హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

TS TET 2022: టెట్ అభ్యర్థులకు షాకిస్తున్న వెబ్ సైట్.. ఎగ్జామ్ సెంటర్స్ విషయంలో ట్విస్టులు.. వివరాలివే

TS TET 2022: టెట్ అభ్యర్థులకు షాకిస్తున్న వెబ్ సైట్.. ఎగ్జామ్ సెంటర్స్ విషయంలో ట్విస్టులు.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

టెట్ (TS TET 2022) కు దరఖాస్తు చేసుకునే సమయంలో అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

తెలంగాణలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు తాజాగా టెట్ (TS TET 2022) నోటిఫికేషన్ విడుదల చేసింది. టెట్ లో అర్హత సాధించిన అభ్యర్థులు టీచర్ నియామక (Teacher Jobs) పరీక్షలకు హాజరయ్యే అవకాశం ఉంటుంది. అయితే.. టెట్ దరఖాస్తు ప్రక్రియ మరో 4 రోజుల్లో ముగియనుంది. అయితే టెట్ కు సంబంధించి అధికారుల అంచానకు మంచి దరఖాస్తుల వస్తున్నాయి. దీంతో అభ్యర్థులకు కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి. టెట్ ఎగ్జామ్ కు అప్లై చేయాలనుకుంటున్న పలు జిల్లాల అభ్యర్థులకు వారి సొంత జిల్లాలో ఎగ్జామ్ కు హాజరయ్యే అవకాశం కలగడం లేదు. ఆయా జిల్లాల్లో అధికారుల అంచనాకు మించి దరఖాస్తులు రావడంతో పరీక్షకేంద్రాల (TET Exam Centers) కొరత ఏర్పడుతుంది. దీంతో అప్లై చేసే సమయంలో అభ్యర్థులకు వారి సొంత జిల్లాల్లోని పరీక్షా కేంద్రాన్ని ఎంచుకునే అవకాశం లేకుండా పోతోంది. దీంతో తప్పని పరిస్థితుల్లో పక్క జిల్లాలను ఎంచుకుంటున్నారు అభ్యర్థులు. తాము అప్లై చేసుకునే సమయంలో పరీక్షా కేంద్రాలను ఎంచుకునే సమయంలో ఆప్షన్లలో తమ జిల్లా పేరు కనిపించడం లేదని అభ్యర్థులు చెబుతున్నారు. తమ జిల్లాల్లోని పరీక్షా కేంద్రాల కెపాసిటీ ముగిసినట్లగా ఆన్లైన్లో చూపిస్తోందని వారు వాపోతున్నారు.

ఇప్పటివరకు ఆసిఫాబాద్, ఆదిలాబాద్‌, వికారాబాద్, నిజామాబాద్‌, ములుగు, జగిత్యాల జిల్లాల పేర్లు ఆన్‌లైన్‌లో కనిపించడం లేదు. అయితే, లాస్ట్ డేట్ వచ్చే సరికి ఇంకా ఎన్ని జిల్లాల పేర్లు ఆన్లైన్లో కనిపించకుండా పోతాయో తెలియని పరిస్థితి. అయితే పేపర్ 1కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు పక్క జిల్లాల్లో పరీక్షా కేంద్రాలు పడితే వారు ఒక రోజు ముందుగానే ఆయా జిల్లాలకు వెళ్లే పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో అధికారులు స్పందించి ఆయా జిల్లాల్లో పరీక్షా కేంద్రాలను పెంచి సమస్యను పరిష్కరించాలని అభ్యర్థులు కోరుతున్నారు.

TS TET 2022 Paper 2 Exam Pattern: తెలంగాణ టెట్ ఎగ్జామ్ పేపర్ 2 ప్యాటర్న్ ఇదే

టెట్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 26 నుంచి ప్రారంభమైంది. అభ్యర్థులు https://tstet.cgg.gov.inవెబ్ సైట్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి ముందు లేటెస్ట్ ఫొటో గ్రాఫ్ స్కానింగ్ ఇమేజ్, సిగ్నేచర్ స్కాన్ కాపీని సిద్ధంగా ఉంచుకోవాలి. టెన్త్ మెమో కాపీను కూడా వెంట ఉంచుకోవాలి. అందులో ఉన్నట్లుగా వివరాలను ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ లో నమోదు చేస్తే తప్పులు నమోదు కాకుండా ఉంటుంది.

First published:

Tags: Career and Courses, Exams, Telangana government jobs, TS TET 2022

ఉత్తమ కథలు