టెట్(TET) నోటిఫికేషన్లో(Notification) వెల్లడించిన విధంగా జూన్ 27 న ఫలితాలు రావాల్సి ఉండగా.. అవి వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే ఫైనల్ కీని కూడా ఫలితాల విడుదల రోజు వెల్లడిస్తారని అభ్యర్థులు భావించారు. కానీ అనూహ్యంగా నేడు అర్థరాత్రి 10 గంటలకు ఫైనల్ కీ https://tstet.cgg.gov.in/ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు. ఫైనల్ కీ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. జూలై 1వ తేదీన టెట్ ఫలితాలను విద్యా శాఖ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. జూన్ 12న టెట్ పరీక్ష నిర్వహించగా.. పేపర్ 1కు 3,18,506, పేపర్-2కు 2,51,070 మంది అభ్యర్థులు హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 90% మంది అభ్యర్థులు హాజరయ్యారు.
ఈ నెల15న ప్రైమరీ కీ విడుదల చేశారు. పేపర్ 1 (TS TET 2022 Paper 1) కు సంబంధించి మొత్తం 7,930 అభ్యంతరాలు రాగా.. టెట్ పేపర్ 2కు (TS TET 2022 Paper 2) సంబంధించి 4,663 అభ్యంతరాలను అభ్యర్థులు వ్యక్తం చేశారు.ఈ మేరకు విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది. ఈ అభ్యంతరాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం ఫైనల్ కీని విడుదల చేశారు.
రేపు పది ఫలితాలు..
తెలంగాణ ప్రభుత్వం రేపు (జూన్ 30న) 10వ తరగతి పరీక్ష ఫలితాలను ప్రకటించనుంది. తెలంగాణ 10వ తరగతి 2022 పరీక్షలకు హాజరైన విద్యార్థులు తమ స్కోర్లను అధికారిక వెబ్సైట్ bse.telangana.govలో చూసుకోవచ్చు. ఉదయం 11:30 గంటలకు ఈ ఫలితాలు వెలువడనున్నాయి. రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తెలంగాణ పదో తరగతి ఫలితాలు వెల్లడికానున్నాయి. మే 23 నుంచి జూన్ 1 వరకు జరిగిన TS SSC పరీక్షలకు 5 లక్షలకు పైగా విద్యార్థులు హాజరయ్యారు. తెలంగాణ బోర్డు నిర్దేశించిన ఉత్తీర్ణత ప్రమాణాలకు అర్హత సాధించాలంటే విద్యార్థులు కనీసం 35 శాతం సాధించాలి. ప్రాక్టికల్స్‌తో కూడిన సబ్జెక్టుల్లో విద్యార్థులు థియరీ, ప్రాక్టికల్ పరీక్షల్లో విడివిడిగా ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.
100 మార్కుల పేపర్‌పై ఉత్తీర్ణత మార్కులు 40 అయితే 80 మార్కుల పేపర్‌పై ఉత్తీర్ణత మార్కులు 20. అయితే ఒకటి లేదా రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయిన వారు కంపార్ట్మెంట్ పరీక్షలకు హాజరయ్యే అవకాశం ఉంటుంది. 2021లో, కోవిడ్-19 పరిస్థితి కారణంగా తెలంగాణ TS SSC పరీక్షలు నిర్వహించబడలేదు. ఇంటర్నల్ మార్కుల ఆధారంగా మూల్యాంకనం చేసి విద్యార్థులందరినీ తదుపరి తరగతికి ప్రమోట్ చేశారు. 2019 తెలంగాణ 10వ తరగతి ఫలితాల్లో మొత్తం ఉత్తీర్ణత శాతం 92.43గా ఉంది. 2018లో ఉత్తీర్ణత శాతం 83.78 కాగా, 2017లో ఉత్తీర్ణత శాతం 84.15గా ఉంది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.