TS TET 2022 HALL TICKETS WILL BE AVAILABLE FROM TODAY IN HTTPS TSTET CGG GOV IN HERE DETAILS NS
TS TET 2022 Hall Tickets: తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్.. ఈ రోజు నుంచే హాల్ టికెట్లు.. ఈ స్టెప్స్ తో డౌన్ లోడ్ చేసుకోండి
ప్రతీకాత్మక చిత్రం
తెలంగాణ టెట్ హాల్ టికెట్లు (TS TET 2022 Hall Tickets) ఈ రోజు నుంచి అధికారిక వెబ్ సైట్ (https://tstet.cgg.gov.in/) నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET-2022) కు సంబంధించిన ఎగ్జామ్ ను ముందుగా ప్రకటించిన విధంగానే ఈ నెల 12న నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇందుకు సంబంధించిన హాల్ టికెట్లను (TS TET Hall Tickets) ఈ రోజు విడుదల చేయనున్నారు. మధ్యాహ్నం 1.30 గంటల నుంచి హాల్ టికెట్లు అధికారిక వెబ్ సైట్లో అందుబాటులో ఉంటాయని టెట్ కన్వీనర్ రాధారెడ్డి వెల్లడించారు. అభ్యర్థులు మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత అధికారిక వెబ్ సైట్ https://tstet.cgg.gov.in/ నుంచి తమ హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
అభ్యర్థులు టెట్ హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాడానికి ఈ స్టెప్స్ ను ఫాలో కావాల్సి ఉంటుంది.. Step1:అభ్యర్థులు మొదటగా టెట్ అధికారిక వెబ్ సైట్ https://tstet.cgg.gov.in/ ను ఓపెన్ చేయాలి. Step 2:అనంతరం TS TET 2022 Hall tickets లింక్ హోం పేజీలో కనిపిస్తుంది. Step 3:అభ్యర్థులు ఆ లింక్ పై క్లిక్ చేయాలి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. Step 4:అక్కడ Candidate Id తో పాటు సూచించిన ఇతర వివరాలను నమోదు చేయాలి. Step 5:అనంతరం సబ్మిట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. Step 6:దీంతో హాల్ టికెట్ స్క్రీన్ పై కనిపిస్తుంది. దానిని డౌన్ లోడ్ చేసుకుని పీడీఎఫ్ ను భద్రపరుచుకోవాలి. Teaching Jobs: ఆర్మీ స్కూల్లో ఉద్యోగ అవకాశాలు.. వేతనం రూ. 34,000.. దరఖాస్తు వివరాలు
ఇదిలా ఉంటే.. ఈ నెల 12న ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు టెట్ ఎగ్జామ్ పేపర్- 1 పరీక్షను నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్- 2 పరీక్ష ఉంటుంది. అన్ని జిల్లాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. పేపర్- 1కు సంబంధించి 3,51,468 మంది, పేపర్- 2కు 2,77,884 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.