TS TET 2022 EXAM HERE IS THE 10 IMPORTANT INSTRUCTIONS TO CANDIDATES NS
TS TET 2022 Instructions: తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్.. పరీక్షలో ఈ 10 రూల్స్.. తప్పక తెలుసుకోండి
ప్రతీకాత్మక చిత్రం
ఈ నెల 12న అంటే ఆదివారం తెలంగాణలో టెట్ ఎగ్జామ్ (TS TET Exam) ను నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పరీక్ష కు హాజరయ్యే ముందు అభ్యర్థులు తప్పక తెలుసుకోవాల్సిన 10 రూల్స్ ఇవే..
ఎల్లుండి తెలంగాణ వ్యాప్తంగా టెట్ ఎగ్జామ్ (TS TET 2022) నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో అధికారులు అభ్యర్థులకు పలు సూచనలు చేశారు. ఇప్పటికే టెట్ హాల్ టికెట్లను (TS TET 2022 Hall Tickets) అధికారులు విడుదల చేసిన విషయం తెలిసిందే. అభ్యర్థులు Candidate ID, డేట్ ఆఫ్ బర్త్ నమోదు చేసి టెట్ హాల్‌టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అభ్యర్థుల ఫొటో, సంతకం హాల్ టికెట్ పై లేకుంటే అటెస్టేషన్ తప్పనిసరి అని టెట్ కన్వీనర్ రాధారెడ్డి ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. ఫొటో, సంతకం సరిగాలేకపోయినా, అసలు లేకపోయినా సదరు అభ్యర్థులు హాల్‌టికెట్‌పై ఇటీవలే తీయించుకున్న ఫొటోను అతికించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. అనంతరం దానిని గెజిటెడ్ అధికారిచే అటెస్టేషన్ చేయించుకోవాలని స్పష్టం చేశారు ఆయన. అనంతరం ఆధార్‌కార్డు లేదా ఇతర ఐడీకార్డుతో సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి (DEO)ను సంప్రదించాలన్నారు. డీఈవో పరిశీలన అనంతరం అభ్యర్థులను టెట్ ఎగ్జామ్ ను రాయడానికి అనుమతిస్తామని ఆయన వెల్లడించారు.
-ఇంకా అభ్యర్థుల పేరు, తల్లి, తండ్రి పేరు, పుట్టిన తేదీ, కులం, లింగం, పీహెచ్సీ తదితర వివరాల్లో ఏమైనా తప్పులు ఉంటే.. ఎగ్జామ్ సెంటర్లో నామినల్‌రోల్ కమ్ ఫొటో ఐడెంటిటీలో వాటిని సరిచేసుకునే అవకాశం ఉంటుందని టెట్ కన్వీనర్ రాధారెడ్డి స్పష్టం చేశారు.
-టెట్ ఎగ్జామ్ పేపర్ 1 ఉదయం 9.30 గంటల నుంచి.. మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. పేపర్ 2 మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది.
-అభ్యర్థులను గంట ముందు నుంచే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తామని చెప్పారు. -ఉదయం పరీక్షకు 9.30 గంటల తర్వాత, మధ్యాహ్నం పరీక్షకు 2.30 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ అనమతించేది లేదని స్పష్టం చేశారు.
-ఇంకా పరీక్ష సమయం ముగిసే వరకు అంటే ఉదయం పరీక్షకు 12 గంటల వరకు, మధ్యాహ్నం పరీక్షకు సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులను బయటకు పంపించే ప్రసక్తే లేదన్నారు. అభ్యర్థులు పరీక్షా సమయం ముగిసే వరకు కూడా సెంటర్లలో వారికి కేటాయించిన సీట్లలోనే ఉండాల్సి ఉంటుందన్నారు. TS TET 2022 Hall Tickets Download: తెలంగాణ టెట్ హాల్ టికెట్లు విడుదల.. ఈ డైరెక్ట్ లింక్ తో డౌన్ లోడ్ చేసుకోండి
-అభ్యర్థులు క్యాలుక్లేటర్, సెల్ ఫోన్లు తదితర ఎలక్ట్రానిక్ పరికరాలను కేంద్రాల్లోకి తీసుకురావద్దని స్పష్టం చేశారు.
-అభ్యర్థులు రెండు బ్లాక్ బాల్ పాయింట్ పెన్లు, రైటింగ్ ప్యాడ్, హాల్ టికెట్‌తో పరీక్షా కేంద్రాలకు హాజరుకావాలని స్పష్టం చేశారు.
-అభ్యర్థులు పరీక్షను ప్రారంభించేముందు ఓఎంఆర్ షీట్ సైడ్-1 లో ఉన్న నిబంధనలను క్షుణ్ణంగా చదువుకోవాలని సూచించారు.
-ఎవరైనా అభ్యర్థులు మాల్‌ప్రాక్టీసింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.