Home /News /jobs /

TS TET 2022 HALL TICKETS RELEASED CANDIDATES CAN DOWNLOAD THEIR HALL TICKET WITH THIS DIRECT LINK NS

TS TET 2022 Hall Tickets Download: తెలంగాణ టెట్ హాల్ టికెట్లు విడుదల.. ఈ డైరెక్ట్ లింక్ తో డౌన్ లోడ్ చేసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణ టెట్ (TS TET 2022) కు సంబంధించిన హాల్ టికెట్లను (TS TET Hall tickets) అధికారులు కొద్ది సేపటి క్రితం విడుదల చేశారు. అభ్యర్థులు వారి హాల్ టికెట్లను ఈ లింక్ తో నేరుగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

    తెలంగాణ టెట్ (TS TET 2022) కు సంబంధించిన హాల్ టికెట్లను అధికారులు కొద్ది సేపటి క్రితం విడుదల చేశారు. అభ్యర్థులు https://tstet.cgg.gov.in/ వెబ్ సైట్ నుంచి నేరుగా తమ హాల్ టికెట్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.   ఈ నెల 12న ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు టెట్ ఎగ్జామ్ (TS TET 2022 Exam) కు సంబంధించిన పేపర్‌- 1 పరీక్షను (TET Paper 1) నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్‌- 2 (TET Paper 2) పరీక్ష ఉంటుంది. అన్ని జిల్లాల్లో పరీక్షా కేంద్రా‌లను ఏర్పాటు చేశారు అధికారులు. పేపర్‌- 1కు సంబంధించి 3,51,468 మంది, పేపర్‌- 2కు 2,77,884 మంది అభ్యర్థులు హాజ‌రు‌కా‌ను‌న్నారు. భారీగా అభ్యర్థులు నమోదు చేసుకోవడంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవడానికి అభ్యర్థులు ఈ కింది స్టెప్స్ ను ఫాలో కావాల్సి ఉంటుంది.
    TS TET-2022: టీఎస్ టెట్‌-2022కి ప్రిపేర్ అవుతున్నారా.. టాపిక్‌ల వారీగా ఎన్ని ప్ర‌శ్న‌లు వ‌స్తాయో తెలుసుకోండి!

    Step 1: మొదటగా అధికారిక వెబ్ సైట్ https://tstet.cgg.gov.in ను ఓపెన్ చేయాలి.
    Step 2: హోం పేజీలో Services విభాగంలో Download Hall Ticket అనే ఆప్షన్ కనిపిస్తుంది.
    Step 3: అభ్యర్థులు ఆ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. అక్కడ Candidate Id, డేట్ ఆఫ్ బర్త్ నమోదు చేయాల్సి ఉంటుంది.
    Step 4: అభ్యర్థులు ఆ రెండు వివరాలను నమోదు చేసి సబ్మిట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
    Step 5: దీంతో మీ హాల్ టికెట్ స్క్రీన్ పై కనిపిస్తుంది. హాల్ టికెట్ ను పీడీఎఫ్ ఫార్మాట్లో డౌన్ లోడ్ చేసుకుని భద్రపరుచుకోవాలి.
    TS Jobs Mock Tests: ప్రభుత్వ ఉద్యోగార్ధులకు కేసీఆర్ సర్కార్ శుభవార్త.. ఫ్రీగా వేలాది మాక్ టెస్ట్ లు రాసే ఛాన్స్.. ఆన్లైన్లో ఇలా రాసేయండి

    తెలంగాణలో టెట్ (TS TET 2022) ఎగ్జామ్ వాయిదా వేయాలని కొందరు అభ్యర్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. జూన్ 12న టెట్ ను నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించంది. ఈ మేరకు హాల్ టికెట్లను సైతం విడుదల చేసింది. అయితే, అదే రోజు RRB ఎగ్జామ్ కూడా ఉండడంతో ఆ రెండు పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు టెట్ ను వాయిదా వేయాలని కోరుతున్నారు. తాజాగా ఓ అభ్యర్థి ఈ విషయంపై మంత్రి కేటీఆర్ కు (Minister KTR) ట్వీట్ చేశారు. దీంతో స్పందించిన కేటీఆర్.. ఈ విషయాన్ని పరిశీలించాలని మంత్రి సబితారెడ్డిని ట్విట్టర్ ద్వారా కోరారు. అయితే.. మంత్రి సబితారెడ్డి ఈ అంశంపై స్పందించారు. ప్రస్తుత పరిస్థితుల్లో టెట్ వాయిదా వేయడం కుదరదని స్పష్టం చేశారు. దీంతో టెట్ ఎగ్జామ్ ఇక వాయిదా పడే అవకాశం లేనట్లే.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Exams, JOBS, Teacher jobs, Telangana government jobs, TS TET 2022

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు