తెలంగాణ ప్రభుత్వం ఇటీవల టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) నోటిఫికేషన్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే.. SGTకి సంబంధించి పేపర్ 1, స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి పేపర్-2 నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అయితే.. బీఈడీ పూర్తిచేసిన తెలుగు, హిందీ, ఉర్దూ లాంగ్వేజీ పండిట్ అభ్యర్థులు కూడా పేపర్ 2 నే రాయాల్సిన పరిస్థితి ఉంది. ఈ పేపర్లో పండిట్లకు సంబంధంలేని సబ్జెక్టులైన సోషల్, మ్యాథ్స్ కు సంబంధించి 60 మార్కులు ఉండడంతో తాము టెట్లో క్వాలిఫై కాలేకపోతున్నామని బాషా పండిట్లు చెబుతున్నారు. తమ కోసం పేపర్- 3 నిర్వహించాలి భాషాపండిట్లు కోరుతున్నారు. పొగురు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం లాంగ్వేజీ పండిట్ల కోసం టెట్ పేపర్–3ని నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనూ లాంగ్వేజీ పండిట్లకు వారి సంబంధిత సబ్జెక్టులతో కూడిన ప్రశ్నాపత్రం ఇవ్వాలని అభ్యర్థులు కోరుతున్నారు.
పేపర్ 3 ఎగ్జామ్ నిర్వహిస్తే 30వేల మంది అభ్యర్థులకు లాభం కలుగుతుంది అభ్యర్థులు చెబుతున్నారు ఇటీవల ఈ మేరకు పలువురు మంత్రి సబితారెడ్డిని కోరగా ఆమె కూడా సానుకూలంగా స్పందించారు. అధికారులు సైతం పేపర్ –3 నిర్వహించేందుకు ఉన్న సానుకూల అంశాలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి పంపించారు. ఈ అంశంపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.
TET 2022: టెట్ అభ్యర్థులకు అలర్ట్.. దరఖాస్తుకు పాత హాల్ టికెట్ నంబర్ మస్ట్.. ఇలా తెలుసుకోండి
ఇదిలా ఉంటే.. టెట్ కు హాజరయ్యే అభ్యర్థులు సిలబస్ తో పాటు ఎన్ని మార్కులకు క్వాలిఫై అవుతామన్న వివరాలను తప్పక తెలుసుకోవాల్సి ఉంటుంది. టెట్ లో పేపర్ -1, పేపర్-2కు ఉంటాయి. ప్రతీ పేపర్ కు కూడా 150 మార్కులు ఉంటాయి. అయితే.. అభ్యర్థులు వారి విద్యార్హత, ఆసక్తి, ఎంచుకున్న పోస్టు ఆధారంగా పేపర్-1 లేదా పేపర్ 2 ను ఎంచుకుంటారు. అయితే జనరల్ అభ్యర్థులు 60 శాతం మార్కులు సాధిస్తే టెట్ లో క్వాలిఫై అవుతారు.
బీసీ అభ్యర్థులు అయితే 50 శాతానికి పైగా మార్కులు సాధిస్తే సరిపోతుంది. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు అయితే 40 శాతానికి పైగా మార్కులు సాధిస్తే సరిపోతుంది. అయితే.. టెట్ లో మంచి మార్కులు సాధిస్తే టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్ లోనూ ప్రయోజనం ఉంటుంది. టెట్ స్కోర్ కు TRT(టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్)లో 20 శాతం వెయిటేజీ ఉంటుంది. టెట్ లో మంచి స్కోర్ సాధిస్తే జాబ్ వచ్చే అవకాశాలు పెరుగుతాయన్న విషయాన్ని అభ్యర్థులు గుర్తించుకోవాల్సి ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.