ఏప్రిల్ 20 వరకు ప్రాక్టికల్ పరీక్షలు ఉంటాయి. ఏప్రిల్ 1న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ ఎగ్జామ్, ఏప్రిల్ 3న ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్ ఉంటుంది. వొకేషనల్ కోర్సులకు కూడా ఇదే టైమ్ టేబుల్ ఉంటుంది.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: CAREER, Exams, Intermediate exams, NOTIFICATION, Telangana, Telangana inter board, Telangana News, Telangana updates, Telugu news, Telugu updates, Telugu varthalu

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు