Home /News /jobs /

TS TET 2022 TELANGANA STATE TEACHERS ELIGIBILITY TEST 2022 NOTIFICATION RELEASED KNOW IMPORTANT DATES AND DOWNLOAD NOTIFICATION HERE SS

TS TET 2022 Notification: తెలంగాణ టెట్ నోటిఫికేషన్ వచ్చేసింది... ఈసారి మార్పులివే

TS TET 2022 Notification: తెలంగాణ టెట్ నోటిఫికేషన్ వచ్చేసింది... ఈసారి మార్పులివే
(ప్రతీకాత్మక చిత్రం)

TS TET 2022 Notification: తెలంగాణ టెట్ నోటిఫికేషన్ వచ్చేసింది... ఈసారి మార్పులివే (ప్రతీకాత్మక చిత్రం)

TS TET 2022 Notification | తెలంగాణ స్టేట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2022 నోటిఫికేషన్ వచ్చేసింది. నోటిఫికేషన్ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

    తెలంగాణలో టీచర్ పోస్టుల భర్తీ కోసం ఎదురుచూస్తున్నవారికి గుడ్ న్యూస్. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కన్నా ముందు తెలంగాణ ప్రభుత్వం టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TS TET 2022) నిర్వహించనుంది. తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థులు మార్చి 26 నుంచి ఏప్రిల్ 12 వరకు అప్లై చేయొచ్చు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేయాలి. జూన్ 12న టెట్ జరగనుంది. టెట్ పూర్తైన తర్వాత టీచర్ పోస్టుల భర్తీకి రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్ జరగనుంది. ఈసారి టెట్ అర్హతలు, నిర్వహణకు సంబంధించి కొన్ని మార్పులు ఉన్నాయి. గతంలో బీఈడీ అభ్యర్థులు టెట్ పేపర్ 2 మాత్రమే రాసే అవకాశం ఉండేది. డిప్లొమా అభ్యర్థులు టెట్ పేపర్ 1 రాసేవారు. కానీ ఈసారి బీఈడీ అభ్యర్థులు కూడా టెట్ పేపర్ 1 రాయొచ్చు. జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి ఆదేశాల మేరకు ఈ మార్పులు చేసింది ప్రభుత్వం.

    TS TET 2022 Notification: గుర్తుంచుకోవాల్సిన తేదీలు


    దరఖాస్తు ప్రారంభం- 2022 మార్చి 26
    దరఖాస్తుకు చివరి తేదీ- 2022 ఏప్రిల్ 12
    ఆన్‌లైన్ ఫీజు పేమెంట్- 2022 మార్చి 26 నుంచి ఏప్రిల్ 11
    హెల్ప్ డెస్క్ సేవలు- 2022 మార్చి 26 నుంచి ఏప్రిల్ 12 వరకు
    హాల్ టికెట్స్ డౌన్‌లోడ్- 2022 జూన్ 6 నుంచి
    పరీక్ష తేదీ- 2022 జూన్ 12 (పేపర్ 1 ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, పేపర్ 2 మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు)
    ఫలితాల విడుదల- 2022 జూన్ 27

    SIDBI recruitment 2022: రూ.70,000 వేతనంతో అసిస్టెంట్ మేనేజర్ జాబ్స్... డిగ్రీ పాసైతే చాలు


    బీఈడీ అభ్యర్థులకు టెట్ పేపర్ 1 రాసే అవకాశం ఇవ్వడంతో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు బోధించే సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (SGT) పోస్టులకు పోటీ పడొచ్చు. ఉద్యోగం వచ్చిన తర్వాత రెండేళ్లలో ప్రాథమిక విద్యలో 6 నెలల బ్రిడ్జి కోర్సు చేయాల్సి ఉంటుంది. ఇక గతంలో టెట్ వేలిడిటీ ఏడేళ్లు మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు టెట్ వేలిడిటీని లైఫ్‌టైమ్ చేసింది ప్రభుత్వం. అంటే ఒక్కసారి టెట్ క్వాలిఫై అయితే ఆ సర్టిఫికెట్‌కు జీవితాంతం వేలిడిటీ ఉంటుంది. టెట్ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://tstet.cgg.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

    LIC Recruitment 2022: టెన్త్ పాసైనవారికి ఎల్ఐసీలో జాబ్స్... త్వరలో ముగియనున్న దరఖాస్తు గడువు

    తెలంగాణ ప్రభుత్వం 80,039 పోస్టుల్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో సెకండరీ ఎడ్యుకేషన్‌లో 13,086 పోస్టులున్నాయి. 6,500 సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (SGT) పోస్టులు, 2,000 పైగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 600 వరకు భాషా పండితుల పోస్టులు ఉన్నాయి. అవసరమైతే మరో 10,000 పోస్టుల్ని కూడా భర్తీ చేస్తామని తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Govt Jobs 2022, JOBS, State Government Jobs, Telangana government jobs, Telangana jobs, TS TET 2022

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు